సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) కాస్త ఊరట కలిగించింది. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ అమ్మకం ధరల సీలింగ్‌ను మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఆర్‌సీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌లో హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ ధరలు యూనిట్‌కు రూ.50 నుంచి రూ.30కు తగ్గాయి. సాధారణ సమయాలకు సంబంధించి యూనిట్ ధర రూ.12 నుంచి రూ.10కు తగ్గింది. అప్పట్లో అంతా వాళ్లిష్టమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ రోజువారీ అవస రాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేవు.
కొన్ని రాష్ట్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. అయి తే అది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. కానీ ఇతర సమయా ల్లో నూ ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లించాల్సి రావడంతో డిస్కంలు ఆర్థికంగా బాగా నష్టపోతుండేవి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పీపీఏలకు బదులు షార్ట్ టర్మ్ పీపీఏలు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ ఒప్పందాల వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. 2021 వరకు బహిరంగ మార్కెట్‌లో ని ధరలు విద్యుత్ ఉత్పత్తిదారుల ఇష్టానుసారం ఉండేవి. అదే ఏడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడటం.. ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ కొరత ఏర్పడింది.
ఆ సమయంలో మార్కెట్‌లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఉత్పత్తి సంస్థలు భారీ ధరలు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఆర్‌సీ గతేడాది మార్చి 5న సీలింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇవీ కొత్త ధరలు సీఈఆర్‌సీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి యూనిట్ ధరను రూ.50 నుంచి రూ.20కు తగ్గించింది. అలాగే ఏడాదిగా అమలులో ఉన్న సాధా రణ సమయాల్లో సీలింగ్ ధరను రూ.12 నుంచి రూ.10కు మార్చింది. పవర్ మార్కెట్ రెగ్యులేషన్స్–2021 ప్రకారం రిజిస్టర్ అయిన అన్ని పవర్ ఎక్సే్చంజ్‌లలో ఏప్రిల్ 4 నుంచి ఈ సవరించిన ధరలతోనే విద్యుత్ ట్రేడింగ్ జరగాలని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న గ్యాస్, బొగ్గు అధిక ధరను పరిగణనలోకి తీసుకుని గతంలో సీలింగ్ పెంచామని.. ఇప్పుడు వాటి ధరలు తగ్గడంతో సీలింగ్ కూడా తగ్గించామని కమిషన్ తెలిపింది.
ఇప్పుడు కొనేవాళ్లు కరువై.. సీఈఆర్‌సీ సీలింగ్ ప్రకారం యూనిట్ విద్యుత్‌ను రూ.12కు మించి అమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఆ రేటుకు, లేదా అంతకంటే తక్కువకే డిస్కంలకు విద్యుత్ లభించేది. ఈ విధానం బాగున్నప్పటికీ కొందరు ప్రైవేటు జెన్‌కోల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగినందున విద్యుత్ అమ్మకం ధర సీలింగ్ పెంచాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్ ధరను రూ.50 గా సీఈఆర్‌సీ సీలింగ్ ప్రకటించింది. దీనిపై డిస్కంలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వేసవిలో అత్యధిక విద్యుత్ అవసరం అవుతున్నందున అంత ఎక్కువ రేటుకు కొనడం ఆర్థికంగా ఇబ్బంది అని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. మరోవైపు ధరలు పెంచినప్పటి నుంచి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో సీఈఆర్‌సీ ధరలను భారీగా తగ్గించింది.
(చదవండి: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది)
Comments
Please login to add a commentAdd a comment