మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్‌ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్‌ల నిర్మాణం చేస్తున్న ఏఎస్‌బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు.
శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్‌ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు.
అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి..
పుప్పాలగూడ ఎస్‌బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment