Chandan Mitra
-
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
‘వారి చేతులు రక్తపు మరకలతో తడిశాయి’
కోల్కత్తా : బీజేపీ ప్రభుత్వం తాలిబన్ గ్రూపులను తయారుచేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీ వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కత్తాలో మెగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మతకల్లోలాలు సృష్టించి వారి చేతులు రక్తపు మరకలతో తడిసిపోయాయని మమతా ధ్వజమెత్తారు. బీజేపీ నేతల అహంకార, బెదిరింపులు మాటలకు ప్రజలు భయపడవద్దని సూచించారు. ప్రజల క్షేమం కోసం సరిగ్గా టెంట్ కూడా నిర్మించలేని వారు దేశాన్ని ఏం నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇటీవల మిద్నాపూర్‌లో మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దేశాన్ని మతతత్వ బీజేపీ నుంచి రక్షించేందుకు ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ అనే నినాదాన్ని ఆగస్ట్ 15 నుంచి ప్రచారం చేస్తామని మమత ప్రకటించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్ విజయం సాధించి తీరుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 32 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు జనవరిలో అన్నిపార్టీల నేతలతో కోల్‌కత్తాలో భార్యీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మమతా ప్రకటించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్లో కొందరూ మంచివారు ఉన్నారని, వారిని గౌరవిస్తానని పేర్కొన్నారు. కొందరూ మాత్రం మతకల్లోలు సృష్టించి దేశంలో అల్లర్లు రేపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత చందన్ మిత్రా బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతున్నట్లు మమతా ప్రకటించారు. వీరితో పాటు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరారు. -
బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్
కోల్కత్తా : రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను ఎదుర్కొవాలనుకుంటున్న బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చందన్ మిత్రా శనివారం టీఎంసీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ప్రధాన సహచరుడైన మిత్రా రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. గత కొంత కాలంగా నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంతో విభేదిస్తున్న మిత్రా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన మొదటిసారి 2003లో రాజ్యసభలో అడుగుపెట్టగా, 2010లో రెండోసారి మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎన్నికైయ్యారు. 2014లో హుగ్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మిత్రాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్ ముఖర్జీ, అబూ తెహర్, షబీనా యాస్మిన్, అఖ్రుజ్‌మాన్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలు చేరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేతలు పార్టీని వీడటం బీజేపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే భావించాలి. -
బీజేపీకి గుడ్‌బై చెప్పేసి... తృణమూల్ గూటికి
కోల్‌కతా : సీనియర్ జర్నలిస్ట్, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన చందన్ మిత్రా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈనెల 21న మిత్రా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిత్రా బీజేపీ చీఫ్ అమిత్ షాకు తన రాజీనామా లేఖను అందచేశారని, ఈనెల 21న ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని మిత్రా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జులై 21న తృణమూల్ భారీఎత్తున షాహిద్ దివస్‌ను నిర్వహించనున్న క్రమంలో బెంగాల్ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో మిత్రా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి సన్నిహిత సహచరుడిగా పేరొందిన మిత్రా నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం తనను పక్కనపెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పయనీర్ పత్రిక ఎడిటర్ అయిన చందన్ మిత్రా 2003 నుంచి 2009 వరకూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2010లో మరోసారి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీతో పలు అంశాల్లో ఇటీవల మిత్రా విభేదించడంతో సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు ఆయనను ట్రోల్ చేశాయి. -
బంజారాహిల్స్ పీఎస్‌లో ఐఎఫ్ఎస్ అధికారి ఫిర్యాదు
తన భార్యను కారుతో ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనపై దుర్భాషలాడిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్ఎస్ అధికారి చందన్‌మిత్రా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్రోల్‌బంక్ యజమానిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ సీసీఎఫ్ చందన్‌మిత్రా శనివారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో తన భార్య నందితా మిత్రాతో కలిసి బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చారు. భార్యను రోడ్డుపై దింపి కారును పార్కింగ్ చేసేందుకు చందన్‌మిత్రా వెళ్లారు. అదే సమయంలో క్యాన్సర్ ఆస్పత్రి వైపు నుంచి ఏపీ 09 బీజీ 446 నంబర్ కారు మితిమీరిన వేగంతో వచ్చి రోడ్డు పక్కన నిలబడ్డ నందితామిత్రాను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదేమిటని ఆమె ప్రశ్నిస్తుండగానే నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తూ సదరు వ్యక్తి పార్కులోకి వాకింగ్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని నందిత తన భర్త చందన్మిత్రాకు తెలిపింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా కనిపించిన సునీల్‌ను అంత నిర్లక్ష్యం ఏంటని కనీస మర్యాద లేదా అంటూ చందన్‌మిత్రా ప్రశ్నించగా ఆయనపై కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అసభ్య పదజాలంతో దూషించాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్ఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర కీలకం'
హైదరాబాద్ : పాత్రికేయులు తమ బాధ్యతలు నిజాయితిగా చేపట్టాలంటే స్వామి వివేకానందుడి బోధనలను గుర్తుపెట్టుకోవాలని పయనీర్ చీఫ్ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్రా సూచించారు. సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనది అని భావించిన స్వామి వివేకానంద ఆశయాలను కాపాడేందుకు యువత, ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చందన్ మిత్రా శనివారమిక్కడ మాట్లాడారు. సమాచార్ భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ల పాత్రికేయులు హాజరయ్యారు.