భూముల సెటిల్‌మెంట్లలో సీఎం కేసీఆర్ కుటుంబం మునిగిపోయిందని మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన సోమవారం మాట్లాడుతూ కేసీఆర్ కూతురు భూముల సెటిల్‌మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ, కొడుకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారన్నారు.