kuruba meeting
-
కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి
గుత్తి రూరల్ : కురుబలు అన్ని రంగాల్లో రాణించి తమ సత్తా చాటాలని కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం కురుబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస 529 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్యక్షతన కనకదాస చిత్రపటాన్ని పట్టణంలో ఊరేగించారు. బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నాగేంద్ర మాట్లాడారు. కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే గొర్రెల మేకల ఫెడరేషన్‌కు అధిక నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కెపీఎస్ ధియేటర్ ఎదురుగా కనకదాస విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కురుబ సంఘం నాయకులు లింగన్న, ఎంపీటీసీ శంకర్, మహాలింగ, కోశాధికారి కుళ్లాయి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రంగయ్య, తిరుపాలు, నాగేశ్వరరావు, శేఖర్, సుధాకర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
విద్యావంతులైతేనే రాణింపు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ లేపాక్షి : సమాజంలో కురుబలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలంటే మొదట విద్యావంతులుగా ఎదగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం అన్నారు. లేపాక్షి మండలం కల్లూరులో కురుబ సేవా సంఘం ఆధ్యర్వంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కనకదాసు జయంతి సభలో వారు మాట్లాడారు. కురుబలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఇంతరవకు మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. కురుబలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కల్లూరు బస్టాండు వరకు కురుబలు ర్యాలీ నిర్వహించి శిలాఫలకం ప్రారంభించారు. తాలుకా కురుబ సంఘం అధ్యక్షుడు జగదీష్, స్థానిక కురుబ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కుళ్లాయప్ప, బిసలమానేపల్లి సర్పంచ్ మాళక్క పాల్గొన్నారు.