Mentally Unstable Man Climbs High-Power Transmission Tower in Bihar - Sakshi
Sakshi News home page

హై పవర్‌ ట్రాన్స్‌మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్‌ కావాలంటూ..

Published Thu, Dec 23 2021 5:44 PM | Last Updated on Thu, Dec 23 2021 8:21 PM

Mentally Unstable Man Climbs A Top Electricity Tower At Bihar - Sakshi

Mentally unstable man climbs electricity tower: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసే పనులు చాలా భయానకంగానూ, ఒక్కొసారి వికృతంగా కూడా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి స్వీట్లు, మొబైల్‌ ఫోన్‌ కావలంటూ ఏకంగా విద్యుత్‌ టవర్‌ పైకి ఎక్కేశాడు.

(చదవండి: ఏకంగా పామునే హెయిర్‌ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్‌ వీడియో)

అసలు విషయంలోకెళ్లితే.....బీహార్‌లో ముజఫర్‌పూర్ జిల్లాలోని బర్మత్‌పూర్ గ్రామంలో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హై ట్రాన్స్‌మిషన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పైగా వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని కోరడం ఆశ్చర్యంగా కల్గించింది. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు.

అంతేకాదు ఆ వ్యక్తి హై పవర్‌ ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్‌లో కూర్చొని అంత ఎత్తు నుంచి కింద పడిపోతానేమో అనే భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా టవర్‌ ఎక్కాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎప్‌)ని పిలిపించారు. అయితే స్థానికులు మాత్రం ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశాడని చెబుతున్నారు. అయితే అతన్ని కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి.

(చదవండి: ఫోన్‌ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement