ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
గుత్తి : గుత్తిలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన సౌజన్య, వెంకటరాముడు దంపతుల కుమార్తె హేమలత(17) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ చాంద్‌బాషా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ఆమె శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లిందన్నారు. ఆ తరువాత ఆరగంటకే ఇంటి నుంచి మాయమైందని, రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. పరీక్ష బాగా రాయలేదనే కారణంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. తల్లిదండ్రులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.