సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం, మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌తో చర్చించాం. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తాం. డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతాం’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏదో జరిగిపోతున్నట్టు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారు: మంత్రి అంబటి
Comments
Please login to add a commentAdd a comment