సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని ‘ఆర్టిజన్లు’ మంగళవారం ఉదయం 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 23 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గతంలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ల పేరుతో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెబాటపట్టాలని.. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్82), ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్‌లు పిలుపునిచ్చాయి. కాగా, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, ఎవరైనా సమ్మెకు దిగినా, విధులకు గైర్హాజరైనా అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేశాయి.
దీంతో సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలి.. రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను, ఆర్టిజన్ల కోసం ‘స్టాండింగ్ ఆర్డర్స్’ పేరుతో ప్రత్యేక సర్వీస్ రూల్స్‌ను అమలుచేస్తున్నారు. అయితే, తమకూ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేయాలని ఆర్టిజన్లు డిమా ండ్ చేస్తున్నారు. అలాగే, 7% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న విద్యుత్ ఉద్యోగ సంఘాల ఉభయ జేఏసీలతో సంస్థల యాజమాన్యాలు వేతన సవరణ ఒ ప్పందం కుదుర్చుకోగా, దీన్ని ‘ఆర్టిజన్ల’ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ పోస్టులకు తీసు కుని పదోన్నతి కల్పించాలని, 50% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని, కనీసం రూ.25 వేలకు తగ్గకుండా మాస్టర్ స్కేల్‌ను ఖరారు చేయాలని ఈ సంఘాలు సమ్మె నోటీసుల్లో కోరాయి.
నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రభావం ! నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపులో ఆర్టిజన్ల సేవలు కీలకం. ఎక్కడ చిన్న అంతరాయం కలిగినా రంగంలో దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తా రు. మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో వీరి సంఖ్యే అధికం. దీంతో ఆర్టిజన్లు పాక్షికంగా సమ్మెకి దిగి నా నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు విద్యుత్ సంస్థల్లో ఎస్మా కింద సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు పిలుపునిచ్చిన సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 15న అన్ని ఉద్యోగ సంఘాలతో పాటే ఆర్టిజన్లకు కూడా సహేతుకమైన వేతన సవరణ చేశామన్నారు. కాగా, ఆర్టిజన్ల సమ్మెతో తమకు సంబంధం లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, టీఈఈ 1104 యూనియన్, టీఎస్‌పీఈయూ–1535, బీఆర్‌వీకేఎస్, టీఎస్‌ఈఈయూ–327 యూనియన్లు ప్రకటించాయి.
(చదవండి: నేటి నుంచి బడులకు వేసవి సెలవులు)
Comments
Please login to add a commentAdd a comment