
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment