
అరుణాచల్ రిజిస్ట్రేషన్ బస్సులు సీజ్
గుత్తి రూరల్: పట్టణ శివార్లలోని టోల్‌గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను శనివారం వేకువజామున రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండి అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న ఆరెంజ్, యెల్లో ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సీజ్ చేసి గుత్తి ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సుల యజమానులపై కేసులు నమోదు చేసి, కోర్టుకు పరుస్తామని అధికారులు తెలిపారు.