former mp
-
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత
లక్నో: వైద్య సదుపాయాల కొరతతో సాధారణ పౌరులకే కాదు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయలు లేమి కారణంగా మాజీ ఎంపీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ అందుబాటులో లేక, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లోక్ సభ మాజీ ఎంపీ కుమారుడు మరణించాడు. లక్నోలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్ మిశ్రా కొడుకు ప్రకాష్ మిశ్రా(41) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి 11 గంటలకు లక్నోలోని ఎస్‌పీజీఐ ఆసుప్రతి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అయితే చికిత్స పొదుంతూ ప్రకాశ్ మిశ్రా మృతిచెందారు. కొడుకు మరణంతో కుంగిపోయిన ప్రసాద్ మిశ్రా.. ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో సరిపడ బెడ్స్ లేకపోవడమే కొడుకు మరణానికి కారణమని ఆయన ఆరోపించారు. అత్యవసర వైద్యాధికారి సైతం రోగిని కాపాడేందుకు ప్రయత్నించకుండా అలాగే ఉండిపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాసేపటికి తన కుమారుడు మరణించాడని మాజీ ఎంపీ పేర్కొన్నారు. చదవండి: అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం! కొడుకు మృతదేహంతో ఆసుప్రతి ఎమర్జెన్సీవార్డు వెలువల మిశ్రా ఆందోళన చేపట్టారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేసి తదుపరి విచారణ చేపట్టేవరకు తన నిరసన కొనసాగుతుందని తెలిపారు. ‘నేను నా కుమారుడిని కోల్పోయాను. ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా డ్యూటీ చేయడం లేదని నిరసనకు దిగాను. నేను నిరసన చేస్తున్నప్పుడు.. చాలా మంది వచ్చి, ఆ డాక్టర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలి,’ అని ప్రసాద్ మిశ్రా తెలిపారు. దీనిపై స్పందింంచిన ఆసుపత్రి యాజమాన్యం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప ్రస్తుతం డాక్టర్‌ను సస్పెండ్ చేశామని ఆసుపత్రి చీఫ్ ఆరేకే ధీమాన్ తెలిపారు. కాగా కాగా మిశ్రా గతంలో బండా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎస్పీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి వైఫల్యం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఫల్యమని మండిపడ్డారు.. ఆసుపత్రులకు బడ్జెట్ ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రసాద్ మౌర్య.. మిశ్రా ఇంటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు.కమిటీ వేసినట్టు, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జంట హత్యల కేసు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1995లో జరిగిన జంట హత్యల కేసుల్లో లోక్‌సభ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్(70)కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసును గతంలో ఎన్నడూ చూడలేదన్న ధర్మాసనం.. ఈ కేసులో నిందితుడు ప్రభునాథ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేందుకు ప్రభునాథ్ సింగ్ ప్రయత్నాలు చేశాడని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవ్యవస్థ తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయంది. ఇద్దరి హత్యతోపాటు మరో మహిళపై హత్యాయత్నం కేసుల్లో ఆగస్ట్ 18వ తేదీన ప్రభునాథ్ సింగ్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించింది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ కారులో వచ్చిన సింగ్ ఆరా తీశాడు. వేరే పార్టీకి ఓటేశామంటూ రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ మరికొందరు సమాధానమిచ్చారు. ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న రైఫిల్‌తో వారిపైకి కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై చప్రా పోలీస్‌స్టేషన్‌లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ సొంతింట్లో హత్యకు గురైన కేసులో సింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో ఉన్నాడు. -
కాంగ్రెస్ గూటికి పొంగులేటి.. ప్రకటన అప్పుడే..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ తొలగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన.. తనతో కలిసి వచ్చే ఇతర నాయకులతో కలిసి ఈనెల 12న ఆ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నారు. పొంగులేటి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలిసింది. జనవరి నుంచే జోరుగా చర్చ ఈ ఏడాది జనవరి ఒకటిన బీఆర్ఎస్పై పొంగులేటి ధిక్కారస్వరం వినిపించినప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటానంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తాను ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారని పొంగులేటి చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద ఐదు నెలలుగా పొంగులేటి ప్రజల మధ్యే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆతీ్మయ సమ్మేళనాలతో పాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దృష్టి సారించారు. మేలో రైతు భరోసా ర్యాలీ, పోడు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో పాటు యువత కోసం భారీ స్థాయిలో జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ యత్నాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి పయనించేందుకు పొంగులేటి సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలతోనూ చర్చలు జరిపారు. బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్‌లో చేరాలా.. ఏ పార్టీలో చేరకుండా సొంత కూటమి ఏర్పాటు చేయాలా? అనే అంశంపై చర్చలు జరిగాయి. అయితే ఖమ్మం జిల్లాలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. పలు దఫాలు పొంగులేటితో చర్చలు జరపగా, మే 4న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిని కలిశారు. అనంతరం హైదరాబాద్‌లోనూ వీరు సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. కాగా స్థానిక పరిస్థితులు, ఇతర అన్ని అంశాలనూ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనుచరుల నిర్ణయం మేరకు.. ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 7.30కి మొదలయ్యే సమావేశానికి పది నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున హాజరు కావాల్సిందిగా ఆయన అనుచరులకు సమాచారం అందింది. ఈ భేటీలో అభిప్రాయాలు సేకరించాక వారి నిర్ణయం మేరకు అడుగులు వేస్తానని పొంగులేటి చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 12న తన చేరిక విషయమై ప్రకటన చేస్తారని, ఈనెల 28 తర్వాత ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో అనుచర గణంతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. -
మాజీ ఎంపీ కణితి విశ్వనాథం కన్నుమూత
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు. వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
మాజీ ఎంపీ పొంగులేటికి షాకిచ్చిన కేసీఆర్ సర్కార్..! భద్రత తగ్గింపు
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్‌ను, ఇంటి ముందు ఉండే గన్మెన్లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్ఎస్పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఖమ్మం పాలిటిక్స్‌లో కలకలం -
కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత.. సీఎం సంతాపం
భువనేశ్వర్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు సుభాష్‌చంద్ర నాయక్(75) తుదిశ్వాస విడిచారు. ఒడిషాలోని భవానీపట్నలో ఉన్న ఆయన నివాసంలో తీవ్ర గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. కాగా, సుభాష్‌చంద్ర నాయక్.. 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా కలహండి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం సంఘ సేవకునిగా విశేష గుర్తింపు సాధించారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఉద్యోగానికి స్వస్తి పలికి, పాత్రికేయ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. కార్మిక నాయకుడిగా కూడా సుపరిచుతులు. ఇక, కలహండి ప్రాంతంలో దివ్యాంగుల సమస్యలను అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లి, రాజకీయ రంగంలో గుర్తింపు సాధించారు. కాగా, ఆయన అంత్యక్రియలను పూరీ స్వర్గద్వార్లో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సుభాష్‌చంద్ర నాయక్ మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. ఇది కూడా చదవండి: పదిరోజుల్లో మూడోసారి.. బీజేపీ పదే పదే అవమానిస్తోందా? -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలకనేతలు కీర్తి ఆజాద్, అశోక్ తన్వార్లు .. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా, అశోక్ తన్వార్ గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా, కీర్తి ఆజాద్.. 1983లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్లో ఆజాద్ ఒక సభ్యుడు. కీర్తి ఆజాద్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కీర్తి ఆజాద్.. అరుణ్‌జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఆజాద్ బిహార్‌లోని దర్భంగా నియోజక వర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే విధంగా.. మాజీ జెడీయూ నేత పవన్ వర్మా.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. -
ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ..
భువనేశ్వర్: ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నబరంగ్ పూర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మజీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు.. ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల కొంత అసహనంతో ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను పార్టీని విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ మజీ.. 2009లో నబరంగ్‌పూర్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఒడిశా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ మజీ రాజీనామాపై జేపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపాటి మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ప్రదీప్ మజీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయటకు వెళ్లిపోవడం పార్టీకి మంచిదన్నారు. కాగా, లక్ష్మిపూర్ మాజీ ఎమ్మెల్యే కైలాష్ కులేశికా కాంగ్రెస్ పార్టీకి గత బుధవారం రాజీనామా చేసి బీజీడీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుతం .. ప్రదీప్ మజీ కూడా పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్హి కూడా అధికార బీజేడీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’ -
మాజీ ఎంపీ మనవడి హత్య
తిరువొత్తియూరు: నామక్కల్ సమీపంలో డీఎంకే మాజీ ఎంపీ మనవడిని హత్య చేసిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా సేందమంగళం సమీపం బేలకురిచ్చి వాసి జేపీఎస్ సోమసుందరం. డీఎంకేకు చెందిన ఇతను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఈయన మనవడు రాజేంద్రన్ (52) రైతు. బేలకురిచ్చిలో నివాసముంటున్నాడు. అతని భార్య సుగుణ (45). ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో ఈ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రాజేంద్రన్ ఇంటికి వచ్చిన నలుగురు దుండగులు తలుపు కొట్టారు. అతను బయటకు రావడంతో కత్తులతో దాడి చేసి పారిపోయారు. రాజేంద్రన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బేలకురిచ్చి ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్, రాసిపురం డీఎస్పీ సెంథిల్ కుమార్, బెలచ్చేరి ఇన్స్పెక్టర్ శివ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్ట్ తిరువారూరు జిల్లా వలంగై మాన్ సమీపం నల్లూరుకు చెందిన రోజాపతికి కార్తీక్ (31), ప్రశాంత్ (29), వినోద్ (27)అనే కుమారులు ఉన్నారు. వినోద్ ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో కార్తీక్ తనకు ఎందుకు ఇంకా వివాహం చేయలేదని తల్లితో గొడవ పడ్డాడు. కార్తీక్ తీరును ఖండించే క్రమంలో వినోద్ కత్తితో అన్నపై దాడి చేయడంతో అతడు మరణించాడు. వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
చూస్తుండగానే కుప్పకూలింది.. పెద్ద గండం తప్పింది
లక్నో: లక్నోలో మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ ఐదంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్షణాల్లో కూలిపోయిన ఆ బిల్డింగ్ కింద ఎవరు లేకపోవడంతో పెద్ద గండం తప్పినట్లయింది. లక్నోలోని రెసిడెన్సీ సురక్షిత స్థలానికి అడ్డుగా ఉందంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అభ్యంతరం తెలపడంతో బిల్డింగ్‌ను కూలగొట్టారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన చాలా భవనాల వారసత్వ సంపదను దెబ్బతీస్తుందని అక్కడి స్థానికలు ఇటీవలే కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టుకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో బిల్డింగ్‌ను కూల్చివేశారు. కాగా పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చి బిల్డింగ్‌ను కూల్చే ప్రయత్నం చేశారు. క్షణాల్లోనే బిల్డింగ్ కూలిపోగా.. మట్టిపెళ్లలు వచ్చి క్రేన్ ఆపరేటర్‌కు తగిలాయి. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా అక్కడ ఉన్న వాహనాల్లో చాలా వరకు ధ్వంసం అయ్యాయి. ''బిల్డింగ్ కూల్చడం బాగానే ఉంది.. కానీ పెద్ద గండం తప్పింది..'' అని నెటిజన్లు కామెంట్ చేశారు. बी एस पी के पूर्व एम पी दाऊद का लखनऊ में बन रहा मल्टी स्टोरीड रेजिडेंशियल अपार्टमेंट सरकार ने ज़मींदोज़ कर दिया।इसकी लागत 100 करोड़ बताई जा रही है।यह ए एस आई के मोन्यूमेंट रेजीडेंसी के बहुत क़रीब बन रहा था।जिसने इसे गिराने का आदेश दिया था। pic.twitter.com/Uozb1klqW2 — Kamal khan (@kamalkhan_NDTV) July 4, 2021 -
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : హత్య కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా కారణంగా కన్నుమూశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి వర్గాలు, ఢిల్లీలోని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ఈ విషయాన్ని ధృవీకరించారు. షాహాబుద్దీన్‌కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యం విషమించిన షాహాబుద్దీన్‌కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 20 న దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని సివాన్‌కు చెందిన షాహాబుద్దీన్ మరణంపై ఆర్జేడీనేత తేజశ్వి యాదవ్ సహా, పప్పు యాదవ్ పలువురు ఇతర నాయకులు ట్విటర్లో నివాళులర్పించారు. ఆయన అకాల మరణం బాధాకరమైన వార్త అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా బిహార్ బాహుబలిగా వ్యవహరించే మహ్మద్ షాహాబుద్దీన్‌పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్‌కు ముందు భగల్పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకువవచ్చినా బెయిల్ రద్దు కారణంగా తిరిగి జైలుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్‌లో తండ్రి షేక్ మహ్మద్ హసీబుల్లా మరణించిన సమయంలో షాహాబుద్దీన్‌ను పెరోల్‌కు కూడా అనుమతి లభించలేదు. చదవండి : ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం -
కాంగ్రెస్ సీనియర్ నేత, వాజ్‌పేయి బంధువు కరోనాతో మృతి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె చత్తీస్‌గఢ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారు. ఆమె మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కూడా. దీనిపై పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కరుణ శుక్లా లోక్‌సభకు చత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ నియోజకవర్గంనుంచి 14వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆతరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో పోలీచేసి ఓటమి పాలయ్యారు. కాగా కరోనా సెకండ్‌వేవ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రోజుకు మూడున్నర లక్షలకుపైగా కేసులు, 2వేలకు పైగా మరణాలతో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం నాటి గణాంకాల ప్రకారం వరుసగా ఆరో రోజుకూడా మూడుల లక్షల మార్క్‌ను దాటి 3 23,144 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మే 1 వ తేదీనుంచి 18 సంవత్పరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. -
రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్తకు ఈడీ షాక్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, తృణమూల్ కాంగ్రెస్ మాజీనేత, రాజ్యసభ ఎంపీ కేడీ సింగ్ ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కన్వర్ దీప్ సింగ్‌ను బుధవారం అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.1900 కోట్ల రూపాయల పోంజీ చిట్ ఫండ్ స్కీం స్కాం కేసు దర్యాప్తులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా రియాల్టీ లిమిటెడ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేడీ సింగ్‌పై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. చిట్ ఫండ్ స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆయన ఇల్లు,ఆఫీసులపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది. 2019 జనవరిలో ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన రూ. 239 కోట్ల ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. చిట్‌ఫండ్ పేరుతో సుమారు 1916 కోట్ల నిధులను మూడేళ్లలో సేకరించిందనేది ప్రధాన ఆరోపణ. అయితే సుమారు రూ.1077 కోట్లు తిరిగి చెల్లించినట్లు 2015లో సంస్థ సెబీకి తెలిపింది. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరికొంత సమయం కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సెబీ 2016 మార్చిలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. అటు నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో కూడా కేడీ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించింది. -
కరోనా : జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత
జైపూర్: కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్‌కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ రాజస్థాన్‌ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒకప్పటి జైపూర్ పాలకుల నివసించిన ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్ డైరెక్టర్‌గా ఉన్నారు. దివంగత అధికారిక జైపూర్ మహారాజా సవాయి మాన్ సింగ్, మాజీ మహారాణి కిషోర్ కన్వర్ కుమారుడు పృథ్వీరాజ్. 1962లో స్వతంత్ర పార్టీ టిక్కెట్‌పై దౌసా నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ కుటుంబానికి చెందిన చివరి వారసుడు అయిన పృథ్వీరాజ్ తదనంతర కాలంలో రాంబాగ్ ప్యాలెస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చారు. త్రిపుర యువరాణి అతని సవతి తల్లి గాయత్రీ దేవి మేనకోడలు దేవికా దేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమారుడు విజిత్ సింగ్ ఉన్నారు. తన అంకితభావం, దక్షతతో క్లిష్ట వ్యవహారాలను సైతం చక్కబెట్టగల సమర్ధుడిగా పృథ్వీరాజ్ కీర్తి గడించారు -
కట్టుకథలకు కాలం చెల్లింది
మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్ కేసుల వూర్తి వివరాలను వెంటనే అందించాలి, వీటిని రోజువారీ ప్రాతిపదికన విచారించి, రెండు నెలల్లోగానే పరిష్కరించాలని సుప్రీంకోర్టు.. అన్ని రాష్ట్రాల హైకోర్టులను తాజాగా ఆదేశించింది. వీటిపై త్వరగా విచారణ చేయాలని, హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తినీ, ప్రిన్సిపల్ సీబీఐ జడ్జినీ, ప్రిన్సిపల్ ఏసీబీ జడ్జీలనూ నియమించా లని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఎనిమిదేళ్ల క్రితం ఆనాటి సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను 27–10–2020కి అప్డేట్ చేసింది. – (29–10–2020 వార్తలు) నిజానికి, దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ప్రస్తావించి, వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు అందించి, రాష్ట్రాల హైకోర్టులు రెండు నెలల్లోగా వీటిని పరిష్క రించాలన్న ఆదేశం చాలా ఆలస్యంగా వచ్చినా మెచ్చదగింది. అయితే అంతూ పొంతూ లేకుండా ఏళ్లూపూళ్లుగా, దశాబ్దాలుగా ఈ కేసులు నాన్పుడు బేరంగా సాగడానికి గల కారణాలను కూడా పరిశీలించి వెలికి తీయాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించలేకపోవడం విచార కరం. కొద్ది రోజుల క్రితమే జాతీయ స్థాయి ఏటీఆర్ రిపోర్టు దేశ వ్యాప్తంగా 4,400 పైచిలుకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై.. హత్యలు, బెది రింపులు, మానభంగాలు, వేధింపులు వగైరా అనేక నేరాలకు సంబం ధించిన కేసులు పేరుకు పోయి ఉన్నాయని వెల్లడించి దేశప్రజల్ని తెల్లబోయేలా చేసింది. దాదాపు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత మన దేశం ఇంతటి దుర్భర స్థితిలో ఉండటానికి కారణాలేమిటో, కారకు లెవరో నిర్మొహమాటంగా నిగ్గుదేల్చవలసిన ఘడియలివి. నిజానికి 1970ల నాటికే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏఎన్ ఓహ్రా.. నవభారత రాజ్యాంగ స్ఫూర్తిని కుమ్మరి పురుగులా నిలువెల్లా తొలచివేస్తున్న మూర్తిత్రయం ఎవరంటే రాజ కీయనాయకులు.. వారు ఆధారపడిన నేరగాళ్లు, బేర గాళ్లు.. వారికి అండగా నిలిచిన పోలీసు యంత్రాంగం అని ప్రకటించారు. ప్రమోషన్ల కోసం లేదా పదవీ విరమణానంతరం పదవులకోసం ఎగబడే కొందరు మాజీ ప్రధాన న్యాయ మూర్తుల వల్ల కూడా వ్రజాస్వామ్య వ్యవస్థా చట్రానికి తెగులు పట్టి పీడిస్తోంది. ఇందులో దుర్భిణీ వేసి ఏరికోరి వెతికి తీయవలసిన వారి సంఖ్య తక్కువ కాదని ఏటీఆర్ తాజా నివేదిక నిరూపిస్తోంది. ఎందుకంటే మనం కాలక్షేపం చేస్తున్నది పైకి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అయినా, అట్టడుగున పెంచుకున్న పునాది మాత్రం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థది. దాని తాలూకు అవ లక్షణాలను మూలాల దాకా తొలగించుకోనంత కాలం ఆ లక్ష ణాలు వ్యవస్థని వెన్నాడుతూనే ఉంటాయి. వీటి ప్రభావానికి ప్రస్తుత రాజ కీయపక్షాలు, రాజకీయ నాయకులు, పాలకులు, కేంద్ర రాష్ట్రాల శాసనవేదికలు, న్యాయస్థానాలు తరచుగా లోనవుతూనే ఉంటాయి. ఈ పూర్వరంగంలోనే ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్ధాంతరంగా దివంగతులైన తర్వాత రాష్ట్రంలో ఏర్ప డిన రాజకీయ శూన్యతలో ముందుకు దూసుకువచ్చి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానవర్గానికి కంటగింపుగా మారిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు పాదయాత్ర కాస్తా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే కాకుండా, అప్పటికే అడుగూడిపోయిన చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లోకి ఒకవైపున కాంగ్రెస్ కుట్రల మధ్య, కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు మరొకవైపు నుంచి జగన్మోహన్రెడ్డిని అడకత్తెరలో పావు చెక్కను చేసి దెబ్బతీసే ఉద్దేశంతో– జమిలిగా పన్నిన కుట్ర ఫలి తమే ఈ క్షణం దాకా జగన్‌పై మోపి, ఆయనను నిష్కారణంగా జైలుకు పంపడంలోను సీబీఐ ద్వారా అల్లించిన కేసుల కథాకమా మీషూ! జగన్‌పై మోపిన 22 కేసుల్లో బలం ఉన్న పక్షంలో, స్పెషల్ కోర్టు విచారణ సందర్భంలోనే జగన్ కంపెనీల్లోకి తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు తర లించాయన్న ఆరోపణ వైఎస్సార్ సజీవుడై ఉన్నప్పుడే దూసుకు రావ లసింది. కానీ వైఎస్సార్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ‘కథ’ అల్లిన వైనం కూడా చిత్రమైన కుట్ర. చనిపోయిన ఆయన ఎలాగూ రాడు, కాబట్టి వైఎస్సార్ కేబినెట్ సమష్టి నిర్ణయాలు ఆధారంగా జగన్ తన ఎదు గుదల కోసం తన కంపెనీల్లోకి ‘గుత్త’గా కొన్ని కంపెనీల నుంచి అప్పనంగా రాబట్టుకున్నాడన్న వాదన బయలుదేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పైగా రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కొనసాగిన వైఎస్సార్ మంత్రివర్గ సభ్యులు ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానం, చంద్రబాబు ఆరోపణ లను ఖండించారు. వారిలో మంత్రివర్గ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇత్యాది మంత్రులూ ఉన్నారు. ఆమాటకొస్తే– వైఎస్సార్ ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార భాషా సంఘం అధ్యక్షు నిగా నేను 2005 నుంచి 2009 వరకూ సచివాలయంలో పనిచేసిన న్నాళ్లూ– ఏ రోజునా, అందరి ముఖ్యమంత్రుల కొడుకులూ, కూతుళ్లు, అల్లుళ్ల మాదిరిగా జగన్మోహన్రెడ్డి సచివాలయానికి వచ్చినట్లుగానీ, తండ్రిని కలిసివెళ్తున్నట్లుగానీ ఒక్క ఉదాహరణ కూడా లేదు. అనేక మంది మంత్రుల, ముఖ్యమంత్రుల పిల్లలు తరచూ ‘ఆసులో గొట్టాం’లా సచివాలయానికి వస్తూపోతూ ఉండటం ఒక అలవాటుగా మనకు తెలుసు. అదలా ఉంచుదాం. జగన్‌పై చంద్ర బాబు ముఠా, వాళ్ల ప్రచార బాకాలు చేసిన మరొక విచిత్ర ఆరోపణ– ‘తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల్ని రూ. 35 కోట్ల మేర జగన్ మోసం చేశాడట. ఇలాంటి కట్టుకథల ఆధారంగా ‘ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీబీఐ మోపిన కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంద’ని బీబీసీ తెలుగు ప్రసార వాణి ప్రకటిస్తూ, జగన్‌పై కేసులు ఏపీలో మోపడం ఎలా ప్రారం భమైందో వివరించింది: ‘తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఎర్రన్నా యుడు, నాటి కాంగ్రెస్ నేత శంకరరావు 2010లో రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. నాడు ఎంపీగా ఉన్న జగన్ ‘క్విడ్ ప్రోకో’ పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ఇతర అవకాశాలు కల్పించి– బదులుగా జగన్ సొంత సంస్థ ‘జగతి’లో పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆరోపణలు నమో దయ్యాయి. ఈ పెట్టుబడుల్ని లంచాలుగా చూపుతూ ఆ డబ్బును హవాలాగా మార్చడంలో జగన్ కీలక పాత్ర పోషించారన్నది అభియోగమని, సీబీఐ విచారణకు పునాది అనీ బీబీసీ చెప్పింది. రుజువులు చూపలేని ఈ కూట రాజ కీయం ఆధారంగానే 2012 మేలో జగన్‌ను అరెస్టు చేయించి, 16 మాసాలు చంచల్‌గూడ జైలులో నిర్బంధింపజేయడానికి అటు కాంగ్రెస్, ఇటు చంద్రబాబు పార్టీలు ఎలా కారకులయ్యాయో బీబీసీ నివేదిక చెప్పకనే చెప్పింది. జగన్‌పై కేసును సీబీఐ విచారణకు హైకోర్టు అప్పగించింది. 2011 ఆగస్టు 10న కేసు నమోదైంది. 2004–2009 మధ్య కాలంలో ‘నేరం జరిగిందన్న’ అనుమానంతో ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా వైఎస్ జగన్, విజయ సాయిరెడ్డిని ఇరికించగా, కేసులో మొత్తం నిందితులుగా పేర్కొన్న వారు 72 మంది. జగన్‌పై మోపిన కేసులకు ‘నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, లెక్కలు తారమారు చేయడం’ లాంటి పేర్లు తగిలించింది సీబీఐ. ఇలా అల్లిన డజను అభియోగాల ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు అభియోగపత్రాలు తయారీ చేసింది. అయితే 31.3.2012తో ప్రారంభించిన సీబీఐ మొదటి చార్జిషీట్ లగాయతు గత ఎనిమిదేళ్లుగానూ జగన్‌వల్ల ‘క్విడ్‌ప్రోకో’ మంత్రం వల్ల లాభించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్క కంపెనీగానీ లేదా సంస్థగానీ సీబీఐ ప్రత్యేక కోర్టు చర్యకు గురికాలేదు, అరెస్టయిన సంస్థలు, వ్యక్తులు, ప్రతినిధులుగానీ విడుదల అయ్యారేగానీ కోర్టు చర్యకు గురికాలేదు. కాగా, ఈ మధ్య కాలంలో సీబీఐ జగన్‌పై కేసుల నిరూపణలో సాక్ష్యాలు చూపడంలో తరచుగా విఫలమవుతూ నోరెళ్లబె డుతూ ఉండటం గమనించిన ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు ఎప్పుడు మీ సాక్ష్యాలు, ఎక్కడ మీ సాక్ష్యాలు, ఇంకెన్నాళ్లు తీసుకుం టారు సాక్ష్యాలు చూపడానికి అంటూ పదేపదే ప్రశ్నించవలసి రావడం– సీబీఐ కేసు కాంగ్రెస్, టీడీపీల ప్రత్యక్ష ప్రేరేపిత చర్య అని చెప్పక చెబుతోంది. ఇటువంటి కుట్రలు మరెంత కాలమో సాగవు. చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవస్థల్ని, వాటిలోని ప్రధాన అధికారులను, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, కొందరు సీబీఐ స్థానిక అధికారుల్ని సాకడం ద్వారా పలు కేసులనుంచి, బడా కంపె నీలకు వందల ఎకరాల భూమిని దోచిపెట్టిన కేసుల నుంచీ ఈరోజుకీ తప్పించుకు తిరుగుతున్నవాడే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ వాదులుగా, జడ్జీలుగా ప్రమోట్ చేయించి, సుప్రీంకోర్టు దాకా పంపించి, సుప్రీంకోర్టులోనూ, రాష్ట్ర హైకోర్టులోనూ తనకు అనుకూల తీర్పులు పొందడానికి పదవిలో ఉండగానో, పదవి ఊడిన తర్వాత ప్రతిపక్ష నాయక స్థానంనుంచీ చంద్రబాబు ఎటువంటి దుష్టపాత్ర వహిస్తున్నదీ నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇందుకు మహాభారత దుష్ట పాత్రలో దుర్యోధనుడి మాటలే సాక్ష్యం– ‘నిజమేదో నాకు తెలుసు, కానీ దానివైపు నా మనస్సు మళ్లదు, అబద్ధమేదో కూడా నాకు తెలుసు, కానీ దాని నుంచీ నా మనస్సు మళ్లదు’ అన్నాడు. బాబు మనస్సూ అంతే సుమా. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ
అంతేలే పేదల బతుకులు..అశ్రువులే నిండిన కుండలు.. కూలాడితే గాని కుండాడని జీవితాలు.. పిల్లల్ని చదివించాలంటే అప్పులు చేయాలి.. అప్పులు తీరాలంటే అవకాశాలు వెతుక్కోవాలి. ఉన్న ఊరిలో పరిస్థితులు వెక్కిరిస్తే పొరుగూరికి వలస పోవాలి. అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కష్టించి పని చేయాలి. ఆ క్రమంలో అనారోగ్యం బారిన పడితే ఇక అంతే సంగతులు. చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సంకట స్థితినే నవరంగపూర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు చవిచూశారు. ఒడిశా: గ్రామంలో చేసిన అప్పులు తీర్చేందుకు కుమార్తెతో కలిసి కూలి పనుల కోసం హైదరాబాద్ వలస వెళ్లిన తల్లి అక్కడ జబ్బు పడింది. హాస్పిటల్ ఖర్చుల కోసం, మందులకు తాము పనిచేసే యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఇంటికి వెళ్లి వచ్చి అప్పు తీరుస్తానని చెప్పి కుమార్తెను యజమాని వద్ద తాకట్టు పెట్టి గ్రామానికి వచ్చింది. జబ్బు విషమించడంతో దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఈ విషయం తెలిసినప్పటికీ కన్నతల్లిని కడసారి చూసేందుకు ఆ బాలిక ఇంటికి రాలేకపోయింది. చివరికి విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించి తన మనిషిని హైదరాబాద్ పంపి ఆ బాలికను విడిపించి తీసుకువచ్చిన సంఘటన జిల్లా ప్రజల హృదయాలను కదిలించింది. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితికి చెందిన అనాది పాణిగ్రహి భర్త మూడేళ్ల కిందట మరణించాడు. ఆమె తన ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాలన్న ఆశతో మైక్రోఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.30 వేలు రుణం తీసుకుంది. ఇద్దరినీ కళాశాలలో చేర్చింది. అయితే తీసుకున్న అప్పు తీరే మార్గం కానరాక పెద్ద కుమార్తె ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి తనతో పాటు చిన్న కుమార్తె సాగరిక (16)ను తీసుకుని 5 నెలల కిందట ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. అక్కడ తల్లీకూతుళ్లు ఒక ఇటుకల కంపెనీలో పనికి కుదిరారు. అయితే హైదరాబాద్‌లో తల్లి అనాది ఆరోగ్యం క్షీణించింది. మందుల కోసం కంపెనీ యజమాని వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని కుమార్తె సాగరికను ఇటుకల కంపెనీ యజమాని వద్ద తాకట్టు పెట్టి చందాహండి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన కొంత కాలానికే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మరణించింది. అయితే అప్పటికే లాక్డౌన్ అమలులో ఉండడం వల్ల కుమార్తె సాగరిక తల్లిని చూసేందుకు కూడా ఇంటికి రాలేకపోయింది. గ్రామంలో ఉన్న సాగరిక అక్క ప్రియాంక చెల్లెలి రాక కోసం ఎదురు చూస్తూ విలపిస్తోంది. చదవండి: ప్రియుడు మోసం చేశాడని టీవీ నటి ఆత్మహత్య స్పందించని ప్రభుత్వం హైదరాబాద్‌లో తాకట్టులో ఉన్న సాగరిక తన గోడును ఒడిశా ప్రభుత్వానికి విన్నవించుకుంది. అయితే ఎవరూ స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసిన నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి స్పందించి వెంటనే తన కారులో చందాహండి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చందాహండి సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర హింసను వెంటనే హైదరాబాద్ పంపారు. ఆయన ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల అధికారులతో పాటు ఇటుకల కంపెనీ యజమానితో మాట్లాడి సాగరికను వెంటనే విడిచి పెట్టాలనికోరారు. ఎట్టకేలకు సాగరిక విముక్తి పొంది శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం నవరంగపూర్ చేరుకుంది. లాక్డౌన్ వల్ల పంపలేక పోయాం కాంగ్రెస్ నేతలు ఆమెను ఓదార్చి ఈ విషయం విలేకరులకు తెలియ జేశారు. సాగరిక తన బాధల గాథలను చెబుతూ విలపించింది. అక్కను కలిసి భోరున ఏడ్చింది. హైదరాబాద్‌లో ఇటుకల బట్టీ యజమాని కె.సుబ్బారావు ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ సాగరిక తల్లి అనారోగ్యం వల్ల ఇంటికి వెళ్లిందని, ఆమె మరణించిన విషయం తెలిసి సాగరికను పంపించాలని భావించామని లాక్డౌన్ కారణంగా పంపించలేక పోయానని చెప్పారు. తల్లిని కోల్పోయి అనాథల్లా మిగిలిన అక్కాచెలెళ్లు ప్రియాంక, సాగరికలను ప్రభుత్వం ఆదుకుని వారిని చదివించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నవరంగపూర్ చేరుకుని భోరున విలపిస్తున్న సాగరిక -
అజిత్ జోగి కన్నుమూత
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్‌గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. కలెక్టర్‌గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. -
అధికార లాంఛనాలతో నారాయణ రెడ్డి అంత్యక్రియలు
