
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు.
'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’
Comments
Please login to add a commentAdd a comment