Krishnareddy
-
కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్యపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’ -
టీఎస్పీఎస్సీలో ఒకే ఒక్కడు!
హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో కీలక భూమిక పోషించే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో కోరం కరువైంది. కొత్తగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అవసరమైన సంఖ్యలో సభ్యులు లేకుండా వెలవెలబోతోంది. గత నెల వరకు చైర్మన్, ఒక సభ్యుడితో ఉన్న కోరం.. ప్రస్తుతం ఇన్చార్జి చైర్మన్‌కు పరిమితమైంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో సభ్యులెవరూ లేరు. తెలంగాణ వచ్చాక ఏర్పాటైన టీఎస్పీఎస్సీకి తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. సభ్యులుగా సి.విఠల్, చంద్రావతి, కృష్ణారెడ్డి, సాయిలును ప్రభుత్వం నియమించింది. గతేడాది డిసెంబర్లో ఘంటా చక్రపాణి, చంద్రావతి, సి.విఠల్ పదవీ కాలం పూర్తయింది. దీంతో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగలడంతో సీనియర్ సభ్యుడైన కృష్ణారెడ్డిని ఇన్చార్జ్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. మార్చి 18తో కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తయింది. దీంతో ఖాళీగా ఉన్న చైర్మన్ స్థానంలో సభ్యుడు సాయిలును ప్రభుత్వం ఇన్చార్జి చైర్మన్‌గా నియమించడంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కోరం లేకుంటే.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడాలంటే కమిషన్‌లో కోరం తప్పనిసరి. చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటేనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో ఒకే ఒక్కరు మిగలడంతో నోటిఫికేషన్లు వెలువడంపై అయోమయం నెలకొంది. టీఎస్పీఎస్సీని గత 3 నెలలుగా ఇన్చార్జి చైర్మన్‌తోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం వెలువడట్లేదు. కాగా, ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీలకు సంబంధించి శాఖల వారీగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. వీటికి ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా.. 50 వేల ఉద్యోగాల భర్తీపై ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తే శాఖల వారీగా ఇండెంట్లు వెలువడతాయి. ఇండెంట్లు వచ్చాక నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ నోటిఫికేషన్ల విడుదలకు టీఎస్పీఎస్సీలో కోరం లేదు. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్షేత్ర స్థాయిలో సందిగ్ధం వీడట్లేదు. టీఎస్పీఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 39,952 పోస్టుల భర్తీకి అనుమతులు రాగా.. అన్ని వివరాలు అందిన 36,758 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించగా, 35,724 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 31,062 మంది ఉద్యోగాల్లో చేరగా.. మిగతా ప్రక్రియ కొనసాగుతోందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. -
వేధింపుల రాజ్యం!
-
మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసు
సాక్షి, గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసు బనాయించి, మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మహిళను మోసం చేశారంటూ పోలీసులు...ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో టీజీవీ కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీజీవీ కృష్ణారెడ్డి భార్య అన్నపూర్ణ మాట్లాడుతూ... ‘ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీ రావడంతోనే ఫోన్ల కోసం ఇళ్లంతా తిరిగారు. ఫోన్లు స్విచ్ఛాప్ చేయాలని బెదిరించారు. బాత్రూంలో ఉన్న ఆయనను (కృష్ణారెడ్డి) తక్షణమే తమతో రావాలని ఒత్తిడి చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే డీఎస్పీ ఆదేశాల మేరకే అరెస్ట్ చేస్తున్నామన్నారు. కేసు విషయాల గురించి ఏమీ చెప్పలేదు. జనవరి నుంచి కేసులతో నా భర్తను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సినిమాయే దైవం.. బలం.. బాధ్యత
‘‘ఇటీవల యూనిట్ అంతా ‘ఏంజెల్’ సినిమా చూశాం. చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. ఆఫ్ స్క్రీన్ చేసి వర్క్‌ని స్క్రీన్‌పైన చూస్తే వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. దాన్నే ప్యాషన్ అంటారు’’ అని నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా రాజమౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘ఏంజెల్’ నవంబర్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ నాకు సినిమానే దైవం, బలం, బాధ్యత. ‘ఏంజెల్’ సినిమా బావుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం సంతోషంగా ఉంది. నాగ అన్వేష్ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూసి, త్వరలోనే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ‘ఏంజెల్’ సినిమా బిజినెస్ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. తెలుగులో నవంబర్ 3న రిలీజ్ చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారం లేదా రెండు వారాల గ్యాప్‌తో అక్కడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఇతర పార్టీల్లో చేరేందుకే హర్షకుమార్ శ్మశానవాటిక డ్రామా
- వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ప్రస్తుతం ఏ పార్టీలో లేక ఖాళీగా ఉన్న అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇతర పార్టీల్లో చేరేందుకే క్రైస్తవులకు శ్మశానవాటిక కోసం డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పినిపే కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండి క్రైస్తవులకు కనీసం శ్మశానవాటిక స్థలాన్ని కూడా కేటాయించలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ముందు గర్జనలు ఏర్పాటుచేసి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు క్రైస్తవుల పేరువాడుకుని శ్మశానవాటిక కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్కు చెందిన రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాల ఉన్న స్థలం ఏఈఎల్‌సీకి చెందినదేనని, దానిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ స్థలంలో ఒక ఎకరాన్ని క్రైస్తవుల శ్మశానవాటిక కేటాయించి, ఆ తరువాత క్రైస్తవుల శ్మశానవాటిక కోసం పోరాటం చేయాలని హితవు పలికారు.పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. -
ఆయన్ను ఇరిటేట్ చేశాను!
‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో ‘నాన్నా.. పూలు’ అని తండ్రిని ఏడిపించిన బుడతడు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు తనే హీరోగా మన ముందుకు రానున్నాడు. నాగ అన్వేష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘వినవయ్యా రామయ్య’ నేడు తెరకొస్తోంది. ‘సిందూరపువ్వు’వంటి ఘనవిజయం అందించిన నిర్మాత కృష్ణారెడ్డి తనయుడే ఈ నాగ అన్వేష్. తనయుడు హీరోగా రామ్‌ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక, నాగ అన్వేష్ చెప్పిన ముచ్చట్లు.. *** చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అరుణ్ పాండ్యన్ హీరోగా చేసిన ఓ సినిమాలో బాలనటుడిగా చేశా. ఆ సినిమా పేరు గుర్తు లేదు. ఆ సినిమా చూసి, ఈవీవీ సత్యనారాయణగారు నన్ను ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ సినిమాకి తీసుకున్నారు. ఆ సినిమా సెట్లో తెగ అల్లరి చేసేవాణ్ణి. ఇక వెంకటేశ్ అంకుల్నైతే ఆన్ స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇరిటేట్ చేసేవాడిని. సౌందర్య ఆంటీ కూడా బాగా గారం చేసేవారు. ఆ చిత్రం తర్వాత ‘ఆయనగారు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, సైనికుడు (సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం), ‘సాహసబాలుడు విచిత్రకోతి’ చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, చదువు కొనసాగించాను. *** నేను సీబీఐటీలో బీటెక్ చేశాను. కాలేజీలో కూడా నా మనసంతా సినిమాల పైనే. మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయడంతో హీరోగా అడుగులు వేయాలనుకున్నాను. దాంతో యాక్టింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు రామ్‌ప్రసాద్‌గారు ఈ కథ చెప్పారు. కథ బాగుండటంతో నాన్న ఓకే అన్నారు. *** ఈ చిత్రంలో బ్రహ్మానందం అంకుల్ కాంబినేషన్లో నటించాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను హీరో అవుతానని చెప్పగానే... ‘హీరో అంటే ఎలా ఉండాలి? ఎలాంటి కథలు తీసుకోవాలి?’ అనే అంశాల గురించి చెప్పారు. బ్రహ్మానందంగారు నాకు గురువులాంటివారు. ప్రకాశ్రాజ్గారైతే ఏ సీన్లో ఎలా నటించాలి? అనే అంశాలపై చాలా సూచనలు, సలహాలు ఇచ్చారు. వాళ్లతో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. *** రామ్‌ప్రసాద్‌గారు ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. లవ్ ట్రాక్, కామెడీతో సకుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు స్క్రిప్టే హీరో. ఈ సినిమా షూటింగ్ చాలా ఆహ్లాదంగా గడి చిపోయింది. నేను, కృతిక చిన్నవాళ్లమైనా చిత్ర బృందం అంతా చాలా బాగా సహకరించారు. పతాక సన్నివేశాల్లో ఆ అమ్మాయి నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. వినాయక్గారైతే నన్ను ఇంటికి పిలిచి. నా యాక్టింగ్‌ను అభినందించారు. నాకు అల్లు అర్జున్ డాన్స్‌లు, నటన అంటే చాలా ఇష్టం. ‘రేసుగుర్రం’ సెట్లోనే అల్లు అర్జున్ గారిని కలిశాను. బ్రహ్మానందం గారే నన్ను ఆయనకు పరిచయం చేశారు. నాన్నగారు నిర్మాత అయినప్పటికీ నాకు నిర్మాణ రంగం మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. -
హృదయాలను కొల్లగొట్టాలి : సీతారామశాస్త్రి
‘‘ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తడానికి శక్తివంచన లేకుండా శ్రమించిన పని రాక్షసుడు ఈవీవీ. ఎన్నో మంచి సినిమాలు అందించాడు. ఇప్పుడాయన కుమారులు ఈవీవీ సినిమా పతాకంపై మళ్లీ సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ ‘బందిపోటు’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. కల్యాణ్ కోడూరి స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. సినిమా విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేస్తారనీ, పరాజయంపాలైతే ఎత్తి కుదేస్తారనీ, దేనికీ పొంగిపోకూడదని, కుంగిపోకూడదని వీవీగారు అన్న మాటలు తనకెప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని రాజమౌళి చెప్పారు. ఈవీవీకీ, తనకూ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కృష్ణారెడ్డి అన్నారు. ఈవీవీ సంస్థ మళ్లీ చిత్రాలు నిర్మించడం, అది కూడా తన దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో ఆరంభం కావడం ఆనందంగా ఉందని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘‘మా నాన్నగారు మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో ఈ సంస్థను నిలబెట్టడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడతాం’’ అని నరేశ్ అన్నారు. ఈ వేడుకలో నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, చలపతిరావు, నాని, సందీప్ కిషన్, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, దామోదరప్రసాద్, దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, హరీశ్ శంకర్, జి. నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.