మాజీ ఎంపీకి ఉరి శిక్ష | Bangladesh court sentences ex-MP to death for war crimes in 1971 | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీకి ఉరి శిక్ష

Published Wed, Aug 10 2016 4:07 PM | Last Updated on Wed, Oct 3 2018 7:42 PM

మాజీ ఎంపీకి ఉరి శిక్ష - Sakshi

మాజీ ఎంపీకి ఉరి శిక్ష

ఢాకా: బంగ్లాదేశ్లో ఓ మాజీ ఎంపీకి ఉరి శిక్ష వేశారు. ఆ దేశ స్వాతంత్ర పోరాటం సమయంలో యుద్ధ నేరానికి పాల్పడ్డాడని ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అతడికి ఉరి శిక్ష ఖరారు చేసి మరికొంతమందికి జీవిత కారాగార శిక్ష వేసింది. అయితే, ఆ ఎంపీకి సంబంధించిన న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసును మరోసారి అపీల్ చేస్తామని చెప్పారు. బంగ్లాదేశ్లో యుద్ధ నేరాల పేరిట పలువురుని ఇటీవల కాలంలో ఉరి తీస్తున్న సంగతి తెలిసిందే.

అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం జమాతే ఈ ఇస్లామి పార్టీకి చెందిన షాకావత్ హుస్సేన్ గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం  ఇస్లామీ చత్ర సంఘలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో దేశ విముక్తికోసం పోరాడాల్సిందిపోయి.. బంగ్లాపై యుద్ధానికి దిగిన పాక్కు సహాయం చేసి ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణలను విచారించిన ట్రిబ్యునల్ అతడికి ఉరి శిక్షను వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement