Electricity Department
-
కరెంట్ చార్జీల పెంపుపై ఆందోళనలు
-
విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రజాభిప్రాయ సేకరణ
-
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy) ప్రకటించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. కాలుష్య కారక థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ(Green energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ ‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’అని భట్టి చెప్పారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ‘పునరుత్పాదక విద్యుత్ రంగం(electricity sector) లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డి్రస్టిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’అని భట్టి తెలిపారు.రాష్ట్రంలో ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల(electricity charge) ను పెంచబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, కె.వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇందనంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఐఐటీలో రెండురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్ బలరామ్ నాయక్, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆ్రస్టేలియా కాన్సులేట్ జనరల్ (బెంగళూరు) హిల్లరీ మెక్గేచి, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ దినేష్ మహోర్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలన కాదు..చంద్రబాదుడు పాలన
-
ప్రజలపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి కరెంట్ ఛార్జీలు పెంచింది
-
ఏపీ ప్రజలకు షాక్‌ల మీద షాక్!
-
విచారణకు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్
-
డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగతినగర్ సెక్షన్ బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంటులో విద్యుత్ లైన్‌మన్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండానే డోర్‌లాక్ పేరుతో మినిమం బిల్లు జారీ చేశారు. ఆగస్టులో 5 యూనిట్లకు బిల్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. అక్టోబర్‌లో మాత్రం ఏకంగా రూ.3,667 బిల్లు జారీ చేశారు. సదరు వినియోగదారుడు బాచుపల్లి ఏఈని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించకపోవడంతో బాధితుడు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఇంట్లోని విద్యుత్ మీటర్‌కు ఒక నెలలో బిల్ కన్జమ్షన్, మరో నెలలో మీటర్ స్టకప్ అని నమోదు చేశారు. ఫలితంగా ఆయన ఇంటి నెలవారీ బిల్లు రూ.2 వేలు దాటింది. ఒక వైపు కరెంట్ వినియోగం జరగలేదంటూనే..మరో వైపు మినిమం బిల్లు పేరుతో అధిక బిల్లు జారీ చేశారు. కనీసం బిల్ స్టేటస్‌ను కూడా పట్టించుకోలేదు. వినియోగదారుడు ఈ లోపాన్ని గుర్తించి సంబంధిత సెక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదు.ఆజామాబాద్ డివిజన్లోని రామాలయం సెక్షన్ పరిధిలో ఓ వినియోగదారుడి ఇంట్లో కరెంట్ మీటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. గత నాలుగు నెలలుగా స్టకప్లోనే ఉంది. రీడింగ్ నమోదు కావడంలేదు. వెంటనే ఆ మీటర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆపరేషన్స్ విభాగం డీఈ, ఏడీఈ, ఏఈలు ప్రతినెలా బిల్స్టేటస్పై రివ్వూ్యలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి లైన్మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సదరు వినియోగదారుడు నెలకు రూ.1,500కు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది...ఇలా మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే కాదు శివారులోని సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వినియోగదారులు నష్టపోతున్నారు. నెలకు రాబడి రూ.1,800 కోట్లు గ్రేటర్ పరిధిలో 60 లక్షలకుపైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 52 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు, మరో 8లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నా రు. పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు మరో 2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. వీరి ద్వారా సంస్థకు ప్రతి నెలా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కం.. అన్ని డివిజన్ల పరిధిలోనూ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యల పునరుద్ధరణ కోసం సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్త కనెక్షన్ల జారీ, లైన్లకు అంచనాలు రూపొందించడం, మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూళ్ల కోసం ఆపరేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీబీడీ గ్యాంగ్‌లు చురుగ్గా పని చేస్తున్నాయి. ఆపరేషన్ విభాగం పనితీరు అధ్వానం భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చోటు చేసుకున్న నష్టాలను గంటల వ్యవధిలోనే సీబీడీ గ్యాంగ్‌లు పునరుద్ధరిస్తున్నాయి. కానీ ఆపరేషన్ విభాగంలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు మాత్రం ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ముఖ్యమైన మీటర్ రీడింగ్‌కు ఒక నెలలో రెగ్యులర్ లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు వెళ్లాల్సి ఉంది. మరో నెలలో కాంట్రాక్టు కార్మికులతో రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రతి నెలా కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు మినహా ఆపరేషన్ విభాగంలోని జేఎల్ఎంలు, ఏఈలు, ఏడీఈలు మాత్రం రీడింగ్‌కు వెళ్లడంలేదు.చదవండి: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం? లైన్ల నిర్వహణ, విద్యుత్ చౌర్యం, రెవెన్యూ వసూళ్లపైనే కాదు.. కనీసం మీటర్ స్టేటస్‌పై రివ్వు్యలు కూడా నిర్వహించడం లేదు. డిస్కంలో కీలకమైన సైబర్ సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నష్టపోతున్నారు. చేతికందుతున్న బిల్లులను చూసి.. లబోదిబోమంటున్నారు. -
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (గత బీఆర్ఎస్ సర్కార్) బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మంగళవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాల్లో అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. cio2024.power@gmail.com కి మెయిల్ ద్వారా లేదా తమ కార్యాలయానికి (7వ అంతస్తు, బీఆర్కేఆర్ భవన్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్– 500004) పోస్టు ద్వారా పంపాలని సూచించింది. విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని కోరింది. ఎవరైనా కమిషన్ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమరి్పంచాలని భావిస్తే, ఏ విషయంలో వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలంది. సంబంధిత నిర్ణయాల్లో తప్పులను గుర్తించడంతోపాటు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం, బాధ్యులను గుర్తించడం కోసం న్యాయవిచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
విద్యుత్ కనెక్షన్ మూడు రోజుల్లోనే..
సాక్షి, అమరావతి : కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇకపై మరింత వేగంగా రానుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉన్న గడువును కేంద్రం తగ్గించింది. సగానికి పైగా రోజులను కుదిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇందు కోసం విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 176 ప్రకారం విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020లో సవరణలు చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. మహా నగరాల్లో(మెట్రోపాలిటన్) నివసించే వారు మూడు రోజుల నుంచి గరిష్టంగా ఏడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లు పొందొచ్చు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు గడువు తగ్గిస్తూ మార్పులు చేశారు. ఇక కొండ ప్రాంతాలున్న గ్రామీణ ప్రాంతాలు కొత్త కనెక్షన్లు గానీ, ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పులుగానీ చేసుకోవడానికి కనీస వ్యవధి 30 రోజులుగా నిర్ణయించారు. తాజా నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఇంటి వద్దే చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ పొందొచ్చు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనికి తోడ్పాటుగా భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టంల ఏర్పాటుకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాల పరిమితినీ 30 నుంచి 15 రోజులకు తగ్గించారు. నాణ్యమైన సేవలు.. వినియోగదారుల హక్కు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన వారికి విద్యుత్ సరఫరా చేయడం ప్రతి డిస్కం ప్రాథమిక విధిగా కొత్త నిబంధనలో స్పష్టం చేశారు. అలాగే డిస్కంల నుంచి నాణ్యమైన సేవలను పొందడం వినియోగదారుల హక్కుగా నిబంధనల్లో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తే ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు అదనపు మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్రం ఇచ్చిన నిబంధనల్లో స్పష్టం చేశారు. కో–ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, కాలనీల్లో నివసిస్తున్న వారు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి వ్యక్తిగత విద్యుత్ సర్విసులు పొందొచ్చు.. లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే మీటర్ లేకుండా కనెక్షన్ ఇవ్వకూడదని షరతు విధించారు. సాధ్యమైనంత వరకూ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని, బిల్లులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ముందుగా కూడా చెల్లించొచ్చని పేర్కొన్నారు. -
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
సాక్షి, అమరావతి:విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్‌కు మూడుసార్లు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా.. ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (డిస్కనెక్ట్) కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్ సర్వీసులకు ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదే. ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. -
విద్యుత్ ఆపరేటర్ హత్య
చేవెళ్ల: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆపరేటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన హర్యానాయక్ (40) రెండేళ్లుగా ఆలూ రు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే గురువారం రాత్రి కూడా విధి నిర్వహణలో ఉన్న అతను అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన ఎల్లకొండ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి కొంత మంది నేపాల్‌కు చెందిన వారు తనతో గొడవ పడుతున్నారని చెప్పాడు. శ్రీనివాస్ అక్కడికి వెళ్లి చూసే సరికి హర్యానాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నా డు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏడీ, ఏఈ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేవెళ్ల మండల విద్యుత్ ఏసీ నయీమొద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో.. ఆలూరు గ్రామంలోనే నేపాల్‌కు చెందిన వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అతడికి పెయింటింగ్ పనులు చేసే కొంతమంది స్నేహితులు ఉన్నారు. నేపాల్‌కు చెందిన వ్యక్తికి హర్యానాయక్‌కు పరిచయం ఉండటంతో గురువారం రాత్రి స్నేహితులతో కలిసి సబ్‌స్టేషన్‌కు వచి్చనట్టు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వమని, రాత్రికి అక్కడే పడుకుంటామని గొడవకు దిగినట్లు సమాచారం. దీనికి ఆపరేటర్ నిరాకరించటంతో మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హర్యానాయక్‌ను హత్యచేసి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు ఆఫీస్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి తిన్నారని నిందించారు. అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి దీటుగా స్పందించారు. 24గంటల విద్యుత్ ఎన్నడూ ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్ పూర్తిగా అవాస్తవమని, ఎనిమిదిన్నర గంటల నుంచి 12 గంటల వరకే విద్యుత్ ఇచ్చేదని పునరుద్ఘాటించారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో 16 గంటలు ఇచ్చి ఉండొచ్చు తప్ప 24 గంటలు ఎన్నడూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో నష్టాలకు కారణం అవినీతేనన్నారు. యాదాద్రి ప్రాజెక్టును 29వేల కోట్లకు నామినేషన్ మీద అప్పగించారని, జార్ఖండ్ విద్యుత్ ప్రాజెక్టుకు యాదాద్రికి రూ. రూ.6వేల కోట్లు తేడా ఉందన్నారు. ఇందులో పెద్ద స్కాం ఉందని, రూ. 10వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. అప్పటి మిర్యాలగూడ ఎమ్మెల్యే బినామీగా ఉండి తిన్నారని ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ప్రాజెక్టు అప్పగించుడే పెద్ద స్కాం అని ఆరోపించారు. సోనియా గాందీతో కొట్లాడి వైఎస్ ఫ్రీ పవర్ తెచ్చారు రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు పేటెంట్ కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియాగాం«దీతో కొట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేశారని అన్నారు. విచారణకు జగదీశ్ రెడ్డి సవాల్ తనపై గతంలో కూడా ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ విచారణలో ఎవరు దోషులుగా తేలితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ఇటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్ కాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలని కొట్టిపారేశారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని జగదీశ్ రెడ్డి కోరారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తారా అనేది చూడాలని వ్యాఖ్యానించారు. -
విద్యుత్ రంగంలో మరో మైలురాయి
-
200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా.. 4,008 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, అప్పులు, నష్టాల వివరాలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదించాయి. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిపై సమగ్ర నివేదికను కూడా సమర్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ఏటా రూ.4,008 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు తెలిపాయి. సీఎం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, జెన్ కో డైరెక్టర్ అజయ్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, నివేదిక ద్వారా వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బకాయిల కోసం రూ.30,406 కోట్ల అప్పు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎనీ్పడీసీఎల్ సంస్థల అప్పులు 2015–15లో రూ.22,423 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రూ.81,516 కోట్లకు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించడానికే టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎనీ్పడీసీఎల్ సంస్థలు ఏకంగా రూ.30,406 కోట్లను స్వల్పకాలిక రుణాలుగా తీసుకున్నాయి. అప్పులు తిరిగి చెల్లించడానికి రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రతి నెలా రూ.1,300 కోట్లు అవసరం. విద్యుత్ ఎక్ఛ్సేంజీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లు ఖర్చు అవుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో డిస్కంలు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎనీ్పడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం (2014–15) నాటి నుంచి 2023–24 వరకు ఈ రెండు సంస్థలు ఏకంగా రూ.50,275 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. 2014–15లో రూ.3,600 కోట్లు ఉన్న విద్యుత్ సబ్సిడీని క్రమంగా పెంచుకుంటూ 2023–24 నాటికి రూ.11,500 కోట్లకు పెంచారు. వ్యవసాయానికి 2 విడతల్లో 12 గంటలు.. రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక్కో విడతలో 6 గంటలు చొప్పున ప్రతి రోజూ రెండు విడతల్లో మొత్తం 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర విద్యుత్ సరఫరా స్థాపిత లోడ్ సామర్థ్యం 19,475 మెగావాట్లు కాగా, ఇప్పటివరకు 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని తెలిపారు. గత మార్చి 14న అత్యధికంగా 297.89 మిలియన్ యూనిట్లను సరఫరా చేశామన్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తైతే గరిష్టంగా 16,701 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు. వారంలో విద్యుత్‌పై శ్వేతపత్రం రాష్ట్ర ఆవిర్భావం నాటి (2014–15) కాలంతో పోల్చుతూ 2023–24లో రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు శ్వేతపత్రాన్ని సిద్ధం చేయాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలిసింది. మరో వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించి ప్రజలకు దీనిని విడుదల చేస్తామని, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విద్యుత్ సంస్థలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితులను ప్రజలకు ముందుగానే తెలియజేయాల్సిన అవసరముందని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగరాదని ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్యుత్ సంస్థల నష్టాలకు కారణాలు ఇవే.. రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా, వీటికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌కు కచి్చతమైన లెక్కలు లేవు. రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను విని యోగదారుల నుంచి వసూలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వమే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లిస్తుందని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదు. క్లీన్ ఎనర్జీ సెస్‌గా టన్ను బొగ్గుపై కేంద్రం రూ.400 వసూలు చేస్తోంది. బొగ్గు ధరలు భారీగా పెరగడం, రైలు, రవాణా చార్జీలు పెరగడం. ప్రతి నెలా రూ.1,300 కోట్లను స్వల్పకాలిక రుణాలు తిరిగి చెల్లించడానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. 800 మెగావాట్ల కేటీపీఎస్, 1,080 మెగావాట్ల భద్రాద్రి, 800 మెగావాట్ల ఎన్టీపీసీ వంటి కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగింది. ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థలు అధిక ధరతో విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని వాడుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులకు 2014–15లో 37.5% 2018–19లో 42.5%, 2023–24లో 15% వేతన సవరణ అమలు చేయడంతో జీతాల వ్యయం భారీగా పెరిగింది. నాకు సమాచారం లేదు.: ప్రభాకరరావు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమీక్షాసమావేశానికి రావాలని తనకు ఎలాంటి సమాచారంలేదని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశా రు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం విద్యుత్‌రంగంపై నిర్వహించే సమీక్షకు రమ్మని విద్యుత్‌శాఖ నుంచి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎలాంటి సమాచారంరాలేదని తెలిపారు. సీఎం సమావేశానికి పిలుస్తున్నారని చెబితే వెళ్లకుండా ఎందుకు ఉంటానని అన్నారు. తాను మాజీ సీఎండీగా కూడా సీఎం పిలిస్తే వెళ్లి అన్ని విష యాలు వివరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభాకర్‌రావు చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తీసుకున్న రుణాలు కేవలం మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్పెండిచర్) చేసినట్లు ఆయన తెలిపారు. ఎంత మొత్తం వ్యయం చేశామన్నది ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. సమీక్షాసమావేశానికి తనను పిలిపించాలని సీఎం ఆదేశించినట్లు కేవలం మీడియా, పత్రికల్లోనే చూశానని, వాటి ఆధారంగా సమావేశానికి వెళ్లలేనని, ఇప్పటికే రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తన రాజీనామాను ఆమోదించినట్లు కానీ, తిరస్కరించినట్లు కానీ ఎలాంటి సమాచారంలేదని వివరించారు. విద్యుత్ సంస్థల్లో డిమాండ్, సరఫరా, కొనుగోళ్లు అన్ని పారదర్శకంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఓ వైపు పాలన.. మరోవైపు పదవులు -
నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం
కామారెడ్డి: రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకై క ప్రభుత్వం మాదేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొల్లూర్‌లో రూ.98 కోట్ల నిధులతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రాన్ని 15 ఏళ్లు సీఎంగా పాలించినా నేటికి అక్కడ కరెంటుకు దిక్కులేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడం, సీఎండీగా ప్రభాకర్‌రావు డిస్ట్రీబ్యూషన్, ట్రాన్స్మిషన్, జనరేషన్లో తీసుకున్న విప్లవాత్మక చర్యల మూలంగా తెలంగాణలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన సమయంలో మనకు 7,780 మెగావాట్ల విద్యుత్ వస్తే దాన్ని నేడు 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్రావులకే దక్కుతుందన్నారు. కొల్లూర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్కిట్లను పంపిణీ చేశారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రారెడ్డి, జెడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ తుకారాం, నాయకులు ద్రోణవల్లి సతీష్, అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. తలసరి వినియోగంలో టాప్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140యూనిట్లు అయితే దేశం సరాసరి విద్యుత్ తలసరి వినియోగం 1255 యూనిట్లు మాత్రమేనని తెలిపారు. వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్ఈ సూర్య నర్సింహారావు, తదితరులు ఉన్నారు. -
ఏపీ విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై కుదిరిన ఏకాభిప్రాయం
సాక్షి, విజయవాడ: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఖరారైంది. కొత్తగా అమల్లోకి రానున్న సింగల్ మాస్టర్ స్కేలుతో కూడిన పీఆర్సీ ఒప్పందంపై ఏపీజెన్కో, ఏపీట్రాన్స్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) ప్రతినిధులు, పలు యూనియన్ల నాయకులు సంతకాలు చేసి పరస్పరం ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం కొత్త పీఆర్సీ గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ సంస్థలు ఉద్యోగులకు 12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు 8 శాతం ఫిట్మెంట్ లభిస్తుంది. సింగల్ మాస్టర్ స్కేలు అనే కొత్త విధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో అధికారులు లోతుగా అధ్యయనం చేసి కొత్త స్కేళ్లు రూపొందించారు. పేస్కేళ్లలో అనామలీస్ ఉంటే సరిచేసేందుకు ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో మూడు డిస్కంల సీఎండీలతో హెచ్ఆర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పీఆర్సీ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. పెరిగిన పీఆర్సీతో 28 వేలకి పైగా ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది. -
విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు
-
AP: ఫలించిన చర్చలు.. సమ్మె ఆలోచన విరమించిన విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్సీపై ఇరువైపుల నుంచి ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్ సంఘాల జేఏసీ. ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదించాయి. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో.. డిస్కంల సీఎండీలోతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. అలాగే.. పీఆర్సీపై ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ఓకే తెలిపింది. 8 శాతం ఫిట్‌మెంట్‌కు సైతం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌తో చర్చించాం. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు’’ అని చర్చలకు ముందర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం, మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌తో చర్చించాం. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తాం. డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఏదో జరిగిపోతున్నట్టు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారు: మంత్రి అంబటి -
కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అయితే మే 20న ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ‘సూత్రప్రాయంగా అంగీకరించినా’ దీనిపై తుది ప్రకటనతో విధివిధానాలను తెలపాల్సి ఉంది. అయితే ఈ హామీలు బెస్కాంను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. చర్యలు తప్పవ్ త్వరలో ఉచిత విద్యుత్ పథకం ప్రకటన వస్తుందని ఆశిస్తున్న ప్రజలు వారి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక మరో వైపు వినియోగదారులు బిల్లులు చెల్లించక మధ్యలో బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) నలిగిపోతోంది. దీంతో ఈ విషయంపై బెస్కామ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలు తమ బిల్లులను వెంటనే చెల్లించాలని లేదా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత వారంలో, చాలా మంది వినియోగదారులు బెస్కామ్ను సంప్రదించి దీని గురించి ఆరా తీశారు. ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొదటి 200 యూనిట్లను క్యాష్‌బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్ణీత గడువులోగా వినియోగదారులు వారి బిల్లులు తప్పక చెల్లించాలని బెస్కామ్ అధికారులు వినియోగదారులకు సూచించారు. భారం ఎంతంటే.. రాష్ట్రంలో దాదాపు 2.1 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు, వీరిలో 1.26 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కుటుంబాలు ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.3,509 కోట్లు, ఏటా రూ.42,108 కోట్ల భారం పడనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా ఐదు వాగ్దానాలపై తొలి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘అవి అంగీకరించాం.. హామీలపై వెనక్కి వెళ్లబోమని చెప్పారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
కాంగ్రెస్ చెప్పింది కరెంట్ బిల్లులు కట్టం.. విద్యుత్ శాఖ అధికారిపై దాడి
కర్ణాటకలో కరెంట్ బిల్లు పంచాయితీ చినికి చినికి గాలివానలా తయారైంది. ‘మేం కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’ అంటూ పలు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లులు కట్టాలన్న అధికారులకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి విద్యుత్ బిల్లులు కట్టేది లేదని చిత్రదుర్గ జిల్లా జాలికట్టెలో ఇటీవల గ్రామస్తులు మొండికేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గ్రామంలో మీటర్ రీడింగ్ కోసం వచ్చిన విద్యుత్ అధికారిపై ఓ వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తించాడు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేశాడు. దీన్నంతటిని మరొకరు వీడియో తీయగా.. అతనిపై సైతం ఆవేశంతో అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Electricity officials are attacked by local residents in Karnataka when they came for meter reading. Residents says that they won’t pay from electricity now onwards as per Congress Guarantee pic.twitter.com/T0sVUjD2Ux — Rishi Bagree (@rishibagree) May 24, 2023 కాగా, అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 1 నుంచి ఎవరూ కరెంటు బిల్లు చెల్లించరాదని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రకటించారు. మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, అప్పటివరకు బిల్లులుకట్టాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దీనికి ఒప్పుకోని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మేం బిల్లులు చెల్లించేది లేదు. దీనిపై మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కరాఖండిగా చెబుతున్నారు. చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్‌శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్‌కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె
-
నేటి నుంచి ఆర్టి‘జనుల’ సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని ‘ఆర్టిజన్లు’ మంగళవారం ఉదయం 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 23 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గతంలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ల పేరుతో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెబాటపట్టాలని.. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్82), ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు పిలుపునిచ్చాయి. కాగా, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, ఎవరైనా సమ్మెకు దిగినా, విధులకు గైర్హాజరైనా అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేశాయి. దీంతో సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలి.. రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను, ఆర్టిజన్ల కోసం ‘స్టాండింగ్ ఆర్డర్స్’ పేరుతో ప్రత్యేక సర్వీస్ రూల్స్‌ను అమలుచేస్తున్నారు. అయితే, తమకూ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేయాలని ఆర్టిజన్లు డిమా ండ్ చేస్తున్నారు. అలాగే, 7% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న విద్యుత్ ఉద్యోగ సంఘాల ఉభయ జేఏసీలతో సంస్థల యాజమాన్యాలు వేతన సవరణ ఒ ప్పందం కుదుర్చుకోగా, దీన్ని ‘ఆర్టిజన్ల’ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ పోస్టులకు తీసు కుని పదోన్నతి కల్పించాలని, 50% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, కనీసం రూ.25 వేలకు తగ్గకుండా మాస్టర్ స్కేల్‌ను ఖరారు చేయాలని ఈ సంఘాలు సమ్మె నోటీసుల్లో కోరాయి. నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రభావం ! నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపులో ఆర్టిజన్ల సేవలు కీలకం. ఎక్కడ చిన్న అంతరాయం కలిగినా రంగంలో దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తా రు. మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో వీరి సంఖ్యే అధికం. దీంతో ఆర్టిజన్లు పాక్షికంగా సమ్మెకి దిగి నా నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు విద్యుత్ సంస్థల్లో ఎస్మా కింద సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు పిలుపునిచ్చిన సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 15న అన్ని ఉద్యోగ సంఘాలతో పాటే ఆర్టిజన్లకు కూడా సహేతుకమైన వేతన సవరణ చేశామన్నారు. కాగా, ఆర్టిజన్ల సమ్మెతో తమకు సంబంధం లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, టీఈఈ 1104 యూనియన్, టీఎస్‌పీఈయూ–1535, బీఆర్వీకేఎస్, టీఎస్‌ఈఈయూ–327 యూనియన్లు ప్రకటించాయి. (చదవండి: నేటి నుంచి బడులకు వేసవి సెలవులు) -
డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) కాస్త ఊరట కలిగించింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ అమ్మకం ధరల సీలింగ్‌ను మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఆర్సీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ ధరలు యూనిట్‌కు రూ.50 నుంచి రూ.30కు తగ్గాయి. సాధారణ సమయాలకు సంబంధించి యూనిట్ ధర రూ.12 నుంచి రూ.10కు తగ్గింది. అప్పట్లో అంతా వాళ్లిష్టమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ రోజువారీ అవస రాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేవు. కొన్ని రాష్ట్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. అయి తే అది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. కానీ ఇతర సమయా ల్లో నూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి రావడంతో డిస్కంలు ఆర్థికంగా బాగా నష్టపోతుండేవి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పీపీఏలకు బదులు షార్ట్ టర్మ్ పీపీఏలు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ ఒప్పందాల వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. 2021 వరకు బహిరంగ మార్కెట్లో ని ధరలు విద్యుత్ ఉత్పత్తిదారుల ఇష్టానుసారం ఉండేవి. అదే ఏడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడటం.. ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో మార్కెట్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఉత్పత్తి సంస్థలు భారీ ధరలు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఆర్సీ గతేడాది మార్చి 5న సీలింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇవీ కొత్త ధరలు సీఈఆర్సీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి యూనిట్ ధరను రూ.50 నుంచి రూ.20కు తగ్గించింది. అలాగే ఏడాదిగా అమలులో ఉన్న సాధా రణ సమయాల్లో సీలింగ్ ధరను రూ.12 నుంచి రూ.10కు మార్చింది. పవర్ మార్కెట్ రెగ్యులేషన్స్–2021 ప్రకారం రిజిస్టర్ అయిన అన్ని పవర్ ఎక్సే్చంజ్‌లలో ఏప్రిల్ 4 నుంచి ఈ సవరించిన ధరలతోనే విద్యుత్ ట్రేడింగ్ జరగాలని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న గ్యాస్, బొగ్గు అధిక ధరను పరిగణనలోకి తీసుకుని గతంలో సీలింగ్ పెంచామని.. ఇప్పుడు వాటి ధరలు తగ్గడంతో సీలింగ్ కూడా తగ్గించామని కమిషన్ తెలిపింది. ఇప్పుడు కొనేవాళ్లు కరువై.. సీఈఆర్సీ సీలింగ్ ప్రకారం యూనిట్ విద్యుత్‌ను రూ.12కు మించి అమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఆ రేటుకు, లేదా అంతకంటే తక్కువకే డిస్కంలకు విద్యుత్ లభించేది. ఈ విధానం బాగున్నప్పటికీ కొందరు ప్రైవేటు జెన్కోల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగినందున విద్యుత్ అమ్మకం ధర సీలింగ్ పెంచాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్ ధరను రూ.50 గా సీఈఆర్సీ సీలింగ్ ప్రకటించింది. దీనిపై డిస్కంలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వేసవిలో అత్యధిక విద్యుత్ అవసరం అవుతున్నందున అంత ఎక్కువ రేటుకు కొనడం ఆర్థికంగా ఇబ్బంది అని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. మరోవైపు ధరలు పెంచినప్పటి నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో సీఈఆర్సీ ధరలను భారీగా తగ్గించింది. (చదవండి: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది) -
విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. ఇదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో చార్జీలు పెరగకుండా.. విద్యుత్ బిల్లులు భారం కాకుండా ఉండాలంటే.. కరెంటు వినియోగంలో పొదుపు ఒక్కటే మార్గమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే వేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గరిష్టంగా యూనిట్‌కు రూ.12 ధరతో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీంతో డిస్కంల విద్యుత్ కొనుగోళ్ల వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యయభారాన్ని చివరకు వినియోగదారులపై బిల్లులను మరింతగా పెంచి బదిలీ చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు ఈ బిల్లులు మోయలేని భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, విద్యుత్ పొదుపు చర్యలను పాటించి సలువుగా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అవసరం లేకున్నా విద్యుత్‌ను వృథాగా వినియోగిస్తుండడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్ పొదుపుపై రాష్ట్రంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈఆర్సీ తరఫున వినియోగదారులకు సూచనలు, సలహాలతో ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన్నీరు శ్రీరంగారావు -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్‌ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దేశంలో విద్యుత్ అత్యయిక పరిస్థితి.. ప్రకటించిన కేంద్రం
వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరనుందని అంచనాలున్న నేపథ్యంలో విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్–11 కింద దేశంలో విద్యుత్ అత్యయిక పరిస్థితిని సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసి పవర్ ఎక్సే్ఛంజీలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 11 కింద ప్రకటించిన కేంద్రం ఏప్రిల్‌లో దేశ విద్యుత్ డిమాండ్ 249 గిగావాట్లకు పెరగనుందని అంచనా వచ్చే ఏప్రిల్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి 249 గిగావాట్స్‌కి చేరనుందని అంచనాలున్నాయని, ఈ మేరకు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిరంతరం ఉత్పత్తి కొనసాగించాలని కోరింది. అసాధారణ పరిస్థితుల్లో సెక్షన్–11ను ప్రయోగించి తమ సూచనల మేరకు విద్యుదుత్పత్తి జరపాలని విద్యుత్ కేంద్రాలను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. గతేడాది వేసవిలో సైతం కేంద్రం సెక్షన్–11ను ప్రయోగించి దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. -
కోళ్లు ఇస్తే.. కరెంట్ ఇస్తా.. విద్యుత్ సిబ్బంది నిర్వాకం
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగ్‌పల్లి పంచాయతీ పరిధి 6 గ్రామాలకు గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదు. తుఫాను గాలుల ధాటికి కెసల్‌గూఢ, గుముకగూఢ, ఏంతాగూఢ, పూజారిగూఢ, తంగగూఢ, ఒరెల్‌గూఢ గ్రామాల్లోని విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీనిపై పలుమార్లు కలిమెల విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు అంగీకరించిన కొందరు సిబ్బంది.. లంచంగా కోళ్లు, వాహనం పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే బాగు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గ్రామాస్తులంతా కలిసి కలిమెల విద్యుత్‌శాఖ అధికారి పీకే నాయక్‌ను శుక్రవారం కలిసి, ఫిర్యాదు చేశారు. గత 2 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్ లేకపోయినా రసీదు ఇచ్చి బిల్లు చెల్లించమంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారి.. ఘటనపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తీగ తెగితే.. కరెంటు ఆగాలి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం విద్యుత్ వైర్లను తాకడం వల్లనే జరుగుతున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాల్లో అమల్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ స్టాండింగ్ కమిటీ సూచించింది. వైరు తెగిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేసే ఫీడర్ ప్రొటెక్షన్ రిలే విధానంపై అధ్యయనం చేయాలని చెప్పింది. విద్యుత్ భద్రతపై జాతీయస్థాయిలో మూడేళ్ల తరువాత 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. విద్యుత్ భద్రత, సరఫరాకు ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలు–2010లో సవరణలు చేయాలని కమిటీ సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. కమిటీ చైర్మన్ గౌతమ్ రాయ్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు రాష్ట్రాలు సూచన లివ్వాలని కోరారు. వాటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని సవరిం చేందుకు సీఈఏకి నివేదిక పంపుతామని తెలిపారు. కమిటీ మెంబర్ సెక్రటరీ రమేష్‌కుమార్ మాట్లాడుతూ 2017లో ఈ కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోందని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ భద్రతపై అవగాహన నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కండక్టర్ల స్నాపింగ్, లైవ్‌వైర్లతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంద న్నారు. సీఈఏ అసిస్టెంట్ డైరెక్టర్ ముకుల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ఆ«ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముంబై (వెస్ట్), చెన్నై (సౌత్), ఢిల్లీ (నార్త్), కోల్‌కతా (ఈస్త్), మేఘాలయ (నార్త్ఈస్ట్) ప్రాంతీయ ఇన్స్పెక్టరేట్ల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ల సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ మరుక్షణమే విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తే.. ఆ మరుక్షణమే ఎక్కడికక్కడ విధుల బహిష్కరణ (స్టాప్ ది వర్క్) చేపడతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు విద్యుత్ ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మనుగడ ప్రమాదంలో పడనుందని, తమ ఉద్యోగాలకు ముప్పువాటిల్లుతుందని.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇటీవల కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా గురువారం ఇక్కడ సమావేశమై.. బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. సీఎండీకి వినతిపత్రం.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయాల మేరకు రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు తెలిపారు. ‘విద్యుత్ రంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి’ పేరుతో ఈ నెల 10 నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ సంస్థల కార్యాలయాలు, ప్లాంట్ల ఎదుట నిరసనలు చేపడతామన్నారు. సెప్టెంబర్‌లో దేశం నలుమూలల నుంచి విద్యుత్ విప్లవయాత్ర(బిజ్లీ క్రాంతి యాత్ర)ను ప్రారంభించి డిసెంబర్ తొలివారం నాటికి ఢిల్లీకి చేరుకుంటామని చెప్పారు. తర్వాత ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు జేఏసీనేతలు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్ మంత్రి వీకే సింగ్‌కు సైతం లేఖ పంపించారు. -
తమిళనాడులో ఇకపై ఏటా పవర్ షాక్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ దారులకు ఇకపై ఏటా వడ్డన తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి జూలై నెలలో 6శాతం మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ఓ నివేదిక విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు మంగళవారం బోర్డు అందజేశాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి చార్జీలు విధించలేదు. ఫలితంగా కాల క్రమేనా విద్యుత్ బోర్డుకు కష్టాలు పెరిగాయి. అప్పులు అమాంతంగా పెరిగాయి. అయినా, గత పాలకులు విద్యుత్ చార్జీల పెంపుపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. దీంతో చార్జీల వడ్డనకు విద్యుత్ బోర్డు కసరత్తు చేస్తోంది. కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చే ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేవిధంగా గత నెల విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పెంపు ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు సైతం సాగుతున్నాయి. దీంతో ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ బోర్డు వినియోగదారుల నెత్తి మరోబాంబును పేలి్చంది. పెంపునకు ప్రణాళిక.. ప్రస్తుతం ఉన్న అప్పులు, మున్ముందు ఎదురయ్యే నష్టాలు, కష్టాలను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు ముందస్తు ప్రణాళిక సిద్ధ్దం చేసింది. భారం మరింత బరువెక్కకుండా ఏటా చార్జీల వడ్డనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందుకు తగ్గ నివేదికను రూపొందించి, ఆమోదం కోసం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పంపించింది. తొలివిడతగా.. ఏటా 6 శాతం పెరుగుదలతో నాలుగేళ్లపాటు దీన్ని కొనసాగించాలని అందులో సిఫార్సు చేసింది. చదవండి: శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు -
విద్యుత్ శాఖకు వరద నష్టం రూ.1.53 కోట్లు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీ ఈపీడీసీఎల్ చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 415 గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు, 250 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 11 కేవీ ఫీడర్లు 46, 4,022 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 5,453 వ్యవసాయ, 71,443 వ్యవసాయేతర సర్వీసులపై వరద ప్రభావం పడింది. ఈ కారణంగా డిస్కంకు ఏర్పడిన నష్టం ఇప్పటివరకు రూ.1.53 కోట్లుగా అంచనా వేశారు. కష్టంగా మారిన పునరుద్ధరణ గడచిన మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 35,936 కంటే ఎక్కువ గృహ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పూర్తిగా నీట మునిగిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఏఎస్ఆర్ జిల్లాలోని ఎటపాక, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 35,507 గృహ సర్వీసులకు నేటికీ విద్యుత్ ఇచ్చే అవకాశం లభించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి ప్రతి డివిజన్‌కు ఏపీ ఈపీడీసీఎల్ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఐదు జిల్లాల్లో దెబ్బతిన్న 33 కేవీ ఫీడర్లన్నిటినీ తిరిగి ప్రారంభించారు. వరద ప్రభావిత గ్రామాల్లో నీరు తగ్గిన 24 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సమయాల్లో అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు, పనుల అమలుకు అవసరమైన మనుషులు, సామగ్రిని అందుబాటులో ఉంచారు. రంపచోడవరం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ముంపు ఎక్కువగా ఉన్న చోట్ల మినహా నీటిమట్టం తగ్గిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయింది. బోట్లపై వెళ్లి పోల్ టు పోల్ సర్వే, లైన్ క్లియరింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల లైన్లు దాదాపు 12 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. వాటిపై చెట్ల కొమ్మలు, చెత్త, బురద మేట వేయడంతో పునరుద్ధరణ కష్టంగా మారింది. 800 మందికి పైగా సిబ్బంది 65 బ్యాచ్‌లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిని తొలగించే పని చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయండి వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీ ఈపీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చారు. డిస్కమ్ సీఎండీ కె.సంతోషరావు, ఇతర అధికారులతో విజయానంద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి ఆపరేషన్ వింగ్ ఇంజనీర్లతో పాటు ఇతర విభాగాల నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, స్థానిక అధికారులను పంపించాలని డిస్కమ్‌లను విజయానంద్ ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు జె.పద్మా జనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: శాంతించిన గోదావరి -
వరదల్లోనూ.. వెలుగుల కోసం.!
సాక్షి, అమరావతి: కరెంటు తీగ నీటిలో పడిందంటే..అటువైపు వెళితే షాక్ కొడుతుందని భయడుతుంటాం..అలాంటిది కిలోమీటర్ల కొలదీ హై టెన్షన్, లో టెన్షన్ అనే తేడా లేకుండా విద్యుత్ తీగలు తెగిపోయి వరదనీటిలో వేలాడుతుంటే..వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో పడవలపై వెళ్లి లైన్లను సరిచేసేందుకు వందలాది మంది విద్యుత్ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చీకటి అలుముకున్న గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. భారీ దెబ్బ.. గోదావరి వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీ ఎల్) పరిధిలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా 12 మండలాల్లోని 406 గ్రామాల్లో 70,148 సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 సబ్స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 46 దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (టీడీఆర్) 3,964 పాడయ్యాయి. వీటిలో 3 సబ్ స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 4, టీడీఆర్‌లు 383 బాగుచేశారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నీటమునగడంతో 5,368 సర్వీసులకు విద్యుత్ అందించలేని పరిస్థితి ఏర్పడింది. మిగతా వాటిలో 10,073 సర్వీసులకు అందిస్తున్నారు. 230 ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, సెల్ టవర్లకు ఇంకా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. నిరంతర ప్రయత్నం.. అత్యవసర సర్వీసులకు, వరద బాధితులు పునరావాస కేంద్రాలకు, పలు వసతి గృహాలు, పాఠశాలలకు తాత్కాలిక విద్యుత్ లైన్లు, పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఇక దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేశారు. అవసరమైన కండక్టర్లు, కేబు ళ్లతో సహా 17,280 స్తంభాలను అందుబాటులో ఉంచారు. ప్రతి డివిజన్‌లోనూ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో జూనియర్ లైన్మెన్ దగ్గర్నుంచి డిస్కం సీఎండీ వరకూ 850 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తున్నాం వరదల వల్ల విద్యుత్ వైర్లు నీటిలో మునిగిపోయాయి. వెంటనే వాటిని సరిచేయాలి. లేదా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అలా నిలిపివేయాలన్నా కూడా ఆ ప్రాంతానికి వరద నీటిలోనే వెళ్లాలి. అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరూ ప్రాణాలతో మిగలరు. అయినప్పటికీ వెళుతున్నాం. నాతో పాటు కొందరు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయికి పడవలపై వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే విద్యుత్ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాం. – కే సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ ఇదీ చదవండి: CM YS Jagan: 48 గంటల్లో సాయం -
రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల పరిధిలోని రెండు కార్పొరేషన్లకు నూతన చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ శాఖ పరిధిలోని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్‌గా ఏరువ సతీశ్‌రెడ్డి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ పరిధిలోని సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కూర్మాచలం నియమితులయ్యారు. వీరు ఆ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సతీశ్‌రెడ్డి 2020 నుంచి టీఆర్ఎస్ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2018 ప్రగతి నివేదిక సభ డిజిటల్ మీడియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన అనిల్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూకే శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే వ్యవస్థాపక సభ్యుడిగా క్రియాశీలకపాత్ర పోషించారు. -
మళ్లీ తెరపైకి విద్యుత్ బిల్లు
సాక్షి, హైదరాబాద్: టెలికాం సేవల తరహాలో ప్రైవేటు, ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల నుంచి నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులకు సైతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. జూలైలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు సర్వసన్న ద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తాజాగా ప్రకటించడంతో దీనిపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని డీలైసెన్సింగ్ చేయడంతో పాటు ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలను అనుమతించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం అవుతాయని, కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటుందని విమర్శలున్నాయి. ఇక ప్రైవేటు విద్యుత్ ! సంస్కరణ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుకలగనుంది. అలాగే ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకు ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీలతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నష్టాలు బాగా వచ్చే ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుంది. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా సబ్సిడీలను చెల్లిస్తోంది. మిగిలిన రాయితీ భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. సబ్సిడీలనునగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త బిల్లులో పేర్కొంది. ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధం కావడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణతో తమ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే దేశవ్యాప్త సమ్మెను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లు పేర్కొం టోంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను అలాగే భరించే ప్రస్తుత విధా నానికి ఫుల్స్టాప్ పెట్టాలని తాజా బిల్లు చెబుతోంది.ఈ నిబంధనలను అమలు చేస్తే ఏటా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు. -
ఒక్క రూపాయి కూడా వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నాయి. ఒక్క రూపాయిని కూడా వదలకుండా తీసుకుంటున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రాగా అప్పుడు ఏప్రిల్ 15లోపు ఏ తేదీ వరకైతే బిల్లు వేశారో దానికి పాత టారిఫ్‌నే అమలు చేశారు. అయితే ఏప్రిల్‌లో ఎన్ని రోజులకైతే పాత చార్జీలు వసూలు చేశారో ఆ రోజులకు తాజాగా కొత్త చార్జీలు వర్తింపజేసి మరీ రావాల్సిన అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. టారిఫ్ డిఫరెన్స్ పేరుతో.. ప్రస్తుతం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా మునుపటి నెల వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులను జారీ చేస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో గత మార్చి నెల విద్యుత్ బిల్లులను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీలోగా జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వచ్చినా బిల్లులు జారీ చేసిన తేదీ వరకు పాత టారీఫ్‌నే వర్తింపజేశారు. అంటే మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 కాలాన్ని ఒక నెలగా పరిగణించి ఏప్రిల్‌లో బిల్లు జారీ చేశారు. ఒకే నెలలో రెండు వేర్వేరు టారిఫ్‌లు వర్తింపజేసి బిల్లు వసూలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకంగా చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్న గత ఏప్రిల్ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల్లో మాత్రం ‘ఏప్రిల్ 1–15’కాలానికి సైతం పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను వర్తింపజేసి ‘టారిఫ్ డిఫరెన్స్’పేరుతో చార్జీలను డిస్కంలు విధిస్తున్నాయి. ఉదాహరణకు మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో ఓ వినియోగదారుడు 200 యూనిట్లు వినియోగిస్తే అందులో ఏప్రిల్ 1–15 మధ్యన ఎన్ని యూనిట్లు వాడి ఉంటాడో సగటున లెక్క వేసి ఆ మేరకు యూనిట్లకు పెరిగిన విద్యుత్ చార్జీలను వర్తింపజేసి అదనంగా రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేస్తున్నాయి. ‘ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త టారిఫ్ ప్రకారం రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేయడం జరిగింది’అని బిల్లు కింద ముద్రిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1–15 కాలానికి పాత విద్యుత్ చార్జీల ప్రకారం ఇప్పటికే వినియోగదారులు బిల్లులు చెల్లించారు. కొత్త విద్యుత్ చార్జీల ప్రకారం అదనంగా రావాల్సిన బిల్లులను ఇప్పుడు వసూలు చేసుకుంటున్నాయి. గతంలో విద్యుత్ చార్జీలు పెరిగిన సందర్భాల్లో ఇలా అదనపు చార్జీలు వసూలు చేసిన దాఖలాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆ డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ డిమాండ్-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు పేర్కొన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని సీఎం అన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవతం అయ్యిందని, 2020–21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021– 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. 33.75 ఎం.యు. కరెంటు ఆదా అయ్యిందన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరాలో సంక్షోభం: ♦విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు ♦దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావం తదితర అంశాలను వివరించిన అధికారులు ♦అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్న అధికారులు ♦బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయంతో పలు రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఉందన్న అధికారులు ♦సరిపడా రైల్వే ర్యాక్స్‌ను సరఫరా చేయలేకపోతున్నారు. ♦వెసల్స్ కూడా తగినంతగా అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం...ఈ కారణాలన్నీ విద్యుత్తు కొరతకు దారితీశాయన్న అధికారులు ♦మరోవైపు డిమాండు కూడా గతంలో కన్నా అనూహ్యంగా పెరిగిందన్న అధికారులు ♦గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిశాయని, భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా డిమాండ్ స్థిరంగా ఉందన్న అధికారులు ♦మరోవైపు కోవిడ్ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని తెలిపిన అధికారులు ♦వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని, ఫలితంగా అధిక వినియోగం ఉందని తెలిపిన అధికారులు ♦ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మిలియన్ యూనిట్లకు చేరిందని, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్ ఇదని పేర్కొన్న అధికారులు ఎంత ఖర్చైనా కొనుగోలు: ♦వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్తును కొనుగోలు చేసిన విషయాన్ని సమావేశంలో తెలిపిన అధికారులు ♦మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని, ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామన్న అధికారులు. ♦వినియోగదారులు ఇబ్బంది పడకుండా, కరెంటు కోతలను అధిగమించడానికి, మార్చి నెలలో మొత్తంగా 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని తెలిపిన అధికారులు ♦బొగ్గు విషయంలో రానున్న రెండు సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయన్న అధికారులు ♦జనరేషన్ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారని వెల్లడించిన అధికారులు. ♦డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలన్న సీఎం ♦బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్న సీఎం ♦అనూహ్య డిమాండ్ ఉన్నా కొన్ని నెలల్లో పీక్ సమయాల్లోనూ మిగులు విద్యుత్తు ♦సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో వస్తోందన్న సీఎం ♦మూడు సంవత్సరాల్లో మొత్తం మూడు దశల్లో అందుబాటులోకి సెకీ విద్యుత్తు వస్తోంది ♦2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్న సీఎం ♦దీంతో పాటు రాష్ట్రంలో కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి: ♦85 శాతం పీఎల్ఎఫ్ అంచనా వేసుకుంటే మరో 30 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తుంది ♦మొత్తంగా 48 మిలియన్ యూనిట్లు అతిత్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంది ♦సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి దృష్టిపెట్టాలి: సీఎం ♦డీపీఆర్ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్న అధికారులు ♦కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు. ♦జులై–ఆగస్టు కల్లా కృష్ణపట్నం విద్యుత్తు వినియోగదారులకు అందనుందని తెలిపిన అధికారులు. ♦విజయవాడ థర్మల్ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్పత్తి పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం. ♦పోలవరం పవర్ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపిన అధికారులు ♦ఇప్పటికే టన్నెల్స్ తవ్వకం పూర్తయ్యిందన్న అధికారులు ♦ఈ ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతాం ♦పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు సరఫరాపై మళ్లీ చర్యలు తీసుకోవాలి ♦ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాలి ♦వారి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తును సరఫరాచేయాలి ♦ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి ♦వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి ♦ప్లాంట్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు సాధించాలి ♦జెన్కో ఆధ్వర్యంలో ఉన్న ప్లాంట్లను అత్యుత్తమ సామర్థ్యంతో నిర్వహించాలన్న సీఎం ♦85 శాతం పీఎల్ఎఫ్ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ♦దీని వల్ల నాణ్యమైన విద్యుత్తు, మంచి ధరకే అందుబాటులోకి వస్తోంది ♦అంతేకాకుండా... విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గించేలా ఆలోచనలు చేయాలి ♦ఖర్చులు తగ్గినా ఆదాయం వచ్చినట్టు లెక్క ♦పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తుకు భరోసా ♦విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు ♦పర్యావరణ హిత విధానాలతో విద్యుత్ ఉత్పత్తి ♦బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి మళ్లుతున్న ప్రపంచం ♦ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలు అవసరం ♦పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి ♦రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టిపెట్టాలి, తదేక శ్రద్ధతో దీనిపై పనిచేయాలి ♦భూ సేకరణ దగ్గరనుంచి అన్నిరకాలుగా సిద్ధంకావాలి ♦ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది ♦పీక్ అవర్స్‌లో అధిక ఖర్చుకు విద్యుత్తు కొనుగోలు చేసే ఇబ్బందులు, పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ వల్ల తొలగిపోతాయి ♦ఒక్కసారి ప్రాజెక్టు పెట్టిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఆ కరెంటు అందుబాటులో ఉంటుంది ఉచిత విద్యుత్తు-డీబీటీ ♦ఉచిత విద్యుత్త డబ్బు రైతుల ఖాతాల్లోకే, వారిద్వారానే డిస్కంలకు చెల్లింపులు ♦డీబీటీ ద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాలోకే: సీఎం ♦నేరుగా రైతులే చెల్లించేలా ఏర్పాటు : సీఎం ♦దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారు: ♦ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగలడు: ♦విద్యుత్తు శాఖకూడా రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాసపెట్టగులుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది: ♦మీటర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన కరెంటు అందడంతో పాటు మంచి సేవలు రైతులకు అందుతాయి: శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం: ♦శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవంతం అయ్యిందన్న అధికారులు ♦జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని, రైతుల ఖాతాలనుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపిన అధికారులు ♦2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందని తెలిపిన అధికారులు. ♦2021-2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని, అయినా సరే 67.76 మిలియన్ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని తెలిపిన అధికారులు. ♦సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని తెలిపిన అధికారులు. పారదర్శకంగా జలకళ ♦వైఎస్సార్ జలకళను పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం. ♦మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పాం: సీఎం ♦కాని మనం మోటారు ఉచితంగా ఇస్తున్నాం, దాంతోపాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను ఉచితంగా చేస్తున్నాం ♦రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుంది: సీఎం ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఏపీజెన్కో ఎండీ బి శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ ఎన్ వి రమణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇలా వాడితే.. చాలా ఆదా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. బీఈఈ చెప్పిన అంశాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్ (టీఆర్) వ్యవస్థాపించిన మొత్తం ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 సంవత్సరాలలోపు దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. 2030 నాటికి ఎయిర్ కండిషనింగ్‌తో దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్స్‌కు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీలకు ఏటా డిమాండ్ దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతంగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారులు తమ ఏసీల్లో డిఫాల్ట్ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేస్తే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది. పెంచితేనే మంచిది.. ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే, అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి, దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఎముకల సమస్య, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, అల్పోష్ణస్థితి, అధిక రక్తపోటు (బీపీ) వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సర్దుబాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఏం) విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఎస్ఈసీఎం సూచనలు ► వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. ► ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలి. ప్రతి 30 నుంచి 90 రోజులకు వాటిని శుభ్రపరచడం లేదా కొత్తవాటిని మార్చడం ద్వారా ఏసీ యూనిట్లో గాలి సజావుగా కదులుతుంది. ► వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు, ఉపకరణాలను థర్మోస్టాట్‌కు దూరంగా ఉంచాలి. ► సాధ్యమైనంత వరకూ సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించాలి. ► గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, మొబైల్ చార్జర్లు, ఏసీల స్విచ్‌లను ఆఫ్ చేయాలి. -
ట్రాన్స్‌కో పటిష్టతతోనే విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటే ఏపీ ట్రాన్స్‌కో పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.3,897.42 కోట్లతో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీటిలో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో, విశాఖపట్నం–చెన్నై కారిడార్‌లో రూ.605.56 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. మూడు జోన్లలో సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా రూ.762.53 కోట్ల పనులు, అలాగే 400 కేవీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1,257.56 కోట్ల పనులు, ఇతరత్రా రూ.107.18 కోట్ల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్పై కమిటీ ట్రాన్స్‌కో చేపట్టిన పనులకు సంబంధించి ఏటా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్ఎస్ఆర్)పై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్, ట్రాన్స్ కో జేఎండీ పృధ్వీతేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు సకాలంలో అనుమతులు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి, నిర్మాణ పనులకు సకాలంలో నిబంధనలకు అనుగుణంగా అనుమతులివ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎస్ఎస్ఏ, జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ తదితర ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన పనులు అటవీ ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఆయా పనులు ముందుకు సాగడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. ఫారెస్ట్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ విభాగాలు అవసరమైన అనుమతులు పొందడంలో అలసత్వం వహిస్తున్నాయన్నారు. అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీ దళాల అధిపతి ప్రతీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు
రాజకీయమైనా... పాత్రికేయమైనా రాష్ట్రం బాగును కోరుకోవాలి. దౌర్భాగ్యవశాత్తూ ఆంధప్రదేశ్‌కు అదే లేదు. అటు ప్రతిపక్షం... దానికి కొమ్ముకాసే పాత్రికేయ పక్షం... రెండిటిదీ ఒకే అజెండా!!. రాష్ట్రాదాయం పెరగకూడదు. అప్పులు తేకూడదు. పరిశ్రమలు రాకూడదు. సంక్షేమ పథకాలు నిలిచిపోవాలి. విద్యుత్ కోతలు పెరగాలి. మొత్తంగా... రాష్ట్రం నాశనమైపోవాలి. అందుకోసం అవసరమైతే... డ్రగ్స్ ముద్ర వేస్తారు. శ్రీలంకలా దివాలా తీస్తుందని ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికీ వెనకాడరు. అందులో భాగమే... కొద్దిరోజులుగా విపరీతమైన విషప్రచారం చేస్తూ... బుధవారం నాడు ‘ఆ విద్యుత్ అదానీదే’ అంటూ ‘ఈనాడు’ రాసిన కథనం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే 30ఏళ్లలో భారీగా గండి పడనున్నదంటూ రామోజీరావు వండిన వంటకంలో నిజానిజాలేంటి? ఏది నిజం? ఇదిగో చూద్దాం... లక్ష దీపాల మధ్య నిలబడ్డా... కళ్లు మూసుకుంటే చీకటే. ‘ఈనాడు’దీ అదే పరిస్థితి. ఒప్పందాలు... రికార్డుల సాక్షిగా నిజాలు నర్తిస్తున్నా దానికి కనిపించవు. రైతుల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసినా... దాన్ని వ్యతిరేకించాల్సిందేనన్నది రామోజీ సిద్ధాంతం. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న జనాదరణను తగ్గించకపోతే తన చంద్రబాబు వానప్రస్థం శాశ్వతమవుతుందన్నది ఆయన భయం. రాత్రనక, పగలనక రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తోంది ప్రభుత్వం. వ్యవసాయ విద్యుత్‌ను రైతులు తమ హక్కుగా భావించేలా చర్యలు చేపడుతూ, వచ్చే 30 ఏళ్ల పాటు వారికి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్‌ను సమకూర్చే ప్రయత్నాల్లో ఉంది. చంద్రబాబు హయాంలో ఆరోహి సోలార్ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.63 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇందులో భాగంగా... ప్రైవేటు నుంచి కాకుండా,‘ట్రిపుల్ ఏ’ రేటింగున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)’ నుంచి నేరుగా 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునే ఒప్పందం చేసుకుంది. నిజానికిదే ఒప్పందం చంద్రబాబులా ఏ ప్రైవేటు కంపెనీలతోనో చేసుకుంటే ‘ఈనాడు’ దాని బృంద మీడియా శివాలెత్తేసేవి. కానీ నేరుగా సెకీతో కావటంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టి.. చివరకు ఆ సెకీ అదానీ, తదితరుల నుంచి కొని రాష్ట్రానికి అందిస్తుందంటూ... అదానీ కోసమే ఈ ఒప్పందం చేసుకున్నారంటూ కొత్త రాగం మొదలెట్టాయి. దీనికన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా రామోజీ? 2024 నుంచి 18 లక్షల మందికి పగటిపూట 9 గంటల పాటు ప్రత్యేక డిస్కమ్ ద్వారా ఉచిత విద్యుత్ అందటమే మహాపరాధంగా పరిగణిçస్తూ రాస్తున్న మీ కథనాలను ఏమనుకోవాలి? ఇదెక్కడి దివాలాకోరుతనం? ‘టాటా’ సంస్థ ఏమన్నది రామోజీ? నిజమే! వ్యవసాయ విద్యుత్ కోసం 6,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీఈసీఎల్) 2020లో టెండర్లు పిలవటం నిజం. దాన్నెవ్వరూ కాదనరు. యూనిట్ రూ.2.49, రూ.2.56 చొప్పున ఇస్తామని బిడ్లు దాఖలు కావటమూ నిజమే. మరి ఈ బిడ్లలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) కూడా ఉందిగా!. ఆ విషయమెందుకు ప్రస్తావించరు రామోజీ? ఈ టెండర్లు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని టాటా సంస్థ కోర్టుకెళ్లింది. మీరు మాత్రం ఇలా కాకుండా... టెండరు నిబంధనలు కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉన్నాయంటూ టాటా సంస్థ కోర్టుకెక్కినట్లు రాసిపారేశారు. ఇదెక్కడి పాత్రికేయం? ఆ సంస్థ కోర్టులో కాకుండా మీతో మాత్రమే ఈ విషయం చెప్పిందా? మరీ ఇంత తప్పుడు రాతలేల? చంద్రబాబు హయాంలో దయానిధి సోలార్ పవర్ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.97 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. నిజమే! కానీ రాజస్థాన్‌లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 23.5 శాతం. కానీ ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా? గ్రిడ్ చార్జీలు మినహాయించారు గనకే... సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఇçప్పుడున్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువవుతోంది. అందుకే తొలత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ... తరువాత సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని అంశాలనే ప్రస్తావించటం ద్వారా ‘ఈనాడు’ తప్పుడు సమాచారానికే ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది. అందుకే... కేంద్రం ఆమోదం 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3వేల మెగావాట్లు, 2026లో 1000 మెగావాట్లు చొప్పున 7 వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుంది. డిస్కమ్‌తో పాటు ప్రభుత్వమూ ఒప్పందంలో భాగస్వామి కావటంతో చెల్లింపులకు ఇబ్బంది ఉండదు. అందుకే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. చంద్రబాబు హయాంలో నిరంజన సోలార్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.71 చొప్పున కుదుర్చుకున్న సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏటా రూ.3,750 కోట్ల ఆదా... ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్‌కు రూ.2.49కి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతోంది. కాకపోతే ‘ఈనాడు’ రాతల్లో ఇవేవీ ఉండవు. ఆ రాతల లక్ష్యం వేరు మరి. 35 వేల కోట్ల భారం.. ఎవరి పాపం? టీడీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44లకు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిసి రూ.3.54), ఏకంగా యూనిట్ రూ.6.99కి కొన్న చరిత్ర బాబుది. దాన్ని ఏమాత్రం విమర్శించని నిఖార్సయిన జర్నలిజం రామోజీది. ఇక çపవన విద్యుత్కయితే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో మరీ పీపీఏలు చేసేశారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటమే చిత్రం. 4 వేల మెగావాట్లకు ఒప్పందాలపై సంతకాలు చేశాక ఎక్కువ చెల్లిస్తున్నట్లు చంద్రబాబుకు గుర్తుకువచ్చి ఏపీఈఆర్సీకి ఓపీ నెం.17ను దాఖలు చేయటం హాస్యాస్పదమే తప్ప మరొకటి కాదనే చెప్పాలి. ఏదేమైనా ఫలితం మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం. అది కూడా 25 ఏళ్లపాటు. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కమ్‌లు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. ఈ కథంతా ‘ఈనాడు’కు ఇంపుగా అనిపించటం చిత్రాతిచిత్రం. – సాక్షి, అమరావతి ‘ఈనాడు’కి అక్కర్లేని నిజాలివీ... ►టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్లు రుణాలు తీసుకుని 2018–19 నాటికి వాటిని ఏకంగా రూ.62 వేల కోట్లకు చేర్చటం నిజం కాదా? ►గత ప్రభుత్వం బకాయిలకు 2014–19 మధ్య రూ.24,165 కోట్లు మాత్రమే చెల్లించగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.35,963 కోట్లు చెల్లించటం అబద్ధమా? ►విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీ అరికట్టి మూడేళ్లలో విద్యుత్ కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్లు ఆదా చేయటం నిజం కాదా? ►వ్యవసాయ రంగానికి ఐదేళ్లలో టీడీపీ విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీ రూ.21,497 కోట్లు. ఈ నిజాలతో మీకు పనిలేదా రామోజీ? -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్‌లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్‌కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్‌లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
నెల తక్కువ.. మోత ఎక్కువ!
హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్ వాడితే బిల్లు తక్కువ రావాలి కానీ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరిలో 31 రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లేశారు. మార్చిలో నెల పూర్తవకముందే 27 రోజులకే రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. 27 రోజుల్లో 178 యూనిట్లు వాడగా 31 రోజులకు 204 యూనిట్లు వాడతారని అంచనా వేసి 200 యూనిట్లకు పైగా వినియోగానికి సంబంధించిన శ్లాబును వర్తింపజేశారు. ఈ శ్లాబు కింద.. తొలి 200 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.5 చొప్పున, తర్వాత 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీలు వర్తిస్తాయి. 204 యూనిట్లు వాడినట్టు అంచనా వేసినందున తొలి 200 యూనిట్లకు ఓ రేటు.. మిగిన 4 యూనిట్లకు మరో రేటు వర్తించనుంది. ఈ లెక్కన అసలు వాడిన 178 యూనిట్లలో 174 యూనిట్లకు యూనిట్‌కు రూ.5 చొప్పున, మిగిలిన 4 యూనిట్లకు యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీ విధించారు. ఈ దెబ్బకు చార్జీ రూ.898 (174్ఠ5 + 4్ఠ7.20) కు పెరిగింది. రూ.60 కస్టమర్ చార్జీలు, రూ.10 ఈడీ కలిపి బిల్లు రూ.969కు పెరిగింది. నెల కాకముందే బిల్లులు జారీ చేసి వినియోగదారులకు డిస్కంలు ఎలా టోపీ పెడుతున్నాయో ఈ కేసుతో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: డిస్కంల తప్పు వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. కొందరికి నెల పూర్తికాకముందే బిల్లులు జారీ చేస్తూ సగటున నెల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును మారుస్తుండటంతో బిల్లులు పెరిగి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తప్పు డిస్కంలదైనా మూల్యం మాత్రం వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇలా ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్‌కు విరుద్ధంగా శ్లాబుల మార్పు అక్రమమని నిపుణులు తప్పుబడుతున్నారు. ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని.. నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో ఇది సాధ్యమవట్లేదు. నెల దాటాక కానీ, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు. నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. దీన్ని అడ్డుగా పెట్టుకుని రివర్స్‌లో సైతం డిస్కంలు అమలు చేస్తున్నాయి. నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి. సకాలంలో మీటర్ రీడింగ్ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీగా బిల్లు కట్టాల్సి వస్తోంది. ఎంత వాడితే ఆ స్థాయి శ్లాబే ఉండాలి విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌కు కట్టుబడి డిస్కంలు బిల్లులు జారీ చేయాలి. నెల గడవక ముందే జారీ చేసే బిల్లుల విషయంలో దీన్ని ఉల్లంఘిస్తున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎంత విద్యుత్ వాడితే అందుకు సంబంధించిన శ్లాబునే వర్తింపజేయాలి. నెల కాకముందే రీడింగ్ తీసి వినియోగాన్ని ఊహాజనితంగా అంచనా వేసి ఎక్కువ చార్జీలున్న శ్లాబును వర్తింపజేయడం అక్రమమని నిపుణులు అంటున్నారు. ఆటోమెటిక్‌గా శ్లాబులు మార్చి అధిక బిల్లులు జారీ చేసేలా మీటర్ రీడింగ్ యంత్రాల్లోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం గమనార్హం. దీనిపై ఈఆర్సీ పరిశీలన జరపాలని నిపుణులు కోరుతున్నారు. శ్లాబులు మార్చడం అక్రమమే నెల దాటాక రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తే శ్లాబులు మారి బిల్లులు పెరుగుతున్నాయని గతంలో ఈఆర్సీని ఆశ్రయించాం. నెల దాటాక మీటర్ రీడింగ్ తీస్తే నెల రోజుల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును వర్తింపజేయాలని నాడు డిస్కంలకు ఈఆర్సీ ఆదేశించింది. నెల నిండక ముందే జారీ చేసే బిల్లులకూ డిస్కంలు ఈ ఉత్తర్వులను అక్రమంగా వర్తింపజేసి దోచుకుంటున్నాయి. వాడకాన్ని తగ్గించుకున్నా ఈ విధానం వల్ల ప్రయోజనం ఉండట్లేదు. దీన్ని డిస్కంలు ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటివరకు అధికంగా వసూలు చేసిన రూ. వందల కోట్ల బిల్లులను వినియోగదారులకు తిరిగివ్వాలి. –డి.నర్సింహారెడ్డి, విద్యుత్ రంగం నిపుణుడు వచ్చే నెల బిల్లుల్లో డబుల్ మోత ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రానుండటంతో ఏప్రిల్ వినియోగానికి సంబంధించి వచ్చే మే నెలలో జారీ చేసే బిల్లులు భగ్గుమని మండబోతున్నాయి. ఈ పరిస్థితిలో నెల తిరగకుండానే మీటర్ రీడింగ్ తీసి తర్వాత శ్లాబునులను మార్చి బిల్లులు జారీ చేస్తే వినియోగదా రులపై డబుల్ భారం పడనుంది. -
పీపీఏ ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి లేదు
సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) సమీక్షించి, వాటి ధరలను సవరించే అధికారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లేదని సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సౌరవిద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. పీపీఏల కింద ధరలను ఖరారు చేసేది ఈఆర్‌సీయేనని, ఆ సంస్థ ఖరారు చేసిన ధరలను తిరిగి ఆ సంస్థే సవరించడానికి అవకాశంలేదని చెప్పారు. పీపీఏ నిబంధనల ప్రకారం ధరలను సవరించే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) లేదని, దీంతో అవి ఈఆర్సీ ముందు పిటిషన్ వేసి దాని ద్వారా ధరలను సవరించాలని చూస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను డిస్కంల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. అందుకే పీపీఏ ధరలను ఈఆర్సీ వద్దే తేల్చుకోవాలని సింగిల్ జడ్జి స్పష్టం చేశారని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. -
బల్దియా విద్యుత్ విభాగంలో.. అవినీతి చీకట్లు
సాక్షి, హైదరాబాద్: వంద శాతం ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశామని, బల్దియాకు రూ.428 కోట్లు ఆదా అయిందని జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం గొప్పలు చెబుతోంది. కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం ఉన్నాయి. వందశాతం వెలుగులు రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. బల్దియాకు వివిధ మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదుల్లో విద్యుత్ దీపాలవే అధికం. అయినా విద్యుత్ ఇంజినీర్లు పనులు సరిగా చేయరు. చాలామంది రోజూ ఆఫీసుకు కూడా రారు. ఒక్కరోజు ఆఫీసుకొస్తే.. తిరిగి ఇళ్లకు వెళ్లేముందు నాలుగైదు ఫిర్యాదులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని.. వారం మొత్తం ఆ పనుల్లో నిమగ్నమైనట్లు మాయ చేస్తారు. రోజూ అటెండెన్స్ ఉండదు. బయోమెట్రిక్ అసలే ఉండదు. వచ్చిన రోజే అన్ని సంతకాలూ చేసుకుంటారు. ఇదేమని అడిగే వారికి ‘ఫీల్డ్‌లో’ అనే సమాధానం రెడీగా ఉంటుంది. వారి పైస్థాయిలోని వారూ ఆమ్యామ్యాలతో పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. లంచాలతోనే ఎంట్రీ.. ►బల్దియాలో ప్రవేశించేందుకు మొదలయ్యే లంచాల పర్వం ఏటా కొనసాగింపులకు, ఇతరత్రా సందర్భాల్లో సాగుతుంది. సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని, చేయి తడిపితే పని ఈజీగా అవుతుంది. ఇది ఒకవైపు దృశ్యం కాగా, బల్దియాలో ఎల్ఈడీ పథకం నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు అనుకూలంగా వ్యవహరిస్తూ, వారికి మేలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ►ఈఈఎస్ఎల్ పేరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా.. గ్రేటర్లో సబ్లీజుకు న డిపిస్తున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు 98 శాతం వెలుగులుంటేనే వారికి బిల్లులు చెల్లించాలి. కానీ.. ఆ మేరకు వీధుల్లో వెలుగులు లేకున్నా ‘సిమ్యులేషన్ల’తో బురిడీ కొట్టిస్తారు. డ్యాష్‌బోర్డులో వెలుగుతున్నట్లు చూపిస్తారు. అందుకుగాను అందాల్సిన వారికి ముడుపులు ఆందుతాయనే ఆరోపణలున్నాయి. ►ఇటీవల మరో కొత్త ఎత్తుగడ నేర్చుకున్నారు. ఉన్న లైట్లన్నీ వెలగవు. 98 శాతంగా చూపేందుకు కనెక్టెడ్, ఆన్, ఆఫ్‌ల పేరిట.. ఆన్ అయిన వాటిల్లోని శాతాన్ని పరిగణనలోకి తీసుకొని నిధుల చెల్లింపులు జరిగేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ అన్ని లైట్లు కనెక్ట్ కాకున్నా పట్టించుకునే వారే లేరు. వాస్తవ పరిస్థితుల్ని బట్టి ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్‌లు కావాల్సి ఉన్నా ఆ ప్రక్రియ సాగడం లేదు. పట్టపగలే వెలిగేవి.. రాత్రుళ్లు వెలగనివి ఎన్నో. ►ఎక్కడికక్కడ అవసరమైనన్ని డెడికేటెడ్ లాడర్స్ లేవు. విద్యుత్విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్లు పనిచేయాల్సి ఉండగా, మెకానికల్, టెలికామ్ విభాగాల వారు కూడా విధులు నిర్వహించడం బల్దియాలోనే సాధ్యం. మెకానికల్ వారికి భారీ జీతాలు చెల్లించేందుకు ఆడిట్ విభాగం నిరాకరించినా.. కొనసాగిస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ►ఇక ఆయా ఉత్సవాలు.. తదితర సందర్భాల్లో ఏర్పాటు చేసే టెంపరరీ లైట్ల పేరిట మరో దందా. స్ట్రీట్‌లైట్ పోల్స్‌కే టెంపరరీ లైట్లు వేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అడిగే వారుండరు. టెండరులో పేర్కొన్న దానికంటే 60 శాతం లెస్‌గా వేసినా.. కాంట్రాక్టరు లాభపడుతున్నారంటే.. లైట్లు వేస్తారో , కాగితాల్లోనే చూపుతారో ఊహించుకోవచ్చు. కొన్ని విభాగాల్లోని వారు చేసే పనులే రూ.10లక్షల విలువ చేయకున్నా.. వేతనాల పేరిట ఏటా రూ.12 లక్షలకుపైగా చెల్లిస్తారు. ఇలా.. జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగంలో బయటకు కనిపించని చీకటి దృశ్యాలెన్నో! ఎన్నెన్నో!!. -
ఓల్డ్ సిటీకి పోటీగా గజ్వేల్, సిద్దిపేట.. ఏ విషయంలో అంటే?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యం, బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థత వెరసి విద్యుత్ శాఖను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. పలు డివిజన్లలో ఇలాంటి కారణాలతో సంస్థకు కోట్ల రూపాయలు లోటు వస్తోంది. వీటిలో ఇప్పటిదాకా ఓల్డ్ సిటీ ముందుండగా.. దీనికి పోటీగా గజ్వేల్, సిద్ది పేట కూడా ఉండటం గమనార్హం. దక్షిణ తెలంగాణ లోని 5 ఉమ్మడి జిల్లాల పరి ధిలో అత్యధిక విద్యుత్ నష్టాలు చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట డివిజన్లలో నమోదయ్యాయి. చార్మినార్ డివిజన్లో 35.73%, గజ్వేల్‌లో 35.5%, ఆస్మాన్‌గఢ్‌లో 35. 01%, సిద్దిపేటలో 32.31% సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్) నష్టాలు జరిగినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్వ హించిన తొలి త్రైమాసిక ఎనర్జీ ఆడిట్లో బహిర్గత మైంది. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సం స్కరణల అమల్లో భాగంగా సంస్థ ఎనర్జీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. 2021 జూలై 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నిర్వహించి గురువారం నివేదికను ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఏటీఅండ్‌సీ నష్టాలు 10.63% ఉండ డం గమనార్హం. సాంకేతిక లోపాలతో జరిగే విద్యు త్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని సాంకేతిక పరిభాషలో ‘అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ (ఏటీఅండ్‌సీ) లాసెస్’అంటారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 20 సర్కిళ్లు, 50 డివిజన్లు, 1,01,32,163 మంది వినియోగదారులు ఉన్నారు. అధిక ఏటీఅండ్ సీ నష్టాలు ఇక్కడే... ► చార్మినార్ డివిజన్‌కు 198.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ సరఫరా చేయగా, వినియోగదారుల మీటర్ల నుంచి తీసిన లెక్కల ప్రకా రం 122.7ఎంయూల అమ్మకాలే జరిగాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల రూపంలో 76.04(38%) ఎంయూల విద్యుత్ నష్టమైంది. అయితే, ఈ జోన్ పరిధిలో మీటర్డ్ సేల్స్‌కి జారీ చేసిన బిల్లులకు 104% వసూళ్లు జరిగాయి. గృహాల నుంచి 107.47% కలెక్షన్ ఉంది. ► గజ్వేల్ డివిజన్‌కు 399.44 ఎంయూల విద్యుత్ సరఫరా కాగా, 201.9 ఎంయూలు మీటర్డ్ సేల్స్, 171.72 ఎంయూలు అన్‌మీటర్డ్ సేల్స్(మీటర్ లేని వ్యవసాయ పంప్ సెట్లకు) జరిగా యి. సాంకేతికంగా 25.7 శాతం నష్టాలు నమోద య్యాయి. మొండిబకాయిలతో ఏటీఅండ్‌సీ నష్టాలు 35.5 శాతానికి పెరిగాయి. గృహాలు 102.19%, రైతులు 64.54%, ఎల్టీ కమర్షియల్/ ఇండస్ట్రీలు 105.68%, హెచ్‌టీ కమర్షియల్/ఇండస్ట్రీలు 90.27% బిల్లులు చెల్లించగా, ఇతరులు మాత్రం 38.01 శాతమే బిల్లులు చెల్లించారు. ► దక్షిణ హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆస్మాన్‌గఢ్ డివిజన్‌కు 176.5 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 107.26 ఎంయూలకే బిల్లింగ్ జరిగింది. అంటే 69.55 ఎంయూ (39%)ల విద్యుత్ నష్టపోయింది. ఏటీఅండ్‌సీ నష్టాలు 35.01% ఉన్నాయి. ► బేగంబజార్ డివిజన్‌కు 120.95 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 42.05 (35శాతం) ఎంయూల నష్టం వాటిల్లింది. 78.91 ఎంయూలకు మాత్రమే బిల్లింగ్ జరిగింది. ఈ డివిజన్ పరిధిలో ఏటీఅండ్‌సీ నష్టాలు 34.01శాతం. ► సిద్దిపేట డివిజన్‌కు 341.27 ఎంయూలను సరఫరా చేస్తే మీటర్డ్ రీడింగ్ ద్వారా 158.4, అన్మీటర్డ్గా 157.55 ఎంయూలు కలిపి మొత్తం 316 ఎంయూలకు బిల్లింగ్ జరిగింది. 25.12 (7శాతం) ఎంయూలు నష్టపోయాయి. మొండి బకాయిల వల్ల 32.31 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నాయి. -
హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..
Mentally unstable man climbs electricity tower: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసే పనులు చాలా భయానకంగానూ, ఒక్కొసారి వికృతంగా కూడా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి స్వీట్లు, మొబైల్ ఫోన్ కావలంటూ ఏకంగా విద్యుత్ టవర్ పైకి ఎక్కేశాడు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే.....బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్పూర్ గ్రామంలో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హై ట్రాన్స్మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పైగా వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని కోరడం ఆశ్చర్యంగా కల్గించింది. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు ఆ వ్యక్తి హై పవర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్‌లో కూర్చొని అంత ఎత్తు నుంచి కింద పడిపోతానేమో అనే భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా టవర్ ఎక్కాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎప్)ని పిలిపించారు. అయితే స్థానికులు మాత్రం ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశాడని చెబుతున్నారు. అయితే అతన్ని కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!) -
విద్యుత్ బిల్లు తెస్తే మెరుపు సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె నిర్వహిస్తారని విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ హెచ్చరించింది. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 8న రాష్ట్రాలు, జిల్లాల స్థాయిల్లో నిరసనలకు కమిటీ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 15న భారీ ధర్నాకు జాతీయ సమన్వయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజైన 2022 ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగాలని కమిటీ పిలుపునిచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు మెరుపు సమ్మెకు దిగితే నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్రిడ్ కుప్పకూలి దేశమంతా అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణతో మాకు నష్టమే: ఉద్యోగులు విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు రాచమార్గం వేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లుతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీలు, సరఫరా, నాణ్యతలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేవని, ఇదే జరిగితే ప్రభుత్వరంగ డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయి మూతపడే ప్రమాదముందని అంటున్నారు. ఫలితంగా లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు రోడ్డునపడతారని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్రం తమ హక్కుల ను హరించేందుకు ప్రయత్నిస్తోందని చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని చెబుతోంది. ఈ విషయమై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశాల్లో తెలిపింది. -
ట్రూఅప్‌కు తాత్కాలిక బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూ అప్)కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల చార్జీలతో కలిపి సెప్టెంబరు, అక్టోబరు నెలల బిల్లుల్లో వసూలు చేశారు. దీంతో డిస్కంలు తమ నష్టాల్ని కొంత మేర భర్తీ చేసుకోగలిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో ఈ నెల విద్యుత్ బిల్లులు (అక్టోబరు చార్జీలు) ట్రూఅప్ చార్జీ లేకుండానే వినియోగదారులకు అందాయి. రెండు నెలలు వసూలు 2014–15 ఆర్థిక సవంత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సీ రూ.3,669 కోట్ల వసూలుకు ఆగస్టులో అనుమతినిచ్చింది. సెప్టెంబర్, అక్టోబరు నెలల బిల్లుల్లో ఆ మేరకు డిస్కంలు చార్జీలు విధించాయి. వీటిపై పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఉత్తర్వులను నిలిపివేసి మళ్లీ విచారణ చేపట్టింది. అక్టోబర్ 19న ఒకసారి, నవంబర్ 1న మరోసారి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో డిస్కంలు నవంబర్ నెల బిల్లు.. అంటే అక్టోబర్ నెల వినియోగానికి ట్రూ అప్ చార్జీలు వేయలేదు. ఫలితంగా రెండు డిస్కంల పరిధిలోని దాదాపు 1.27 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున చార్జీలు తగ్గాయి. సాధారణ వినియోగానికే బిల్లు పడింది. ఈ నెల 24న మరోసారి విచారణ మరోవైపు 2019–20 ఆర్ధిక సంవత్సరానికి ఏపీఈపీడీసీఎల్ రూ.701.28 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.1,841.58 కోట్లు చొప్పున మొత్తం రూ.2,542.86 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ ఏపీఈఆర్సీకి పిటిషన్లు దాఖలు చేశాయి. అదే విధంగా 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య రూ.528.71 కోట్ల ట్రాన్స్మిషన్ బిజినెస్ ట్రూ అప్ చార్జీల వసూలు పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీట్రాన్స్కో) సమర్పించింది. వీటన్నిటిపైనా ఏపీఈఆర్సీ ఈనెల 24న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనుంది. వీటితో కలిపి, ఇప్పటికే విచారణ పూర్తయిన ట్రూ అప్ చార్జీల్లో ఎంత వసూలు చేయాలనేది ఏపీఈఆర్సీ నిర్ణయంపై అధారపడి ఉంది. -
‘స్మార్ట్’గా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు రానున్నాయి. వీటి ద్వారా నాణ్యమైన, సరఫరాలో లోపాలు లేని విద్యుత్‌ను పొందవచ్చు. మొబైల్ ఫోన్ల లాగానే ముందుగా రీచార్జ్ చేసుకొని మనకు ఎంతమేరకు విద్యుత్ అవసరమో అంతే పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు, డిస్కంలకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ మీటర్లు అమరుస్తున్నారు. 2025 నాటికి స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి తేవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. మూడు, నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాల్లో 250 మిలియన్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అవే సంస్కరణలను రైతులు, డిస్కంల శ్రేయస్సు కోసం వినియోగిస్తోంది. ప్రభుత్వ సర్వీసులకు టెండర్లు పిలిచిన ఏపీ డిస్కంలు కేంద్రం రూపొందించిన నమూనా పత్రం ఆధారంగా రాష్ట్రంలోనూ టెండర్లు పిలిచారు. ముందుగా ప్రభుత్వ రంగ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో లక్ష సర్వీసులు చొప్పున, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 1.30 లక్షల సర్వీసులకు టెండర్లు పిలిచారు. డిసెంబర్ 1 నుంచి మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు డిస్కంల సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికోసం 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) నుంచి తీసుకోనుంది. ఉచిత విద్యుత్ లక్ష్య సాధనకు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులపై భారం పడకుండా ఈ మీటర్ల వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో రైతుల సమ్మతితో వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని మీటర్లు బిగిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,200కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వమే మీటర్లు ఏర్పాటు చేస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎప్పటికప్పుడు మొబైల్‌కు సమాచారం స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ ద్వారా వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. వినియోగదారులు రీచార్జ్ వంటి సేవలను, ఫిర్యాదులను వారి మొబైల్ ద్వారానే పొందవచ్చు. ఎంత విద్యుత్ అవసరమనుకుంటే అంతే రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వ, వ్యవసాయ సర్వీసులకే స్మార్ట్ మీటర్లు అమర్చనున్నందున ప్రభుత్వమే రీచార్జ్ ప్రక్రియను ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నో ప్రయోజనాలు ► స్మార్ట్ మీటర్లతో మొబైల్ రీచార్జ్ మాదిరిగానే ముందుగా విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల పంపిణీ సంస్థలకు ముందుగానే నగదు జమ అవుతుంది. బకాయిల భారం ఉండదు. ► అవసరం మేరకే విద్యుత్ వినియోగించొచ్చు. వృధా ఉండదు ► సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు లభిస్తుంది ► పంపిణీ వ్యవస్థలో లోపాలను, లో ఓల్టేజిని త్వరగా గుర్తించి, విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించొచ్చు ► గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడును కచ్చితంగా లెక్కించవచ్చు. లోడు ఎక్కువ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం పెంచొచ్చు ► రూఫ్ టాప్ సోలార్ ఉన్నవారికి ఆదాయ వనరుగా మారడానికి టూ–వే ఫ్లో డిటెక్షన్‌తో నెట్ మీటరింగ్‌ను కూడా అందిస్తుంది ► సబ్సిడీ విద్యుత్ పొందే ప్రజల సర్వీసులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేయడం వల్ల సబ్సిడీ సొమ్ము వారి ఖాతాలకు జమ అవుతుంది ► గ్రిడ్‌ను స్థిరీకరించడానికి స్మార్ట్ మీటర్లు సహాయపడతాయి -
సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదని, బొగ్గు సంక్షోభం తాత్కాలికమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్ రంగ ఉద్యోగులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ తక్కువ అంతరాయాలతో, కొంత లోడ్ రిలీఫ్ చర్యలతో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. -
ఇక విద్యుత్ లెక్కలు పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత విద్యుత్ వినియోగించారు, ఎక్కడెక్కడ ఎంతెం త నష్టం వాటిల్లిందన్న లెక్కలు ఇక పక్కాగా తేలనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ఎక్కడిక్కడ మీటర్లు పెట్టి, ప్రతి యూనిట్ విద్యుత్‌కు లెక్కలు చూపాల్సి రానుంది. ఈ మేరకు డిస్కంలు త్రైమాసిక, వార్షిక విద్యుత్ ఆడిటింగ్ నిర్వహించడాన్ని తప్పనిసరి చేస్తూ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)’సంస్థ రూపొందించిన ఎనర్జీ ఆడిట్ నిబం ధనలు–2021ను కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చింది. సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్ ఆధ్వర్యంలో వచ్చే 60 రోజుల్లోగా డిస్కంలన్నీ త్రైమాసిక ఆడి ట్ పూర్తి చేయాలని.. ఇండిపెం డెంట్ అక్రిడేటెడ్ ఆడిటర్ ద్వారా వార్షిక విద్యుత్ ఆడిట్ నిర్వహించాలని సూచించింది. అంతేకాదు డిస్కంలు ఈ ఆడిట్ నివేదికలను తమ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. వివిధ దశల్లో మీటర్లతో.. డిస్కంలు తమ సరఫరా వ్యవస్థల్లోని వివిధ వో ల్టేజీ స్థాయిల్లో ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. విద్యుత్ కేంద్రాల నుంచి 33/11 కేవీ సబ్స్టేషన్లకు వచ్చే విద్యుత్.. అక్కడి నుంచి 11 కేవీ ఫీడర్లకు జరిగే సరఫరా.. 11 కేవీ ఫీడర్ల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాన్స్ఫార్మర్లకు సరఫరా.. ట్రాన్స్ఫార్మర్ల నుంచి వినియోగదారులకు సరఫరా.. ఇలా అన్నిదశల్లో విద్యుత్ ఇన్పుట్, ఔట్‌పుట్‌లను రికార్డు చేయడానికి ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ మీటర్లను అమర్చాల్సి ఉంటుం ది. ప్రతి మూడు నెలలకోసారి, ఏడాదికోసారి ఆడిటర్లు మీటర్ రీడింగ్ లెక్కలు తీసి నివేదికలను రూపొందించనున్నారు. ఏ ఫీడర్/ ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో విద్యుత్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణాలేమిటన్నది తేలనుంది. సాంకేతిక కారణాలతో నష్టాలు వస్తే.. గుర్తించి మరమ్మతులు చేపడతారు. విద్యుత్ చౌర్యాన్ని అధికంగా ఉంటే నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మొత్తంగా విద్యుత్ నష్టాలను తగ్గించే చర్యలు చేపడతారు. ప్రయోజనాలెన్నో.. వివిధ రంగాల విద్యుత్ వినియోగంతోపాటు సరఫరా (ట్రాన్స్మిషన్), పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) సందర్భంగా ఏ ప్రాంతంలో ఎంత నష్టం వస్తోందన్న వివరాలు ఆడిట్ నివేదికల్లో ఉంటాయి. అధిక నష్టాలున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడానికి ఇది వీలుకల్పించనుంది. విద్యుత్ నష్టాలు, చౌర్యం నివారణకు ఆయా ప్రాంతాల అధికారులను బాధ్యులు చేయడానికి ఎనర్జీ ఆడిటింగ్ లెక్కలు ఉపయోగపడనున్నాయి. అంతేగాకుండా.. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలుగుతుంది. విద్యుత్ పంపిణీ రంగంలో నష్టాలను తగ్గించడం, డిస్కంలను బలోపేతం చేయడం లక్ష్యంగా.. ఇంధన పొదుపు చట్టం కింద కేంద్రం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అసలు లెక్కలు బయటపడతాయి ప్రస్తుతం విద్యుత్ ఆడిటింగ్ లేకపోవడంతో డిస్కంలు.. నష్టాలు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశాలను నామ్కేవాస్తేగా అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో.. చాలావరకు విద్యుత్ నష్టాలను రైతుల ఖాతాల్లో వేసేస్తున్నారని, అసలు నష్టాలను తక్కువ చేసి చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్ అమల్లోకి వస్తే వాస్తవాలేమిటో తేలుతాయని కేంద్రం పేర్కొంటోంది. -
నగరాల్లో నిరంతర కరెంట్
సాక్షి, హైదరాబాద్: మెట్రోలు, పెద్ద నగరాల్లో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంతరాయాలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి రానుంది. సరఫరాలో అంతరాయం కలిగితే డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గురువారం విద్యుత్ (వినియోగదారుల హక్కుల) నిబంధనల సవరణ ముసాయిదా–2021ను ప్రకటించింది. పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్ జనరేటింగ్ సెట్ల వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ముసాయిదాపై అక్టోబర్ 21లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని కోరింది. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. తెరపైకి కొత్తగా విశ్వసనీయత చార్జీలు పెద్ద నగరాల్లో వినియోగదారులు డిస్కంలు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా నగరాలకు సంబంధించి..సగటు అంతరాయాల పునరావృతం సూచిక, సగటు అంతరాయాల వ్యవధి సూచికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రూపకల్పన చేయనుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముంటే, అందుకు అవసరమైన పెట్టుబడిని వినియోగదారుల నుంచి ‘రిలయబిలిటీ (విశ్వసనీయత) చార్జీల’పేరుతో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించనుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైతే డిస్కంలకు ఈఆర్సీ జరిమానాలు విధించనుంది. ఐదేళ్లలో జనరేటర్లు మాయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బ్యాకప్‌గా డీజిల్ జనరేటర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ముసాయిదా అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోగా, లేదా రాష్ట్ర ఈఆర్సీ నిర్దేశించిన కాల వ్యవధిలోగా బ్యాటరీలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ వంటి కాలుష్య రహిత టెక్నాలజీకి మారాలి. సంబంధిత నగరంలో డిస్కంల విద్యుత్ సరఫరా విశ్వసనీయత ఆధారంగా ఈఆర్సీ ఈ గడువును నిర్దేశిస్తుంది. నిర్మాణ కార్యకలాపాలు, ఇతర తాత్కాలిక అవసరాలకు దర ఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేయాల్సి ఉండనుంది. -
ప్రీపెయిడ్ కరెంట్‌కు డెడ్‌లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ రంగ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పదునుపెట్టింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రకటించిన కేంద్రం.. బిల్లు ఆమోదానికి ముందే అందులోని లక్ష్యాల సాధన దిశగా చర్యలను వేగిరం చేసింది. విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గడువులను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాల(ఐఎస్–16444) మేరకు కింద పేర్కొన్న గడువుల్లోగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ►అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 50 శాతానికి మించి పట్టణ ప్రాంత వినియోగదారులను కలిగి ఉండి 2019–20లో 15 శాతానికి మించిన సాంకేతిక, వాణిజ్యపర(ఏటీఅండ్‌సీ) నష్టాలున్న విద్యుత్ డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు.. 2023, డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. 2019–20లో 25 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన ఇతర విద్యుత్ డివిజన్లు, మండల(బ్లాక్), ఆపై స్థాయిల్లో కూడా ఇదే గడువులోపు అందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్కోసారి ఆరు నెలలకు మించకుండా నోటిఫికేషన్ ద్వారా రెండు పర్యాయాలు ఈ గడువు పొడిగించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అవకాశం కల్పించింది. అయితే దీనికి సరైన కారణాలు చూపాలి. ►ఇతర అన్ని ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు ప్రీపెయిడ్ పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి. ►అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యానికి మించి అధిక మోతాదులో విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) సదుపాయం గల స్మార్ట్ మీటర్లను బిగించాలి. ►అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీ)కు ఈ కింద పేర్కొన్న గడువుల్లోగా ఏఎంఆర్/ఏఎంఐ సదుపాయం ఉన్న మీటర్లను ఏర్పాటు చేయాలి. ►2022, డిసెంబర్‌లోగా అన్ని ఫీడర్లకు మీటర్లు బిగించాలి. ►50 శాతానికి మించి పట్టణ వినియోగదారులు కలిగి ఉండి... 2019–20లో 15 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని అన్ని డీటీలకు, 2019–20లో 25శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని డీటీలకు డిసెంబర్ 2023లోగా మీటర్లు బిగించాలి. ►ఇతర అన్ని డివిజన్లలోని డీటీలకు 2025 మార్చిలోగా మీటర్లు ఏర్పాటు చేయాలి. ►25కేవీఏ కన్నా తక్కువ సామర్థ్యం గల డీటీలు, హెచ్‌వీడీఎస్‌లకు పైన పేర్కొన్న గడువుల నుంచి మినహాయింపు. -
కూలీ ఇంటికి రూ.లక్షల్లో కరెంట్ బిల్లు
సాక్షి, ఉరవకొండ: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య రైతు, కూలీ కుటుంబాలకు లక్షల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో బాధితులు షాక్‌కు గురవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సాధారణ కూలీ పర్వతప్పకు ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 బిల్లు వచ్చేది. కానీ జూన్‌కు సంబంధించిన బిల్లు ఏకంగా రూ.1,48,371 రావడంతో అవాక్కయ్యాడు. విద్యుత్‌శాఖ అధికారుల వద్దకు వెళ్ళి తనకు వచ్చిన కరెంట్ బిల్లు చూపించాడు. తాను కూలీ పనులకు వెళ్ళే వాడినని తన ఇంటోŠల్ రెండు బల్పులు, ఒక ఫ్యాను, టీవీ మాత్రమే ఉందని, ఇంత బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. పర్వతప్పపై అధికారులు చివరికి కనికరం చూపి రూ.56,399 తగ్గించి మిగతా బిల్లు మొత్తం కట్టాలని అధికారులు సూచించారు. తాను కూలీ పనులకు వెళ్ళేవాడినని తాను ఇంత డబ్బు ఎలా కట్టగలలని కూలీ లబోదిబోమంటున్నాడు. అలాగే గ్రామానికి చెందిన బండయ్య అనే మరో కూలీకి చెందిన ఇంటికి కూడా రూ 16,251 రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నాడు. వీరిద్దరికే కాదు ఇలా గ్రామంలో 15 మంది కూలీ కుటుంబాలకు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమేర బిల్లు తగ్గించాం పాల్తూరు గ్రామంలో సాంకేతిక సమస్య కారణంగానే కరెంటు బిల్లులు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయి. దీంతో పాటు మీటర్లో ఏదైనా సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. అధిక సంఖ్యలో బిల్లు వచ్చిన వారికి కొంతమేర బిల్లులు తగ్గించాము. మిగతాది వారు చెల్లిస్తే సరిపోతుంది. – శ్రీనివాసరెడ్డి, ఏఈ, విద్యుత్‌శాఖ చదవండి: కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు -
కనెక్షన్ల పేరుతో కలెక్షన్.. మేం ఫిక్స్ చేసిందే రేటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త విద్యుత్ లైన్లు.. మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇచ్చేందుకు నిరాకరించిన వారికి కొర్రీలు పెట్టి రోజుల తరబడి కనెక్షన్లు జారీ చేయడం లేదు. జిల్లా పరిధిలోని చంపాపేట, గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కందుకూరు, సైబర్‌సిటీ డివిజన్లలో పని చేస్తున్నఇంజనీర్లపైపెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యమే పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ► ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి భిన్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐటీ అనుబంధ కంపెనీలు, భారీ పరిశ్రమలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ► ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికే కాకుండా అంతర్జాతీయ పారిశ్రామిక రంగానికి కేంద్ర బిందువుగా మారింది. ► కొత్తగా అనేక వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ► వ్యవసాయం సహా మరే ఇతర రంగం మనుగడైనా విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటుంది. ► గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వారి అవసరాల కోసం విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా డిస్కంకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ► 18 మీటర్లు దాటిన బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్, మున్సిపాలిటీ, ఎయిర్పోర్ట్ అథారిటీల నుంచి ఎన్ఓసీ తప్పనిసరి. ► ప్రస్తుత భవనాల్లో చాలా వరకు నిబంధనల మేరకు లేకపోవడం విద్యుత్ ఇంజనీర్లకు కలిసివస్తోంది. ► కొత్త లైన్లు సహా కొత్త మీటర్ల జారీ, ప్యానల్ బోర్డులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలను సాకుగా చూపి కనెక్షన్ల జారీలో జాప్యం చేస్తున్నారు. ► క్షేత్రస్థాయిలోని ఏఈ వేసిన ఎస్టిమేషన్ ఛార్జీలను చెల్లించినప్పటికీ ఇంజనీర్లు మాత్రం పైసా విదల్చనిదే ఫైలు ముందుకు కదపడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ ► జిల్లాలో మొత్తం 17,18,745 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో సైబర్ సిటీలో 5,51,107, రాజేంద్రనగర్‌లో 5,36,743, సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో 6,30,895 కనెక్షన్లు ఉన్నాయి. ► ఒక్కో సర్కిల్ పరిధిలో నెలకు సగటున రెండు వేల కొత్త కనెక్షన్లు వస్తుంటాయి. ► కొత్త మీటర్ జారీకి రూ.1000 నుంచి రూ.1,500 వసూలు చేస్తుండగా, ప్యానల్ బోర్డుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు. ► ఇక అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే మీటర్లు, ప్యానల్ బోర్డు సహా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫ్రార్మర్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తుండడం విశేషం. ► తుర్కయంజాల్, తుక్కుగూడ, బడంగ్పేట్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, బండ్లగూడ జాగీర్, నానక్‌రాంగూడ, నార్సింగి, రాజేంద్రనగర్, మెయినాబాద్, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజనీర్లపై ఉన్నతాధికారులకు ఎక్కువగా ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. పెండింగ్‌లో 3,589 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు ► వరి, ఇతర పంటలు సాగు చేసుకునేందుకు జిల్లాలో ఇప్పటికే వేలాది మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ► సైబర్సిటీలో 909, రాజేంద్రనగర్‌లో 1,712, సరూర్‌నగర్‌లో 968 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ► ఐపీడీఎస్ పథకం కింద డిస్కం జిల్లాకు సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లను వాణిజ్య, పారిశ్రామిక, బహుళ అంతస్తుల భవనాలకు మళ్లించి రూ.లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ► కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఎస్టిమేషన్ మేరకు బిల్లు చెల్లించిన రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ► 2021–22 వార్షిక సంవత్సరంలో 2,300 కనెక్షన్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 1,377 కనెక్షన్లు మాత్రమే జారీ చేశారు. -
ఏపీకి సంబంధించి 2 కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది. -
బిర్యానీ ఇవ్వలేదని కరెంట్ కట్
అమీర్‌పేట: కరెంటు బిల్లులు చెల్లించినా బిర్యానీ ఇవ్వడం లేదన్న కోపంతో హోటల్‌కు కరెంటు సరఫరాను నిలిపివేశారని బల్కంపేటలో గల క్రిస్టల్ బావర్చి హోటల్ నిర్వా హకుడు ఆరోపించారు. హోటల్‌కు సంబంధించి మూడు కరెంటు మీటర్లు ఉన్నాయి. ఒక మీటరుకు రూ. 39,566, రెండో మీటర్‌కు రూ. 4,529, మూడో మీటర్‌కు రూ. 9,682ల కరెంటు బిల్లు వచ్చింది. పై రెండు మీటర్లకు సంబంధించి బిల్లులు 25న చెల్లించగా మూడో మీటర్ బిల్లును 29న చెల్లించామని హోటల్ నిర్వాహకుడు సైయ్యద్ హస్మతుల్లా ఖాద్రి తెలిపారు. ఉదయం కరెంటు సిబ్బంది సుధీర్‌కుమార్, రాజు, జీఎన్ రావులు హోటల్‌కు వచ్చి బిల్లులు చెల్లించని కారణంగా కరెంటును కట్ చేస్తున్నామని తెలిపారు. ఫోన్ పే ద్వారా రెండు బిల్లులు చెల్లించామని, ఓ బిల్లు ఈ రోజే చెల్లించామని, ఫోన్లో చెల్లించినట్లు ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా చూపించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా మూడు మీటర్లకు కరెంటును కట్ చేశారు. హోటల్ యజమాని వచ్చే వరకైనా ఆగాలని హోటల్ సిబ్బంది నవీద్ వేడుకోగా మీ సార్... వచ్చేదాక ఆగాలా అంటూ కరెంటు కట్ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఒక మీటర్‌కు ఆలస్యమైతే మూడు మీటర్లకూ కట్ చేస్తారా.. మూడో మీటర్ ఒక్క దానికి బిల్లు చెల్లింపు ఆలస్యం జరిగితే మూడు మీటర్లకు విద్యుత్ సరఫరా ఎలా నిలిపివేస్తారని యజమాని ఖాద్రి వాపోయాడు. ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆహార పదార్థాలు అన్ని పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ( చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. ) -
డిష్యుం..డిష్యుం
-
ఉద్యోగం ఒక చోట.. జీతం మరోచోట
ఆదోని: విద్యుత్ సంస్థ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఓ డిప్యుటేషన్ అంశం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పని ఒత్తిడి లేని చోట నుంచి పని ఒత్తిడి ఉన్న ప్రాంతానికి ఉన్నత స్థాయి అధికారులు.. సిబ్బందిని సర్దుబాటు(సర్దుబాటు) చేస్తుంటారు. అయితే ఆదోని విదుŠయ్త్ సంస్థలో మాత్రం విచిత్రం చోటుచేసుకుంది. డి–2 సె„ýక్షన్లో పని చేస్తున్న లైన్‌ఇన్‌స్పెక్టర్‌ను ఎమ్మిగనూరుకు డిప్యుటేషన్‌పై పంపిన అధికారులు ఆయన స్థానంలో పత్తికొండ లైన్ ఇన్స్పెక్టర్ను డిప్యుటేషన్ వేశారు. దీంతో పత్తికొండ మండలం లైన్ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీ అయింది. ఎమ్మిగనూరులో పని భారం ఉందనుకుంటే పత్తికొండ లైన్ఇన్సెక్టర్ను నేరుగా అక్కడికి పంపొచ్చు. కానీ ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు.. పత్తికొండ నుంచి ఆదోనికి.. ఎవరి కోసం ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లు 2018 నుంచి జీతాలు ఒక చోట తీసుకోని మరోచోట సేవలు అందిస్తున్నా రు. నిబంధనల మేరకు ఆరు నెలల దాటితే డిప్యుటేషన్‌ను ఉన్నతాధికారుల అనుమతితో పొడిగించాలి. ఈ ఇద్దరు ఉద్యోగులు నాలుగేళ్లుగా ఎలా కొనసాగుతున్నారోనని, వా రికి సహకరిస్తున్నదెవరోననే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్ల వెనుక ఏం జరిగిందో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ డివిజన్ కార్యదర్శి జయన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై డిప్యూటీ ఈఈ పురుషోత్తంను వివరణ కోరగా.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని చెప్పారు. విచారించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. -
విద్యుత్ సౌధలో టెన్షన్.. టెన్షన్..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన అంశం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏపీ సంస్థల్లో పని చేస్తున్న స్థానిక ఉద్యోగులను అక్కడి యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ చేసి, తెలంగాణ విద్యుత్ సంస్థలకు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఆయా ఉద్యోగులు సోమవారం రిలీవ్ ఆర్డర్లు తీసుకుని తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల వద్దకు చేరుకున్నారు.అప్పటికే అక్కడ భారీగా మోహరించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యుత్ సౌధ సహా మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఎన్.శివాజీ, పి.అంజయ్య, రామేశ్వర్‌శెట్టి, షరీఫ్, వి నోద్, గణేష్, రవికుమార్, వీరస్వామి, పరమేశ్, తిరుపతయ్య, అనిల్ సహా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ఆయా కార్యాలయాల ముందు బైఠాయించారు. ఏపీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయా కార్యాలయాల ప్రధాన గేట్ల ముందు పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఏపీ ఉద్యోగులు లోనికి వెళ్తే..తెలంగాణ ఉద్యోగులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించి, ఆ మేరకు అక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.కనీసం ఉద్యోగుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా వారినెలా రిలీవ్ చేస్తారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అం శంలో జస్టిస్ ధర్మాధికారి ఏపీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగే విధంగా కేటాయింపులు చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వారిని రిలీవ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. -
మరో 2 వేల విద్యుత్ కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ శాఖ త్వరలో మరో 2 వేల పోస్టులను భర్తీ చేయనుందని తెలంగాణ ట్రాన్స్‌కో తెలిపింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కలిపి మొత్తం 12,171 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేశాయని, మరో 22,637 మంది విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నాయని పేర్కొంది. కొత్త నియామకాలతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రూపంలో గత ఐదేళ్లలో మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అత్యధిక మందికి ఉద్యోగాలిచ్చిన విభాగంగా విద్యుత్ శాఖ రికార్డు సృష్టించిందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే విద్యుత్ సంస్థల ఆదాయంలో 9 శాతం ఉద్యోగుల వేతనాలకు వెచ్చిస్తున్నామని, వేతనాల చెల్లింపులో తెలంగాణ విద్యుత్ శాఖ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లో 5 నుంచి 7 శాతం వరకే జీతభత్యాలకు చెల్లిస్తున్నారని తెలిపింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగావకాశం లభించిందని ట్రాన్స్‌కో తెలిపింది. విద్యుత్ శాఖలోనే ఎక్కువ నియామకాలు జరగడం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఫలితమే. ప్రైవేటులో కాకుండా జెన్ కో ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఉత్పత్తి ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాం.ఉద్యోగ భద్రత లేకుండా, ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన 22,637 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేసుకోవాలనే మానవతా నిర్ణయం కూడా సీఎందే. వారి ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల (స్టాండింగ్ ఆర్డర్ల)ను కూడా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. పెద్ద ఎత్తున నియామకాలు జరపడమే కాకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. – ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
సాక్షి, జడ్చర్ల: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ రెండు నెలలు తిరిగా.. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 116, 117లో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల క్రితం తన తల్లి అలివేలు, తమ్ముడు రవీందర్‌రెడ్డి, పక్క పొలం రైతు గజేందర్‌రెడ్డి పేరిట డీడీ తీసి తీసి జడ్చర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇచ్చానని రైతు రాజేందర్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల నుంచి ఏఈ దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని, రూ.15 వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని రూ.12 వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం ఏఈ కార్యాలయంలో ఏఈ పర్వతాలుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు. మండలంలో నలుగురు ఉద్యోగులు రైతులకు పనులు చేసిపెట్టడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ శాఖలో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మొదట 1995లో బో యిన్‌పల్లికి చెందిన ఓ రైతు పేరిట పొలం మార్చడానికి రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్ఐ పెంటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత 1997లో ముచ్చర్లపల్లికి చెందిన రైతు శ్యాంసుందర్‌రెడ్డికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడాని కి రూ.3 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ ఇంజనీర్ అబ్దుల్‌రబ్ పట్టుబడ్డాడు. అలాగే 2013 ఏప్రిల్ 1న జకినాలపల్లికి చెందిన పోలే శంకర్‌ను ఓ కేసు విషయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ సాయిచంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా విద్యుత్ ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏడాది క్రితమే ఇక్కడికి.. విద్యుత్ ఏఈ పర్వతాలు కేఎల్ఐ కాల్వ సమీపంలో రైతుల పొలాలు లేకపోవడంతో, అదే అదునుగా చూపించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రైతుల నుంచి భారీగా లంచాలు వసూలు చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై మొదటి వారంలో బాలానగర్ నుంచి బదిలీపై ఏఈ పర్వతాలు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి న తర్వాత కేఎల్ఐ కాల్వ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రతి రైతు నుంచి డబ్బులు వసూలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈయన బాగోతం బయటపడింది. -
విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం 1157మంది ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్య ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ మాత్రం మొత్తం 10,400 మంది ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. అందరికీ ఆప్షన్లు ఇచ్చిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగుల విభజనను మరింత క్లిష్టం చేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ అరణ్‌మిశ్రా ధర్మాసనం తుది కేటాయింపులు జరిగాక దానిపై సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను కూడా పిటిషనర్లకే ఇచ్చింది. -
ఇక దేశమంతా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, ఏప్రిల్ 1 నుంచి మూడేళ్లలోపు దేశమంతటా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాలని యోచిస్తోంది. ప్రీపెయిడ్ మీటర్లతో పేదలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వాడకంతో సంబంధం లేకుండా ప్రతీ నెలా బిల్లును చెల్లించాల్సి వస్తోందన్నారు. కొత్త విధానంలో విద్యుత్ మీటర్లను మొబైల్ ఫోన్ల తరహాలో రీచార్జ్ చేయొచ్చు. దీంతో విద్యుత్ ఆదా అవుతుందనీ, సామాన్యులకు అదనపు భారం తప్పుతుందని చెప్పారు. విద్యుత్ సరఫరా నష్టాలు, బిల్లుల ఎగవేతలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే స్మార్ట్ మీటర్ల కారణంగా నైపుణ్యమున్న యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. -
కాటేస్తున్న కరెంటు