సాక్షి, డిచ్పల్లి: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ ఎం నారాయణరెడ్డి పారి్థవ దేహానికి అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులోని కృషి దర్శన్ కేంద్రంలో (నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రం)అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్ నగరంలోని ఆయన నివాసం నుంచి స్వర్గ రథయాత్ర వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని కృషి దర్శన్ కేంద్ర వరకు ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, జీవన్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త, నగర మేయర్ నీతూకిరణ్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు నారాయణరెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తూ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులరి్పంచారు. నారాయణరెడ్డి కుమారుడు అరుణ్‌రెడ్డి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరెడ్డి కుమార్తెలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, సీపీ, మేయర్ ఉద్యమకారుడు.. అభ్యుదయవాది అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, అభ్యుదయ వాది, మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై ఆనాడే పార్లమెంట్లో గళం విప్పి 45 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన నాయకుడని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని విషయాలు తెలుసుకుని సభలలో సుదీర్ఘంగా తెలంగాణ వాణి విని్పంచే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు నారాయణరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల్లో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు విద్యాసాగర్, నాయకులు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలను వారంలోగా ఖాళీ చేయాల్సిందిగా లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఆదేశించింది. ఈ కమిటీకి సీఆర్ పాటిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీలు తమకు కేటాయించిన బంగ్లాలు ఖాళీ చేయని పక్షంలో.. మూడు రోజుల్లో విద్యుత్తు, నీళ్లు, గ్యాస్ కనెక్షన్లు తొలగిస్తామని తెలిపింది. 2014లో ఎన్నికయిన పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వం ఢిల్లీలోని లూటీన్స్ బంగ్లాలను కేటాయించింది అధికార వర్గాల సమాచారం ప్రకారం 16వ లోక్‌సభ రద్దయినప్పటికీ దాదాపు 200మంది మాజీ ఎంపీలు ఇంకా వారికి కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయలేదు. అయితే, మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయకపోవడం వల్ల కొత్తగా ఎన్నికయిన పార్లమెంట్ సభ్యులు తాత్కాలిక భవనాలలో ఉండాల్సి వస్తుంది. కాగా, మాజీ ఎంపీలు రాష్ట్ర అతిథి గృహాలలో నివసించాలని హౌసింగ్ కమిటీ సూచించింది. -
మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు
చెన్నై: మాజీ ఎంపీ కుళందైవేలు భార్య హత్య కేసులో ఢిల్లీలో దాగి ఉన్న కుమారుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తిరుచెంగోడు నియోజకవర్గం అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇతని భార్య రత్నం (63) చెన్నై శాస్త్రీనగర్ ఆరో అవెన్యూలో నివసిస్తున్నారు. వీరికి సుధా అనే కుమార్తె, ప్రవీణ్ (35) అనే కుమారుడు ఉన్నారు. సుధాకు వివాహమై తిరుపూర్‌లో ఉంటోంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవీణ్ మార్చి నెలలో స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో అతను విదేశంలో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహ విషయం, ఆస్తికి సంబంధించి తల్లికి, కుమారుడికి మధ్య తగాదా ఉంటూ వచ్చింది. దీంతో ఏప్రిల్ 14న రాత్రి ప్రవీణ్ తల్లి అని కూడా చూడకుండా రత్నం చేతులు, కాళ్లు కట్టివేసి గొంతు కోసి, గుండెలపై కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత ఇంటిలో మృతదేహాన్ని ఉంచి బయట గడియవేసి తప్పించుకున్నాడు. దీని గురించి శాస్త్రినగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్ కోసం గాలిస్తూ వచ్చారు. ఇలా ఉండగా ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి సోమవారం అరెస్టు చేశారు. -
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీకి గుజరాత్లో భారీ షాక్ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ శనివారం ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు. పులుల సంరక్షణా కేంద్రం గిర్ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్‌ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్ చేసిన సీబీఐ అమిత్ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్‌షీటు దాఖలు చేసింది. కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్ ఎల్ పటేను మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది.