Distrubution
-
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
-
డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) కాస్త ఊరట కలిగించింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ అమ్మకం ధరల సీలింగ్‌ను మారుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఆర్సీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో హై ప్రైస్ డే ఎహెడ్ మార్కెట్ ధరలు యూనిట్‌కు రూ.50 నుంచి రూ.30కు తగ్గాయి. సాధారణ సమయాలకు సంబంధించి యూనిట్ ధర రూ.12 నుంచి రూ.10కు తగ్గింది. అప్పట్లో అంతా వాళ్లిష్టమే.. దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ రోజువారీ అవస రాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేవు. కొన్ని రాష్ట్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. అయి తే అది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. కానీ ఇతర సమయా ల్లో నూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి రావడంతో డిస్కంలు ఆర్థికంగా బాగా నష్టపోతుండేవి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పీపీఏలకు బదులు షార్ట్ టర్మ్ పీపీఏలు చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ ఒప్పందాల వల్ల కూడా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. 2021 వరకు బహిరంగ మార్కెట్లో ని ధరలు విద్యుత్ ఉత్పత్తిదారుల ఇష్టానుసారం ఉండేవి. అదే ఏడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడటం.. ఉత్పత్తిని తగ్గించడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో మార్కెట్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా ఉత్పత్తి సంస్థలు భారీ ధరలు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఈఆర్సీ గతేడాది మార్చి 5న సీలింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇవీ కొత్త ధరలు సీఈఆర్సీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి యూనిట్ ధరను రూ.50 నుంచి రూ.20కు తగ్గించింది. అలాగే ఏడాదిగా అమలులో ఉన్న సాధా రణ సమయాల్లో సీలింగ్ ధరను రూ.12 నుంచి రూ.10కు మార్చింది. పవర్ మార్కెట్ రెగ్యులేషన్స్–2021 ప్రకారం రిజిస్టర్ అయిన అన్ని పవర్ ఎక్సే్చంజ్‌లలో ఏప్రిల్ 4 నుంచి ఈ సవరించిన ధరలతోనే విద్యుత్ ట్రేడింగ్ జరగాలని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న గ్యాస్, బొగ్గు అధిక ధరను పరిగణనలోకి తీసుకుని గతంలో సీలింగ్ పెంచామని.. ఇప్పుడు వాటి ధరలు తగ్గడంతో సీలింగ్ కూడా తగ్గించామని కమిషన్ తెలిపింది. ఇప్పుడు కొనేవాళ్లు కరువై.. సీఈఆర్సీ సీలింగ్ ప్రకారం యూనిట్ విద్యుత్‌ను రూ.12కు మించి అమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఆ రేటుకు, లేదా అంతకంటే తక్కువకే డిస్కంలకు విద్యుత్ లభించేది. ఈ విధానం బాగున్నప్పటికీ కొందరు ప్రైవేటు జెన్కోల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగినందున విద్యుత్ అమ్మకం ధర సీలింగ్ పెంచాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్ ధరను రూ.50 గా సీఈఆర్సీ సీలింగ్ ప్రకటించింది. దీనిపై డిస్కంలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వేసవిలో అత్యధిక విద్యుత్ అవసరం అవుతున్నందున అంత ఎక్కువ రేటుకు కొనడం ఆర్థికంగా ఇబ్బంది అని కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. మరోవైపు ధరలు పెంచినప్పటి నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో సీఈఆర్సీ ధరలను భారీగా తగ్గించింది. (చదవండి: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది) -
ఏపీలో పింఛన్ల పండుగ.. తెల్లవారుజాము నుంచే పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,754.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 63,66,280 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతి వృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. (చదవండి: ఆన్లైన్లో నోటరీల సమాచారం) -
కాలుతూ.. పేలుతూ..
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపానికి తోడు.. హెచ్చు తగ్గులను నియంత్రించే వ్యవస్థ సరిగా లేకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) తరచూ కాలిపోతున్నాయి. ఫలితంగా గ్రేటర్ జిల్లాల పరిధి లోని తొమ్మిది సర్కిళ్లలో 2020– 21లో 1,597 డీటీఆర్లు కాలిపోగా, 2021– 22లో 2,035 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు డిస్కం పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో తలెత్తిన నిర్వహాణ లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్వహణ లోపంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా రూ.100 కోట్లకుపైగా.. విద్యుత్ లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లూజు లైన్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలను గుర్తించి, వాటిని నియంత్రించడంæ, దెబ్బతిన్న ఫ్యూజ్ బాక్స్‌ల పునరుద్ధరించడం, విద్యుత్ సరఫరాలో తలెత్తే హెచ్చు తగ్గుల నియంత్రణ కోసం ఫీడర్, డీటీఆర్‌ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ సిస్ట్ం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. బినామీ కాంట్రాక్టర్లుగా ఇంజినీర్లు.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈలు, డీఈలు ఎప్పటికపుడు లైన్ టు లైన్ తనిఖీ చేసి, లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దాలి. వీరెవరూ ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ఇంజినీర్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. లైన్ల నిర్వహణ చేజిక్కించుకుంటున్నారు. లైన్ల పునరుద్ధరణ పనులు చేసినట్లు బిల్లులు గుట్టుగా డ్రా చేస్తున్నారు. రాజేంద్రనగర్, సైబర్‌సిటీ, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్లలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలిపోయిన డీటీఆర్‌లకు డిస్కం రిపేర్లు నిర్వహించాల్సి ఉంది. రవాణా చార్జీలు సహా రిపేరు ఖర్చులను కూడా డిస్కమే భరించాల్సి ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వినియోగదారులే ఈ భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది. ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది.. ప్రస్తుతం నగరంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం కూడా ప్రారంభమైంది. ఫలితంగా విద్యుత్ వినిÄయోగం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో రోజు సగటు విద్యుత్ వినియోగం 87.1 మిలియన్ యూనిట్‌గా నమోదైంది. ఈ నెలారంభంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,500 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 2,794 మెగావాట్లకు చేరుకుంది. ఈ నెల చివరి నాటికి 3,000 మెగావాట్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా. (చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు!) -
డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేద ప్రజలకు శుభవార్త. డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ సోమవారం పంపిణీ చేయనున్నారు. జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి ఈరోజు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట!) తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
ఓటర్లకు ‘కూల్’ గాలం
సాక్షి, కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో శనివారం ఎయిర్ కూలర్లను నిల్వ చేయడం వివాదస్పదంగా మారింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు కూలర్లను లారీలో తీసుకొచ్చాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో అధికారులు విచారణ జరిపారు. ఇరుకుల్ల గ్రామంలో శనివారం మధ్యాహ్నం లారీలో వచ్చిన 160 ఎయిర్ కూలర్లను స్ధానికంగా ఉన్న రైసుమిల్లు గోదాంలో నిల్వ చేశారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చారనే అనుమానంతో గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆందోళకు దిగారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై శ్రీనివాస్‌రావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. వేసవికాలంలో కూలర్లను విక్రయించేందుకు వీలుగా ఇక్కడికి స్టాక్ తీసుకొచ్చినట్లు కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను చూపించడంతో ఎస్సై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానంటూ వెళ్లిపోయారు. అయితే ఉపసర్పంచు పదవికోసం వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ నాయకుడు ఓటర్లకు పంపిణీ చేసేందుకు కూలర్లను తీసుకొచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
తగు చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1న పాడి గేదెల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో పశుసంవర్థకశాఖ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ డెయిరీ, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ చైర్మన్లు శ్రీనివాసరావు, గుత్తా జితేందర్‌రెడ్డి, రాజేశ్వరరావులతో పాడిగేదెల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష జరిపారు. కలెక్టర్ల ఖాతాలకు ఈ పథకం నిధులు నేడో రేపో జమచేస్తామని మంత్రి తెలిపారు. డెయిరీలు వారి సభ్యుల ఆధ్వర్యంలో గేదెలు కొనుగోలు చేయడానికి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుడు కోరుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న గేదెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని, గేదె ఆరోగ్య పరిస్థితిని వైద్యుడు పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇస్తారన్నారు. యూనిట్ కాస్ట్ రూ.80 వేలుగా నిర్ణ యించామని, ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ, బీసీ లకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. దీనిపై డెయిరీల ప్రతినిధులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయ బ్రాండ్‌కు ప్రచారం కల్పించండి విజయ డెయిరీ బ్రాండ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, దీని కోసం భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. విజయ డెయిరీని ప్రైవేటు సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలోని తన చాంబర్లో సందీప్‌కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ చైర్మన్లతో దీనిపై మంత్రి సమావేశం నిర్వహించారు. -
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
-
స్త్రీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో మహిళల పురోగతికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం.. సబ్సిడీ స్కూటర్ల పథకం ప్రారంభించాక మోదీ మాట్లాడారు. కుటుంబంలో ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబానికి సాధికారత లభిస్తుందని అన్నారు. జయలలిత ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని అన్నారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..‘తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు, వారసత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. జయకు నివాళులర్పిస్తూ ఆమెను ‘సెల్వి జయలలిత జీ’ అని సంబోధించారు. ‘మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టిసారిస్తూ అన్ని పథకాల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా సంక్షేమానికి కట్టుబడి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ముద్ర యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాం’ అని మోదీ పేర్కొన్నారు. డామన్ డయ్యూకు రూ. వేయి కోట్ల పథకాలు... కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలో రూ. వేయి కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్–డయ్యూ పట్టణాల మధ్య విమాన సేవలను ఆరంభించారు.మోదీ ప్రారంభించిన పథకాల్లో నీటి శుద్ధి ప్లాంట్, గ్యాస్ పైపులైన్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, మునిసిపల్ మార్కెట్, పాదచారుల వంతెన తదితరాలున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా నిర్మించిన అంగన్వాడీ పాఠశాల భవనాలను కూడా మోదీ ఆరంభించారు. లబ్ధిదారుకు వాహనం ‘కీ’ అందజేస్తున్న మోదీ -
రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ
ఆత్మకూర్ : దివంగత ఏబీవీపీ రాష్ట్ర నాయకులు నరేష్కుమార్, రంజిత్‌కుమార్ రెండో వర్ధంతిని పురస్కరించుకొని ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. శనివారం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. నరేష్కుమార్, రంజిత్‌కుమార్ విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తు రోడ్డు ప్రమాదంలో మతిచెందడం విద్యార్థిలోకానికి తీరని లోటని బీజేపీ జిల్లా నాయకుడు మేర్వరాజు, మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వారిసేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎన్ఆర్ యువసేన నాయకులు నరసింహ, దివాకర్, ఖాదర్, పరషురాం, చిరంజీవి, రామకష్ణ, రమేష్, వెంకటేష్, శేఖర్, అరుణ్, సంతోష్, శ్యాం, కిషోర్, రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.