సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్సీపై ఇరువైపుల నుంచి ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్ సంఘాల జేఏసీ.
ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదించాయి. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో.. డిస్కంల సీఎండీలోతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. అలాగే..
పీఆర్సీపై ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ఓకే తెలిపింది. 8 శాతం ఫిట్‌మెంట్‌కు సైతం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘‘విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌తో చర్చించాం. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు’’ అని చర్చలకు ముందర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment