నల్లగొండ (నకిరేకల్): తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం సాయంత్రం నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించినందున అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి గురువారం సూర్యాపేట కోర్టులో కేసు వేశారు. శుక్రవారం సూర్యాపేట కోర్టులో జడ్జి లేకపోవడంతో దానికి సంబంధించిన వాగ్మూలం ఇవ్వడానికి నకిరేకల్ మున్సిఫ్ కోర్టుకు హాజరయ్యారు.