జేసీబీ ఆపరేటర్‌ దుర్మరణం | Operator killed jcb | Sakshi
Sakshi News home page

జేసీబీ ఆపరేటర్‌ దుర్మరణం

Published Fri, Nov 25 2016 11:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

జేసీబీ ఆపరేటర్‌ దుర్మరణం - Sakshi

జేసీబీ ఆపరేటర్‌ దుర్మరణం

గుత్తి రూరల్‌ : లారీలో జేసీబీని తీసుకెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జేసీబీ ఆపరేటర్‌ దుర్మరణం చెందాడు. మరొక ఆపరేటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రాజేష్‌గౌడ్ (23), లద్దగిరి మండలం కొండాపురానికి చెందిన గొల్ల కృష్ణలు జేసీబీ ఆపరేటర్‌లుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వెల్దుర్తిలో పనులు ముగించుకుని రాయలచెరువుకు లారీలో జేసీబీని తీసుకెళ్తున్నారు. గుత్తి మండలం ఉబిచెర్ల వద్దకు రాగానే లారీ ముందు టైరు పంక్చర్‌ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతల్లోకి దూసెకెళ్లింది. అలా వెళ్లే సమయంలో వెనుక ఉన్న జేసీబీ ఒక్క సారిగా లారీ క్యాబిన్‌పైన పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కుపోయిన రాజేష్‌గౌడ్, గొల్ల కృష్ణలను పోలీసులు, స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో రాజేష్‌గౌడ్‌ మృతి చెందాడు. గొల్ల కృష్ణకు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్‌ఐ చాంద్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement