వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరనుందని అంచనాలున్న నేపథ్యంలో విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్–11 కింద దేశంలో విద్యుత్ అత్యయిక పరిస్థితిని సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసి పవర్ ఎక్సే్ఛంజీలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
- విద్యుత్ చట్టంలోని సెక్షన్ 11 కింద ప్రకటించిన కేంద్రం
- ఏప్రిల్‌లో దేశ విద్యుత్ డిమాండ్ 249 గిగావాట్లకు పెరగనుందని అంచనా
వచ్చే ఏప్రిల్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి 249 గిగావాట్స్‌కి చేరనుందని అంచనాలున్నాయని, ఈ మేరకు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిరంతరం ఉత్పత్తి కొనసాగించాలని కోరింది. అసాధారణ పరిస్థితుల్లో సెక్షన్–11ను ప్రయోగించి తమ సూచనల మేరకు విద్యుదుత్పత్తి జరపాలని విద్యుత్ కేంద్రాలను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. గతేడాది వేసవిలో సైతం కేంద్రం సెక్షన్–11ను ప్రయోగించి దిగుమతి చేసిన బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment