Operator
-
విద్యుత్ ఆపరేటర్ హత్య
చేవెళ్ల: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన హర్యానాయక్ (40) రెండేళ్లుగా ఆలూ రు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే గురువారం రాత్రి కూడా విధి నిర్వహణలో ఉన్న అతను అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన ఎల్లకొండ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి కొంత మంది నేపాల్‌కు చెందిన వారు తనతో గొడవ పడుతున్నారని చెప్పాడు. శ్రీనివాస్ అక్కడికి వెళ్లి చూసే సరికి హర్యానాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నా డు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏడీ, ఏఈ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేవెళ్ల మండల విద్యుత్ ఏసీ నయీమొద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో.. ఆలూరు గ్రామంలోనే నేపాల్‌కు చెందిన వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అతడికి పెయింటింగ్ పనులు చేసే కొంతమంది స్నేహితులు ఉన్నారు. నేపాల్‌కు చెందిన వ్యక్తికి హర్యానాయక్‌కు పరిచయం ఉండటంతో గురువారం రాత్రి స్నేహితులతో కలిసి సబ్‌స్టేషన్‌కు వచి్చనట్టు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వమని, రాత్రికి అక్కడే పడుకుంటామని గొడవకు దిగినట్లు సమాచారం. దీనికి ఆపరేటర్ నిరాకరించటంతో మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హర్యానాయక్‌ను హత్యచేసి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు ఆఫీస్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రెడీ మిక్స్ ప్లాంట్‌లో దారుణం
మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్‌ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్ల నిర్మాణం చేస్తున్న ఏఎస్బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్‌ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.. పుప్పాలగూడ ఎస్బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలన్నారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్‌తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్‌ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్‌సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్‌లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్‌కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
పాట పెట్టమన్నందుకు.. ప్రాణం తీసేశాడు
సాక్షి, న్యూఢిల్లీ : అర్ధరాత్రి ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనకు నచ్చిన పాట పెట్టమని అడిగినందుకు ఓ డీజే ఆపరేటర్ పబ్‌కు వచ్చిన వ్యక్తిని హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ భాగ్ సమీపంలోని రఫ్తార్ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడానికి తన మిత్రులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా విజయ్‌పాల్ తనకు నచ్చిన పాట పెట్టాంటూ డీజే ఆపరేటర్‌ను కోరగా, కవ్వింపు చర్యలకు దిగాడు. దీంతో విజయ్‌పాల్, డీజే ఆపరేటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దాడిలో డీజే ఆపరేటర్ బలమైన వస్తువుతో సింగ్ తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్నేహితుల ఫిర్యాదు మేరకు పబ్ యాజమాన్యంతోపాటు, డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం..ఆపరేటర్ మృతి
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢీకొని కొండారెడ్డి అనే ఆపరేటర్ మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొండారెడ్డి మృతితో ఆయన కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
జేసీబీ ఆపరేటర్ దుర్మరణం
గుత్తి రూరల్ : లారీలో జేసీబీని తీసుకెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జేసీబీ ఆపరేటర్ దుర్మరణం చెందాడు. మరొక ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రాజేష్‌గౌడ్ (23), లద్దగిరి మండలం కొండాపురానికి చెందిన గొల్ల కృష్ణలు జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వెల్దుర్తిలో పనులు ముగించుకుని రాయలచెరువుకు లారీలో జేసీబీని తీసుకెళ్తున్నారు. గుత్తి మండలం ఉబిచెర్ల వద్దకు రాగానే లారీ ముందు టైరు పంక్చర్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతల్లోకి దూసెకెళ్లింది. అలా వెళ్లే సమయంలో వెనుక ఉన్న జేసీబీ ఒక్క సారిగా లారీ క్యాబిన్‌పైన పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కుపోయిన రాజేష్‌గౌడ్, గొల్ల కృష్ణలను పోలీసులు, స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో రాజేష్‌గౌడ్ మృతి చెందాడు. గొల్ల కృష్ణకు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్ఐ చాంద్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
కాంట్రాక్ట్ ఆపరేటర్... ఉపాధి ఏపీఓనా?
ఉప్పలగుప్తం : అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా ఉప్పలగుప్తం మండలంలో ఉపాధిహామీ విభాగం అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ)గా పనిచేస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎంపీడీవో స్థాయికి సమానమైన ఏపీఓ పోస్టు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా వేరే మండలం నుంచి ఉప్పలగుప్తం మండలానికి డిప్యుటేషపై వచ్చి పనిచేయడం గమనార్హం. మండలంలో ఏడాదికి పైగా ఉపాధి ఏపీఓ పోస్టు ఇ0చార్జిలతోనే నడుస్తోంది. కాట్రేనికోన ఏపీఓ కొంతకాలం ఇ0చార్జిగా పనిచేయగా, మండలంలోనే పని చేస్తున్న ఉపాధి ఈసీ ఎస్.కృష్ణభగవానును ఏపీఓగా నియమించారు. మూడు నెలలుగా ఈసీ భగవాను కూడా పత్తాలేరు. ఇక్కడ రిలీవ్ కాకుండానే రౌతులపూడి మండలానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. రెండు నెలలుగా ఉపాధిహామీ విభాగాన్ని నడిపించే నాథుడు లేక కిందిస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ఇద్దరు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రమోషను జాబితాలో ఉన్నవారే. అయితే ఏపీఓగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నియమించవచ్చు. కాని ఇక్కడ అలా జరగలేదు. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎం.సీతారాంను ఏపీఓగా నియమించించారు. ఈ వారంలో ఉపాధి ఆడిట్ ప్రారంభమవుతుంది. సదరు ఆపరేటర్ మండలానికి వచ్చిన నాటి నుంచి తానొక పలుకుబడి గల వ్యక్తినని, పంచాయతీరాజ్ కమిషనర్, డ్వామా పీడీలకు బాగా కావాల్సిన మనిషినని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పీఏగా పని చేశానని చెప్పుకుంటున్నారు. వారి అండతోనే కాంట్రాక్ట్ ఉద్యోగికి సాధ్యం కాదని చెబుతున్న ఏపీఓ పోస్టు తనకు వచ్చిందని ఆయనే బాహాటంగా చెబుతున్నాడు. పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్రస్థాయి అధికారితో ఉన్న సన్నిహిత సంబంధాలు సీతారామ్‌కు బాగా కలిసొచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. -
డామినోస్ పిజ్జా ఆపరేటర్‌కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. -
‘పొంజీ’ ఆపరేటర్లపై ఇక ఉక్కుపాదం!
♦ పదేళ్ల వరకూ జైలు శిక్ష... ♦ రూ. 50 కోట్ల జరిమానా కూడా... ♦ కొత్త బిల్లులో ప్రతిపాదించిన కేంద్రం న్యూఢిల్లీ: పొంజీ స్కీమ్ ఆపరేటర్లపై కొరడా ఝలిపించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం-డిపాజిటర్ల మనోభావాల పరిరక్షణ’ ముసాయిదా బిల్లు ప్రకారం.. అక్రమ సొమ్ము డిపాజిట్ పథకాలను నడిపిస్తున్న (పొంజీ ఆపరేటర్లు) వారు రూ.50 కోట్లు జరిమానా చెల్లించడం సహా పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అన్ని అనియంత్రిత డిపాజిట్ పథకాలన్నీ కూడా డ్రాఫ్ట్ బిల్లు పరిధిలోకి వస్తాయి. నిందితుడు ఒక ఏడాది తక్కువ కాకుండా జైలు శిక్ష (ఇది ఐదేళ్ల వరకు పొడిగించొచ్చు)తోపాటు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒక వ్యక్తి పదే పదే అక్రమాలకు పాల్పడితే అతను కనీసం ఐదేళ్లు (పదేళ్లకు పొడిగించొచ్చు) జైలు శిక్ష అనుభవించడంతోపాటు రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ బిల్లుపై ఏప్రిల్ 30 వరకు ప్రజాభిప్రాయాలను సేకరించనున్నది. -
అమాత్యా.. పవరేదీ?
చేవెళ్ల: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది విద్యుత్ అధికారుల పరిస్థితి. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి ప్రారంభించి నెలరోజులవుతున్నా ఇప్పటికీ దిష్టిబొమ్మలా మారింది. ఆపరేటర్లు లేరన్న నెపంతో నెల రోజులనుంచి ఇంకా విద్యుత్ సరఫరాను ఆ సబ్‌స్టేషన్ నుంచి ప్రారంభించలేదు. వివరాలోకి వెళితే.. ఈ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే అధికంగా ఆధార పడడంతో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్య తీవ్రంగా ఉంది. లో ఓల్టేజీతో బోరు మోటార్లు కాలిపోతుండడంతో రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎట్టకేలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, అప్పటి హోంమంత్రి సబితారెడ్డి శంఖుస్థాపన చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీసీపీడీసీఎల్ సాధారణ నిధుల నుంచి 33-11కేవీ సబ్‌స్టేషన్‌కు సుమారుగా రూ.రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పనులను పూర్తి చేశారు. ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే మంత్రి మెప్పు పొందడానికి పనులు పూర్తయిన నెలరోజుల తరువాత అక్టోబరు 14వ తేదీన రాష్ట్ర రవాణామంత్రి మహేందర్రెడ్డిచే అట్టహాసంగా ప్రారంభింపజేశారు. ఉపయోగం ఇదే.. ఈ సబ్‌స్టేషన్‌తో ఈర్లపల్లి, ఎనికెపల్లి, కమ్మెట చౌరస్తా, కమ్మెట, గొల్లగూడ, శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ లో ఓల్టేజీ సమస్య తీరనుంది. ఈ సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా అయితే 100 యామ్స్ విద్యుత్ దేవునిఎర్రవల్లి సబ్‌స్టేషన్ నుంచి లోడ్ తగ్గి, విద్యుత్ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉండదు. కారణమేమిటంటే.. ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కావడానికి ప్రాథమిక అంశాలను పూర్తి చేసుకోవాలి. మంత్రులుగానీ, ఇతర ప్రజాప్రతినిధుగానీ ప్రారంభించిన వెంటనే ఆ యా గ్రామాలకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా వెంటనే ప్రారంభం కావాలి. ఆపరేటర్లను నియమించాలి. కానీ నలుగురు ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే విద్యుత్ అధికారుల అనాలోచిత నిర్ణయం, అత్యుత్సాహం మూలంగా మంత్రి మహేందర్‌రెడ్డితో ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. కానీ ఆపరేటర్లను నియమించలేదన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ సరఫరా మాత్రం జరగలేదు. దీంతో ఈ సబ్‌స్టేషన్ సాంకేతికంగా పనులు ప్రారంభం కాలేదు. -
కార్లతో రోబో బంతాట..
మనం మూడు బంతులు తీసుకుని.. ఒకదాని తర్వాత ఒకటి గాల్లోకి విసురుతూ ఇలా ఆడగలం. కానీ బగ్జగ్లర్ అనే ఈ రోబో ఏకంగా మూడు కార్లను గాల్లోకి ఎగరేసి.. ఆడుకుంటుంది. 70 అడుగుల పొడవుండే ఈ రోబో రూపకల్పన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. డాన్ గ్రానెట్ అనే నాసా మాజీ ఇంజనీర్ దీని రూపకర్త. హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో ఇది ఒక్కోటి 1,200 కిలోల బరువుండే కార్లను గాల్లో విసురుతూ ఆడగలదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన మోడల్ 112 కిలోల బరువున్న వస్తువులను ఎత్తి విసరగలుగుతుందని.. పూర్తిస్థాయిలో దీన్ని రూపొందించడానికి రూ.14 కోట్లు అవసరమని.. పెట్టుబడుల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ రోబో తనంతట తానే పనిచేయదు. దీని తల స్థానంలో ఒక ఆపరేటర్ కూర్చుని.. దీన్ని నియంత్రిస్తుంటాడు. జనాన్ని తన ‘ఆట’లతో ఈ రోబో అలరిస్తుందని.. కార్ల రేసులు వంటి కార్యక్రమాల్లో దీన్తో ప్రదర్శనలు ఇప్పించవచ్చని గ్రానెట్ చెబుతున్నారు.