అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. సాయినాథ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999 నుంచి 2004 వరకూ సాయినాథ్ గుత్తి ఎమ్మెల్యేగా పని చేశారు.
దీంతో తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నాయకుడ్ని కోల్పోవడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.జిల్లాలో సౌమ్యుడిగా పేరున్న సాయినాథ్ బౌతికంగా దూరం అవడం టీడీపీకీ నిజంగానే తీరని లోటు.