
ఈ ఆటోలు గర్భిణులకే..
గర్భిణుల కోసం ఉచిత ఆటో సర్వీస్‌లను ఐఎంఎం గుత్తి శాఖ ప్రారంభించింది. ఐఎంఎం సమకూర్చిన ఐదు ఆటోలను గుత్తిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గహంలో ఎస్‌ఐ చాంద్‌బాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా మాట్లాడుతూ... గర్భిణులను ఆస్పత్రికి, కాన్పు తర్వాత ఇంటికి ఎంత దూరమైన తమ ఆటోలలో ఉచితంగా తీసుకెళతారని వివరించారు.