రాయచోటి రూరల్ : ఈ మధ్య కాలంలో జనాలను, విద్యుత్ వర్కర్లను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య విద్యుత్ ప్రమాదాలు. ఒక వైపు ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం, మరో వైపు జాగ్రత్తలు పాటించని ప్రజలు రెండూ కలిసి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అందుకు పెట్టింది పేరుగా రాయచోటి డివిజన్ మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 32 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని 20 మంది, 8 పశువులు ప్రాణాలు కోల్పోయారు. మరమ్మతులు చేస్తూ.. ట్రాన్స్‌కో కార్యాలయాల పరిధిలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న వర్కర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అందులో భాగంగా ఎల్సీ తీసుకుని విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. సరైన విధి విధానాలు లేకపోవడంతో పాటు కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆవేదన మాత్రమే మిగులుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మూడు రోజుల్లో ముగ్గురు మృతి రాయచోటి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఇటీవల రోజుకో ప్రమాదం చొప్పున మూడు విద్యుత్ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం గమనార్హం. సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తున్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ ప్రసాద్ ప్రమాదంలో మృతి చెందగా, ఆ మరుసటి రోజు రాయచోటి పట్టణం కొత్తపేటలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో విద్యుత్ షాక్‌కు గురైన బీటెక్ విద్యార్థి ప్రేమ్‌కుమార్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లెలో కొండమ్మ అనే మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. వరుస విద్యుత్ ప్రమాదాలు ∙2018 మే నెలలో గాలివీడు మండలం గోరాంచెరువు వద్ద విద్యుత్ క్రాంట్రాక్టు కార్మికుడు శరత్‌కుమార్ మరమ్మతు పనులు చేస్తుండా విద్యుత్ సరఫరా అయ్యి మృతి చెందాడు. ∙2018 జూలైలో చిన్నమండెం మండలం చాకిబండ వద్ద విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న లైన్మెన్ సాంబ అనుకోకుండా విద్యుత్‌సరఫరా అయ్యి షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. ∙2018 సెప్టెంబర్‌లో సంబేపల్లె మండలంలో విద్యుత్ లైన్ మీద మరమ్మతులు చేస్తున్న ప్రసాద్ అనే ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ఆపరేటర్ అనుకోకుండా విద్యుత్ సరఫరా రావడంతో షాక్‌కు గురై విద్యుత్ సంభం మీదనే మృతి చెందాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉండటం బాధాకరం. జాగ్రత్తలు పాటిస్తున్నాం వీలైనంత వరకు సబ్స్టేషన్ల పరిధిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరగడం బాధాకరం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలు విద్యుత్ వాడుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – టి.శేషాద్రి, డీఈ, రాయచోటి -
విద్యుత్ ఉద్యోగులకు సీఎం వరాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు భారీగా 35 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన వైద్య పథకాన్ని విద్యుత్ ఉద్యోగులకు అమలు చేయాలని ఆదేశించారు. 6 వేల మందిని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై సానుకూలంగా స్పందించారు. న్యాయ స్థానాల్లో కేసులను ఉపసంహరించుకుంటే 600 మంది జేఎల్‌ఎంలను వెంటనే క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో శనివారం ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై చర్చించిన అనంతరం అక్కడే సభలో ఉద్యోగులపై కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. ఊహించని రీతిలో భారీ ఫిట్‌మెంట్‌ను సీఎం ప్రకటించడంతో విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరతాళధ్వనులతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఒక్కో మెట్టు ఎక్కుతూ 22, 24, 25 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, చివరకు 27 శాతానికి చేద్దామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించారన్నారు. ఉద్యోగ సంఘం నేత ప్రకాశ్ సైతం 32 శాతం అడిగారని, అయితే ఉద్యోగులు అసంతృప్తికి గురికాకుండా 35 శాతం ఇవ్వాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త సబ్ స్టేషన్లకు ఉద్యోగులను నియమించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నట్లు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు అంశంపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులతో పోలిక వద్దు.. ‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్లు ఎట్ట ఉంటరో చూస్తం.. ఎలా బతుకుతరో చూద్దాం.. అని దేశమంతా చూస్తున్న తరుణంలో తొలి విజయాన్ని సాధించి పెట్టింది విద్యుత్ శాఖనే. అందుకు మీకు మంచి జీతాలు రావాలి. విద్యుత్ శాఖకు ఆదాయం ఉంది. ఇతర శాఖల్లో ఉద్యోగుల మీద ఉన్న ఖర్చు ఇక్కడ లేదు. కరెంటోళ్లకు ఇచ్చే జీతం మాకూ ఇవ్వాలని ఇతర శాఖల వాళ్లు అడిగారు. కరెంటోళ్లు బాగా సంపాదిస్తున్నరు. మీరు(ఇతర శాఖలు) అంత సంపాదిస్తలేరు. మీరు వారితో పోల్చుకోకూడదని వారికి చెప్పిన’’అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం విద్యుత్ ఉద్యోగులు ఇంకా బాగా పని చేయాలని కోరారు. ఏ మూలకైనా విద్యుత్ అమ్మే పరిస్థితి రావాలన్నారు. గతేడాది జూరాల జల విద్యుత్ విక్రయాలతో రూ.250 కోట్ల ఆదాయం వచ్చిందని, గత రెండు నెలల్లో రూ..100 కోట్లను విద్యుత్ సంస్థలు సంపాదించాయన్నారు. అపరిమిత వైద్య సదుపాయం... విద్యుత్ ఉద్యోగుల కోసం అత్యుత్తమ వైద్య పథకానికి రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జీవితంలో ఒకసారి రూ.3 లక్షల వైద్య సదుపాయం పొందితే మళ్లీ ఇవ్వం అనే ప్రస్తుత పథకం బాగాలేదన్నారు. మళ్లీ జబ్బు వస్తే ఎలా? రోగం చెప్పి వస్తదా? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు వచ్చినా ఇచ్చేటట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా సీఎం ఓ పిట్టకథను వినిపించారు. రాజుల కాలంలో ఓ ఊరిలో పెద్ద ఎత్తున కలరా వచ్చిందని, వైద్యులు ఏం చేసినా నయం కాలేదన్నారు. దీంతో రాజుగారు పెద్ద భూత వైద్యుడికి కబురు పంపారని, ఆయన ఊరికి వస్తుంటే అదే దారిలో కలరా గత్తర వెళ్తూ కనిపించిందన్నారు. 150 మందిని చంపినవా? అని భూత వైద్యుడు అడిగితే.. లేదు నేను 5 మందినే చంపినా.. మిగిలిన వారంతా భయంతోనే మృతిచెందారని గత్తర చెప్పిందని పేర్కొన్నారు. ఏం లేనోడికి భయంతో బీమారీలొస్తాయని, ఏమైనా అయితే చూసేటోళ్లు ఉన్నరని భావించే వారు ఆరోగ్యంగా ఉంటరని చెప్పారు. శ్రమ దోపిడి సరికాదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడి సరికాదని సీఎం పేర్కొన్నారు. విద్యుత్ బిల్ కలెక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా, చంద్రబాబు పెట్టి పోయిన దుకాణం ఇది అని మండిపడ్డారు. ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించామని, బిల్ కలెక్టర్ల సమస్యలను సైతం సానుభూతితో పరిశీలిస్తామన్నారు. ఆర్థిక వృద్ధిలో మనకు సాటి లేరు.. ‘‘రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్ని శాపాలు. ఎన్ని దీవెనలు. వీళ్లతో అయితదా అని ఒకడు. కాదని ఇంకొకడు. మొత్తం చీకటి అయితదని మరొకడు. రకరకాలుగా మాట్లాడిండ్రు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా గత 4 ఏళ్లలో తెలంగాణ 17.17 శాతం ఆర్థిక వృద్ధి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 నెలల లెక్క తీసి చూస్తే 17.83 శాతం వృద్ధి నమోదైంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ ఉద్యోగులే. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఎన్ని బాధలు.. ఎన్ని కథలు.. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. కరిగిపోయే కండక్టర్లు.. యాద్ చేసుకుంటే ఇప్పుడు రామాయనమంత కథ. ఆ బాధలన్నీ ఆరు నెలల్లో మాయం చేసి రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇవాళ తెలంగాణ. దీనికి ప్రధాన కారకులు మీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రఘుమారెడ్డి, డైరెక్టర్లు, వాళ్లకు హన్మంతుడిలా పనిచేసే కార్మికులు. మీరంతా కలిస్తేనే ఈ ఫలితం. నేను కూడా మీ వెంబడి ఉన్న. ఆయింత నన్ను పక్కకు చేసేరు సుమ. కింద మీద పడి అందరం ఒక దరికి వచ్చినం’’అని సీఎం విద్యుత్ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఎత్తిపోతల పథకాలు కడుతున్నామని, ఎంతైన కరెంట్ ఇస్తారన్న ధీమాతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. లిఫ్టులు వస్తే రాష్ట్రంలో ఆనందమే ఆదనందం ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి లిఫ్టులను పూర్తి చేసి 1,000 చెరువులు నింపుకుంటూ 9 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు ఇచ్చామన్నారు. కొత్తకోట, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట ప్రాంతాలను నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ప్రజలు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. మా ఊర్లో 670 కార్డులున్నయి.. హైదరాబాద్ కార్డులను సరెండర్ చేస్తం.. ఇక్కడే రేషన్ ఇవ్వండి అని అక్కడి తహశీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నారన్నారు. రాబోయే ఎత్తిపోతల పథకాలకు కార్మిక, విద్యుత్ శాఖలే పెద్ద భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రమ, విద్యుత్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు యూనిట్ల బిల్లు రూ.10వేలు
బలిజిపేట: విద్యుత్ శాఖ సిబ్బంది ఓ రిక్షా కార్మికుని ఇంటికి ఇచ్చిన విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.పది వేలు. దీన్ని చూసిన ఆ కార్మికుడు నిజంగానే షాక్‌కు గురయ్యాడు. బిల్లులో వాడిన యూనిట్లు రెండుగా చూపి..బిల్లు మాత్రం రూ.పది వేలుగా చూపడంతో ఆ ఇంటి యజమాని కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే...పలగర గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు నులక పెంటయ్య ఇంటికి ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ బిల్లు రూ.10,357లు వచ్చింది. దీంతో యజమాని అవాక్కయ్యాడు. పెంటయ్య పలగర ఎస్సీ కాలనీలో నివాసముంటున్నాడు. ఆ రిక్షా కార్మికుని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉన్నాయి. రిక్షా కార్మికుడు కావడంతో ఉదయం సాయంత్రం వరకు రిక్షాతో పాటు ఆయన బయటే ఉంటారు. ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యులు కూడా వలసపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. పెంటయ్య సర్వీసు నంబరు 354 కాగా వచ్చిన బిల్లు రూ.పది వేలు దాటిపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఆ బిల్లులో పూర్వపు రీడింగ్ 1669 ఉండగా ప్రస్తుత రీడింగ్ 1671 ఉంది. అంటే కేవలం రెండు యూనిట్లు మాత్రమే వినియోగించినట్టు లెక్క తేల్చారు. కానీ బిల్లు మాత్రం గూబ గుయ్యమనిపించారు. పెంటయ్యకు ఏం చేయాలో తెలియక సంబంధిత శాఖాధికారులను సంప్రదించగా అదంతే...అన్నట్టుగా సమాధానం చెప్పి పంపారు. -
సొంత రాష్ట్రానికే వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవైన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ వివాదంపై హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవైన ఉద్యోగుల నుంచి గత నెలలో ఆప్షన్లు స్వీకరించగా, 55.12 శాతం మంది ఏపీకి, తెలంగాణకు 44.87 శాతం మంది ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియకు ఏపీ విద్యుత్ సంస్థలు సహకరించడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టి స్థానికత ఆధారంగా 2015 జూన్ 11న 1,252 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేశాయి. తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోకపోవడం, రిలీవైన ఉద్యోగులు హైకోర్టులో కేసు వేయడంతో దాదాపు రెండున్నరేళ్లుగా ఈ వివాదం అపరిష్కృతంగా ఉండిపోయింది. గత నెల 3న హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ ఉద్యోగుల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి ఆ సమాచారాన్ని ఏపీ విద్యుత్ సంస్థలతో పంచుకున్నాయి. రిలీవైన ఉద్యోగుల్లో 619 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. మరో నలుగురు తమ విషయంలో నిర్ణయాన్ని విద్యుత్ సంస్థల యాజమాన్యాలకే వదిలేశారు. మరో 23 మంది రిటైర్డు కావడం, మరణించగా, మిగిలిన వారు ఆప్షన్లు ఇవ్వలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఆప్షన్లు ఇచ్చిన వారిలో అధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీలో పనిచేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసుపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణలో ఇరు రాష్ట్రాలు ఆప్షన్లు కేటాయించిన ఉద్యోగుల విషయంలో తమ అభిప్రాయాలను తెలపనున్నాయి. ఎస్పీడీసీఎల్‌కే ఏపీ ఉద్యోగుల మొగ్గు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది విద్యుత్ ఉద్యోగులు రిలీవై ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ చెందని వారిగా డోలాయమానంలో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రతినెలా వీరికి రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ వారిని విధుల్లో చేర్చుకోకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. వీరినుంచి ఏ పని తీసుకోకుండానే గత రెండున్నరేళ్లలో ఏకంగా రూ.300 కోట్ల జీతాలు చెల్లించింది. అయినా, వారితో పని చేయించుకునేందుకు ఇష్టపడడం లేదు. రిలీవ్ చేసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబును కలవడం, హైకోర్టులో కేసులు వేసి తొందరపడ్డారని రిలీవైన ఉద్యోగుల తీరు పట్ల తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం. దీనితో సంబంధాలు దెబ్బతిన్నాయి, రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకున్నా ఇక్కడి ఉద్యోగులతో సఖ్యతతో పనిచేసే అవకాశం లేదని తెలంగాణ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మంది ఉద్యోగులు ఏపీకి ఆప్షన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 65.5 శాతం తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 83.9 శాతం మంది ఏపీకి ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్లో పని చేసేందుకే అధిక శాతం రిలీవైన ఉద్యోగులు మొగ్గు చూపారు. -
రోడ్ల తవ్వకాలపై నిషేధం
- ఆర్నెల్ల వరకు తవ్వకాలకు బ్రేక్ - ప్రైవేటుతో పాటు ప్రభుత్వ సంస్థలకూ వర్తింపు - ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఆర్నెల్లపాటు ఏ అవసరం కోసమైనా సరే రోడ్ల తవ్వకాలకు అనుమతించేది లేదని జీహెచ్ఎంసీతోపాటు ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్నెల్ల వరకు రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించింది. ఇప్పటికే తవ్వకాలు జరిగి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పనుల్ని వేగిరం పూర్తిచేయాల్సిందిగా ఆయా విభాగాలను ఆదేశించింది. రోడ్ల విస్తరణ తదితర కారణాల వల్ల రోడ్లపై పడి ఉన్న విద్యుత్‌స్తంభాలు, వైర్లను వెంటనే తొలగించాల్సిందిగా విద్యుత్ శాఖను ఈ సమావేశం కోరింది. ఆయా విభాగాలు తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించి, వాటికి సంబంధించి చేసిన వ్యయాన్ని సంబంధిత శాఖలకు పంపాలని నిర్ణయించింది. శనివారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరిగిన సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, టీఎస్ఎస్ సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ నవీన్‌చంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం వివరాలను జనార్దన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత వర్షాకాల సీజన్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పనులు పూర్తయిన మెట్రో కారిడార్లలో ఫుట్‌పాత్‌లు, మీడియన్లను వెంటనే పునరుద్ధరించాలని నిర్ణయించారు. విధిగా బోర్డుల ప్రదర్శన మౌలిక సదుపాయాల కోసం చేపట్టే తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్ల నిర్మాణం, రోడ్ల తవ్వకాలు, మరమ్మతులు తదితర ఏ పనులు చేసినా నిర్మాణం జరుగుతున్న పనులు.. ఎప్పుడు ప్రారంభించేది.. ఎప్పుడు పూర్తయ్యేది.. కాంట్రాక్టు సంస్థ ఏది.. తదితర వివరాలను సూచించే బోర్డులు విధిగా ఏర్పాటు చేయాలని కూడా సమన్వయ సమావేశం నిర్ణయించింది. పనులు చేపట్టేందుకు ముందుగానే ఆ సమాచారం ప్రజలకు తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వస్థలాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌లు వీలైనన్ని మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి.. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఐటీ విభాగాల ద్వారా టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల జాబితాను వెంటనే అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు. ఈ నెల 11న జరిగే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని జనార్దన్‌రెడ్డి కోరారు. శివార్లలో 2,700 కి.మీ. మేర పైప్లైన్ల ఏర్పాటు జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో రానున్న రెండేళ్లలో 2వేల కోట్ల రూపాయల హడ్కో నిధులతో మెరుగైన మంచినీటి సరఫరా పనులు జరగనున్నాయి. ఈ నిధులతో దాదాపు 2,700 కి.మీ.ల మేర పైప్లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు ముందుగానే వివిధ శాఖలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా జలమండలిని కోరామన్నారు. మంచినీటి సరఫరా పైప్లైన్ల నిర్మాణం పూర్తయ్యాక, అన్ని విభాగాలకు సంబంధించిన వివిధ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగవని చెప్పారు. తద్వారా రోడ్డు వేయడం.. పైప్‌లైన్ కోసం తిరిగి తవ్వడం.. మళ్లీ రోడ్డు వేయడం వంటి సమస్యల్ని అధిగమించవచ్చునన్నారు.