గుత్తి రూరల్ : కురుబలు అన్ని రంగాల్లో రాణించి తమ సత్తా చాటాలని కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం కురుబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస 529 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్యక్షతన కనకదాస చిత్రపటాన్ని పట్టణంలో ఊరేగించారు. బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నాగేంద్ర మాట్లాడారు.
కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే గొర్రెల మేకల ఫెడరేషన్‌కు అధిక నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కెపీఎస్ ధియేటర్ ఎదురుగా కనకదాస విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కురుబ సంఘం నాయకులు లింగన్న, ఎంపీటీసీ శంకర్, మహాలింగ, కోశాధికారి కుళ్లాయి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రంగయ్య, తిరుపాలు, నాగేశ్వరరావు, శేఖర్, సుధాకర్, నారాయణస్వామి పాల్గొన్నారు.
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
Published Wed, Nov 30 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
Advertisement
Advertisement