కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి | Building Collapse Tragedy In Anantapur | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి

Published Sat, Nov 20 2021 6:36 AM | Last Updated on Sat, Nov 20 2021 12:21 PM

Building Collapse Tragedy In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్‌ వీధిలో  నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్‌లో 15 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్‌నుంచి సురక్షితంగా బయట పడ్డారు.

ఇప్పటికి బిల్డింగ్‌లో చిక్కుకున్న కొందరు బాధితులతో.. ఫోన్‌లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డా . సిద్ధారెడ్డి స్వయంగా వైద్యం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement