గుత్తి : ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. వేకువజాము నుంచే అమ్మవారికి పలు పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో జకినీ మాత, మల్కూమ జకినీ మాత విగ్రహాలకు గంగాస్నానం చేయించారు. అనంతరం ఎరుపు దుస్తులు ధరించిన 108 మంది కన్యలు, ముత్తైదువులు పూర్ణ కుంభాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారి విగ్రహాలను జకినీ మాత ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం పది, ఇంటర్, డిగ్రీల్లో ప్రతిభ కనబరిచిన ఆరె కటికల పిల్లలకు బహుమతులు అందజేశారు.