ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం తెలుగులో ప్రచురించిన శిలాఫలకం సీఆర్‌డీఏ ఆఫీస్‌లో ఒక మూలన మూలుగుతుందని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వతీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా దాన్ని బయటకు తీసి రాజధాని ప్రారంభోత్సవ శిలాఫలకం పక్కన పెట్టాలన్నారు.