గుత్తి : పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో పెద్దన్న అనే వ్యక్తికి చెందిన రూ.24 వేలు నగదు మంగళవారం అపహరణకు గురైంది. మండలంలోని పెద్దొడ్డి గ్రామానికి చెందిన పెద్దన్న తన కుమారుడు ఆదిని వెంట పెట్టుకుని ఎస్‌బీఐకి వెళ్లాడు. తన కుమారుడి ఖాతా నుంచి రూ.24 వేలు డ్రా చేయించాడు. ఆ డబ్బును పెద్దన్న తన జేబులో పెట్టుకున్నాడు. బ్యాంకు బయటకు వస్తున్న సమయంలో జేబును చూసుకున్నాడు. బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న రూ. 24వేలు (12 రెండు వేల నోట్లు) కనిపించలేదు.
దీంతో వెంటనే బ్యాంకు మేనేజర్‌ను కలిసి డబ్బు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో మేనేజర్ సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజీలో డబ్బు అపహరించిన వ్యక్తి స్పష్టంగా కనిపించలేదు. కాగా బాధితుడు పెద్దన్న మాట్లాడుతూ తాను డ్రా చేసినప్పుడు తన పక్కనే గుత్తికి చెందిన మాణిక్యం, మహేష్‌లతో పాటు మరో ఇద్దరు ఉన్నారన్నారు. వారే డబ్బు అపహరించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
ఎస్‌బీఐలో రూ.24 వేలు నగదు అపహరణ
Published Tue, Nov 29 2016 10:32 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
Advertisement
Advertisement