డామినోస్ పిజ్జా ఆపరేటర్కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే.