మాజీ ఎంపీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ కన్నుమూత, ప్రధాని సంతాపం | Former Rajya Sabha Editor MP Chandan Mitra Passed away | Sakshi
Sakshi News home page

Chandan Mitra: కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

Published Thu, Sep 2 2021 9:47 AM | Last Updated on Thu, Sep 2 2021 10:07 AM

Former Rajya Sabha Editor MP Chandan Mitra Passed away - Sakshi

చందన్‌​ మిత్రా ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్‌ జర‍్నలిస్ట్‌ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా  కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్‌ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

ఎడిటర్, పొలిటీషియన్ చందన్‌ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక‍్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా  ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై  విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి  ఒక ఫోటో  షేర్‌ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్‌ మిత్రా రాజీనామా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement