సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేద ప్రజలకు శుభవార్త. డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ సోమవారం పంపిణీ చేయనున్నారు. జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్‌లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి ఈరోజు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట!)
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment