![భర్త అనిల్‌తో సన (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81447039859_625x300_0.jpg.webp?itok=cZKAZpn1)
భర్త అనిల్‌తో సన (ఫైల్)
వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలు, అనిల్ రెండో భార్యగా చెబుతున్న సనను ఏ4 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరుపరచనున్నారు.
మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో గత శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.