మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ ! | former MP son attacked on hotel staff and police in Alcohol intoxication | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ !

Published Wed, Jan 21 2015 8:17 AM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM

మద్యం మత్తులో  మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ ! - Sakshi

మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు హల్ చల్ !

హైదరాబాద్: పంజాగుట్టలో మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడు మంగళవారం అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. మీల్స్ పార్శిల్ విషయంపై హోటల్ సిబ్బందితో అతనికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం సీసాలతో అతడు హోటల్ సిబ్బందిపై దాడికి యత్నించినట్టు సమాచారం. దాంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు అతడిని  పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. దాంతో మాజీ ఎంపీ తనయుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement