విద్యుత్‌ ఆపరేటర్‌ హత్య | Electricity Operator Is Murdered In Ranga Reddy Chevella, Details Inside - Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఆపరేటర్‌ హత్య

Published Sat, Feb 24 2024 1:07 PM | Last Updated on Sat, Feb 24 2024 1:47 PM

Electricity operator is murdered - Sakshi

చేవెళ్ల: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన హర్యానాయక్‌ (40) రెండేళ్లుగా ఆలూ రు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 

ఎప్పటిలానే గురువారం రాత్రి కూడా విధి నిర్వహణలో ఉన్న అతను  అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన ఎల్లకొండ శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి కొంత మంది నేపాల్‌కు చెందిన వారు తనతో గొడవ పడుతున్నారని చెప్పాడు. శ్రీనివాస్‌ అక్కడికి వెళ్లి చూసే సరికి హర్యానాయక్‌ రక్తపు మడుగులో పడి ఉన్నా డు. వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏడీ, ఏఈ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేవెళ్ల మండల విద్యుత్‌ ఏసీ నయీమొద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మద్యం మత్తులో.. 
ఆలూరు గ్రామంలోనే నేపాల్‌కు చెందిన వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడిపిస్తున్నాడు. అతడికి పెయింటింగ్‌ పనులు చేసే కొంతమంది స్నేహితులు ఉన్నారు. నేపాల్‌కు చెందిన వ్యక్తికి హర్యానాయక్‌కు పరిచయం ఉండటంతో గురువారం రాత్రి స్నేహితులతో కలిసి సబ్‌స్టేషన్‌కు వచి్చనట్టు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వమని, రాత్రికి అక్కడే పడుకుంటామని గొడవకు దిగినట్లు సమాచారం. దీనికి ఆపరేటర్‌ నిరాకరించటంతో మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హర్యానాయక్‌ను హత్యచేసి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు ఆఫీస్‌ ఫోన్‌ కూడా ఎత్తుకెళ్లారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement