- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ప్రస్తుతం ఏ పార్టీలో లేక ఖాళీగా ఉన్న అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇతర పార్టీల్లో చేరేందుకే క్రైస్తవులకు శ్మశానవాటిక కోసం డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి క్రైస్తవులకు కనీసం శ్మశానవాటిక స్థలాన్ని కూడా కేటాయించలేకపోయారని విమర్శించారు.
ఎన్నికల ముందు గర్జనలు ఏర్పాటుచేసి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు క్రైస్తవుల పేరువాడుకుని శ్మశానవాటిక కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌కు చెందిన రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాల ఉన్న స్థలం ఏఈఎల్‌సీకి చెందినదేనని, దానిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ స్థలంలో ఒక ఎకరాన్ని క్రైస్తవుల శ్మశానవాటిక కేటాయించి, ఆ తరువాత క్రైస్తవుల శ్మశానవాటిక కోసం పోరాటం చేయాలని హితవు పలికారు.పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఇతర పార్టీల్లో చేరేందుకే హర్షకుమార్ శ్మశానవాటిక డ్రామా
Published Fri, Jul 24 2015 2:30 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement