
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.
తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment