Severe
-
ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్ ఛాంబర్‌గా రాజధాని!
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు ఇది తేలింది. తాజా చిత్రాలను చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. Today, Delhi’s daily average AQI clocked 418 as per the 4 PM AQI Bulletin by CPCB. The CAQM Sub-Committee on GRAP accordingly took stock of the air quality scenario and the AQI forecast, including for the meteorological conditions as made by IMD/ IITM.Cont. (1/5)— Commission for Air Quality Management (@CAQM_Official) November 13, 2024గ్యాస్ ఛాంబర్‌గా రాజధానిదేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్గఢ్లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ‘తీవ్రమైన’ కేటగిరిలో గాలి నాణ్యత సూచీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను అధిగమించి ‘తీవ్రమైన కేటగిరి’లోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. బుధవారం ఢిల్లీలో గాలి నాణ్యత 429గా నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం AQI 334 వద్ద ఉండగా కేవలం 24 గంటల్లోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో బుధవారం 30 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నాయి.మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు నగరం యొక్క గాలి నాణ్యత 'చాలా పేలవంగా' ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యానికి అతిపెద్ద కారణంగా( 15.4 శాతం) మారింది. దీనికితోడు పంజాబ్, హర్యానా వంటి చుట్టుపక్కల రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలబెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది, నగరాన్నికాలుష్యపు పొగమంచులో కప్పేసింది.కాగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైనదని.. ఇక 450 కంటే ఎక్కువఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. -
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత -
తీవ్ర తుఫానుగా హమూన్.. ఏడు రాష్ట్రాలకు అలర్ట్
ఢిల్లీ: 'హమూన్' తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉందని స్పష్టం చేసింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 290 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు నైరుతి దిశలో 230 కి.మీ దూరంలో ఉందని వెల్లడించింది. బుధవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరానికి చేరడాని కంటే ముందే 'హమూన్' బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 25 నాటికి మళ్లీ తుఫానుగా మారుతుంది. గాలి వేగం గంటకు 65 నుంచి 75 కి.మీ వరకు ఉంటుందని ఐఎమ్‌డీ తన తాజా నివేదికలో తెలిపింది. దాదాపు ఏడు రాష్ట్రాల్లో వర్షపాతం హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను కూడా కోరింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్యపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’ -
డ్రైన్లు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్. భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు. ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ. water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92 — Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023 -
గుజరాత్ అలెర్ట్.. తీవ్రరూపం దాల్చనున్న బిపర్ జాయ్ తుఫాను
గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు చెబుతోంది ఐఎండీ శాఖ. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర - కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు తెలిపారు ఐఎండీ శాఖ అధికారులు. రానున్న ఐదు రోజులు.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా పెను తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి గంటకు 170 కి.మీ కంటే వేగాంగా బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వారు తెలిపిన వివరాల ప్రకారం తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ జూన్ 15 నాటికి గుజరాత్ పాకిస్తాన్ తీరాన్ని తాకే అవకాశముందన్నారు. గుజరాత్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి మరింత తీవ్రమవుతుందన్నారు. అలెర్ట్.. అలెర్ట్.. కాబట్టి తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే పర్యాటక కేంద్రమైన తితాల్ బీచ్‌లో కెరటాల ఉధృతి ఎక్కువవడంతో పర్యాటకులు సందర్శించకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లోని జాలరులను వేటకు వెళ్లవద్దని కూడా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల వెంబడి అత్యవసర సేవలందించడానికి ముందుగానే విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపించారు. ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? -
Dengue: డేంజర్ డెంగీ
1,205 రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన డెంగీ కేసులు 432 ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే నమోదైనవి డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట్, హన్మకొండ, ఖమ్మం. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వనపర్తి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్. గ్రేటర్లో ఫీవర్.. టెర్రర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధులు కోరలు చాస్తున్నాయి. కరోనా కేసులు ఒకవైపు నమోదు అవుతుండగా, మరోవైపు విషజ్వరాలు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగీ అత్యంత తీవ్రతలో 12 జిల్లాలు ఉండగా, మలేరియా అత్యంత తీవ్రతలో 11 జిల్లాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. అత్యంత తీవ్రత జిల్లాల్లోనే 70 శాతం మేర డెంగీ, మలేరియా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్తున్నా, కొన్ని జిల్లాల్లో వైద్య యంత్రాంగం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీగా కేసులు... రాష్ట్రంలో డెంగీ, మలేరియాతో పాటు చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో నీరు నిలిచినచోట్ల దోమలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. దీంతో దోమల కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాతో జనం ఆందోళన చెందుతుంటే, దానికి డెంగీ, మలేరియా తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా నమోదు అవుతాయని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. జ్వరాల కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనా లేదా డెంగీ జ్వరమో అర్థంగాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా, డెంగీతో వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఆసుపత్రుల తీరు మారడంలేదు. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 50 వేల వరకు గుంజుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 40 వేల లోపు ప్లేట్లెట్లు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ 50 వేలున్నా కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. దోమల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే పరీక్షలు చేయించుకోండి జ్వరం ఉన్నవాళ్లు వైద్యున్ని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశముంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరగకుండా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పెద్దాసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయి. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. లక్షణాలున్నవారు ఆయా కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి
మాయదారి మహమ్మారి జన సమూహంలోకి చొచ్చుకొచ్చేసిందా?.. కరోనా వైరస్ ఇకపై ఎవరికి, ఎక్కడ, ఎలా సోకిందో గుర్తించడం కష్టమేనా?.. వచ్చే నాలుగైదు వారాలు గడ్డు కాలమేనా?.. కరోనా వైరస్ ఇక స్వైరవిహారం చేయనుందా?.. గురువారం వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్ తీవ్ర రూపం దాల్చినట్టే కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లింది. ఎక్కడుందో, ఎలా సోకుతుందో పసిగట్టడం కష్టం. కంటికి కనిపించని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి. తక్షణమే గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం ద్వారానే కరోనా నుంచి బయట పడగలం. తీవ్రత పెరిగితే ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు’ అని వైద్యశాఖ సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలపై గురువారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఇందులోనూ దీర్ఘకాలిక సమస్యలతో చనిపోయే వారే అధికంగా ఉన్నా రన్నారు. కరోనా వైరస్‌కు భయపడవద్దని, జాగ్రత్తలు పాటించి సహజీవనం చేయడమొక్కటే మన ముందున్న మార్గమన్నారు. ఈ వైరస్ ప్రభావం ఎన్నిరోజులుంటుందో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను పెంచుతున్నామని, ఇటీవల రెండు లక్షల కిట్లు తెప్పించగా వాటితో పరీక్షలు చేశామని, మరో రెండు లక్షల కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ 3 సూత్రాలే శ్రీరామ రక్ష వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం.. ఇవి తప్పక ఆచరించాలన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉందని, దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, కొత్త జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా చికిత్సను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అప్పుల పాలే.. బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, లాక్డౌన్ నేపథ్యంలో మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే అప్పుల పాలవుతారని డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక చికిత్స లేదని, లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలని, ఇది చాలా సింపుల్ పద్ధతి అని అన్నారు. చిన్న లక్షణం కనిపించినా డాక్టర్ వద్దకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,200 పడకలు ఉన్నాయని, మొత్తంగా 15 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. లక్షణాలు ఉన్న వారంతా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఈ మేరకు అన్ని పీహెచ్‌సీల్లో కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజూ సగటున 15 వేల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వీటిని 20–25 వేలకు పెంచుతామన్నారు. కరోనా బారిన వెయ్యి మంది వైద్య సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న దాదాపు వెయ్యికి పైగా వైద్య సిబ్బంది వైరస్ బారినపడ్డారని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కోర్టుల్లో గడియకో పిల్ వేస్తే ఎలా పనిచేస్తామని, ఇది మంచి పరిణామం కాదన్నారు. వైద్య సిబ్బందికి అన్ని వర్గాలు మద్దతు పలకాలని, కరోనా బాధితులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, స్థానికంగానే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. బాధితుల్ని అవసరమైతే 108 అంబులెన్స్‌ల్లో నగరంలోని ఆస్పత్రులకు తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని ఆయన చెప్పారు. ఇటు ‘సీజనల్’ దాడి.. అటు కరోనా పంజా కరోనా వైరస్‌తో కొత్త చిక్కొచ్చిపడింది. అసలే వర్షాకాలం.. జలుబు, వైరల్ జ్వరాలు పంజా విసిరే సమయం. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలకు స్వైన్‌ఫ్లూ కూడా తోడైంది. సీజనల్ వ్యాధులకు..కరోనా వైరస్‌కు కామన్ సింప్టమ్ జ్వరమే. దీంతో ఎవరు ఏ జ్వరంతో బాధపడుతున్నారో గుర్తించడం కష్టం కానుంది. ఇప్పటికే గాంధీ సహా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చింది. మున్ముందు కేసులు భారీగా పెరుగుతాయనే వైద్య ఆరోగ్యశాఖ అంచనాలతో ఇప్పటి వరకు టెస్టింగ్, ఐసోలేషన్ సెంటర్లుగా ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయి కోవిడ్ కేంద్రాలుగా మార్చుతున్నట్టు ప్రకటించడంతో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు చికిత్సలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఇక్కడ మార్చి 2న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత వీటి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. దీంతో జూన్‌లో 11,080 కేసులు, జూలైలోని 22 రోజుల్లోనే 21,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున 800–1,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కన్పించట్లేదని అంచనా. దీంతో తమకు తెలియకుండానే వీరు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్ను నిలిపివేసింది. ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య విధాన పరిషత్ ద్వారా నిర్వహిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లకు బకాయిలన్నీ చెల్లించాలని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు మొదలు పెట్టాలని, శానిటేషన్, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్ర కార్యాలయ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తెలిపారు. -
బాబోయ్.. కరోనా!
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ స్టాక్ మార్కెట్లు కకావికలం అయిపోయాయి. చైనాలో మొదలైన కరోనా ప్రభావం ఇతర దేశాలకూ విస్తరిస్తోందన్న భయాలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 41,200 పాయింట్లు, నిఫ్టీ 12,150 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బడ్జెట్ మరో వారం రోజుల్లోనే ఉండటంతో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. బ్యాంక్, లోహ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 71.44(ఇంట్రాడే)కు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 3 శాతం మేర పతనమైనా, మార్కెట్‌పై అది ఏమంత ప్రభావం చూపించలేకపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 458 పాయింట్లు పతనమై 41,155 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 1.1 శాతం, నిఫ్టీ 1.06 శాతం మేర క్షీణించాయి. ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌కు గత నాలుగు నెలల్లో ఇదే రెండో పెద్ద పతనం. సెన్సెక్స్, నిఫ్టీలు నెల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల వెల్లువ సెన్సెక్స్ నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఆర్థిక మందగమనం కారణంగా భారత ఆదాయపు పన్ను, కార్పొరేట్ ఆదాయం గణనీయంగా తగ్గనున్నాయన్న వార్తలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత లార్జ్‌క్యాప్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో నాలుగు రోజుల్లో ముగియనుండటం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 491 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల మేర నష్టపోయాయి. విస్తరిస్తున్న కరోనా వైరస్... చైనాలోని వూహన్ నగరంలో ప్రబలిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 80 మంది మృతి చెందారు. 2,700 మందికి పైగా ఈ వైరస్ సోకి ఉంటుందని, వీరిలో 450 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. చైనాలోనే కాకుండా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, జపాన్ తదితర దేశాలకు ఈ వైరస్ వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మరింతగా మందగించగలదనే భయాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. చాంద్రమాన కొత్త సంవత్సరాది సెలవు కారణంగా పలు ఆసియా మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ నికాయ్ సూచీ 2 శాతం పతనమైంది. యూరప్ మార్కెట్లు 2–2.5 శాతం నష్టాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు ఒకానొకదశలో 2% నష్టాల్లోకి జారిపోయాయి. లోహ షేర్లు విలవిల... కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, లోహాలను అధికంగా వినియోగించే చైనాలో తీవ్రమైన ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో లోహ షేర్లు క్షీణించాయి. జిందాల్ స్టీల్, సెయిల్, వేదాంత, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్ఎమ్డీసీ, హిం దుస్తాన్ కాపర్, హిందుస్తాన్ జింక్, హిందాల్కో షేర్లు 3–6% రేంజ్లో నష్టపోయాయి. ఏడాది గరిష్టానికి వందకు పైగా షేర్లు స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయికి చేరడం విశేషం. వీటిల్లో 50కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. పీవీఆర్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బెర్జర్ పెయిం ట్స్, దివీస్ ల్యాబ్స్, డాబర్ ఇండియా, డాక్టర్ పాథ్‌ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఐనాక్స్ లీజర్, జేకే సిమెంట్, జుబిలంట్ ఫుడ్ వర్క్స్, మణప్పురమ్ ఫైనాన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరిన్ని విశేషాలు... ►టాటా స్టీల్ 4.3 శాతం నష్టంతో రూ.462 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ►30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు నష్టపోగా, 9 షేర్లు మాత్రం లాభపడ్డాయి. ►హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 2.2–2.5% మేర నష్టపోయాయి. సెన్సెక్స్ మొత్తం 458 పాయింట్ల నష్టంలో ఈ రెండు షేర్ల వాటాయే 216 పాయింట్ల మేర ఉంది. ►ఈ క్యూ3లో ఆదాయం 14 శాతం మేర పెరగడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.3,188 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ►మూడేళ్ల తర్వాత ఈ క్యూ3లోనే లాభాల్లోకి రావడంతో ఓకార్డ్ షేర్ 18 శాతం లాభంతో రూ. 353 వద్దకు చేరింది. రూ. లక్ష కోట్ల సంపద ఆవిరి... స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ. లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.03,154 కోట్లు తగ్గి రూ.1,59,24,405 కోట్లకు పడిపోయింది. -
అంతం ఐదు కాదు.. ఆరు!
న్యూయార్క్: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా భూ వినాశనం ఐదు సార్లు కాదు.. ఆరు సార్లు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది 26 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. ఆరు వినాశనాలూ పర్యావరణ విధ్వంసం కారణంగానే చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనం చెంది లావాను వెదజల్లాయని, దీంతో లక్షల చదరపు కిలోమీటర్ల భూమి లావా ప్రవాహంతో నిండిపోయిందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ రాంపినో వెల్లడించారు. భూమి ఇప్పటికే ఆరు వినాశనాలను ఎదుర్కొంది. ఈ ఆరు వినాశనాల్లో పర్యావరణ విధ్వంసం కారణంగా భూమిపై అనేక జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. -
మధ్యాహ్నపుటెండ
ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. ఒక యువకుడు చెరువు వైపు నడుచుకుంటూ పోతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. అతడు చాలా దిగులుగా ఉన్నాడు. తాను అనుకున్నది ఏమీ చేయలేకపోతున్నాననే వేదన అతడిని వెంటాడుతోంది. అదే చింతిస్తూ గట్టున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడో కుక్క అటుగా వస్తోంది. ఎండకు అకరు కొడుతోంది. గట్టు దిగి చెరువు దగ్గరికి వెళ్లింది. అది దప్పికతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నీళ్ల దాకా వెళ్లింది. ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. అది దాని నీడను చూస్తోంది, అది మరో కుక్క అని భ్రమించి, భయపడుతోంది. ఏం జరుగుతుందా అని యువకుడు మరింత కుతూహలంతో చూస్తున్నాడు. కుక్క మళ్లీ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, నీటి దాకా పోయింది. ఈసారి అరుపులో అంత తీవ్రత లేదు. దానికదే ఒక రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా, ముందు కొంచెం అనుమానంగా, తర్వాత తాపీగా నీళ్లను తాగి వెనక్కి వెళ్లిపోయింది. తన నీడను శత్రువుగా భావించిన కుక్క దాన్ని జయించగలిగింది. తాను సాధించవలసిన దానికి తానే అడ్డంకిగా ఉన్నానని నిశ్చయానికి వచ్చిన యువకుడు స్థిరంగా లేచి నిలబడ్డాడు. -
బాల్య వివాహం జరిపిస్తే చర్యలు
తల్లాడ, న్యూస్‌లైన్:బాల్య వివాహం జరిపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఆర్జేడీ ఆర్.సూయజ్ హెచ్చరించా రు. ‘బాల్య వివాహాలు’ అనే అంశంపై తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఆమె మా ట్లాడారు. బాల్య వివాహాలను ప్రోత్సాహిం చిన.. ప్రేరేపించిన.. సహకరించిన వారిపై కూడా చర్య లు తీసుకుంటామని చెప్పారు. పదిమందికన్నా తక్కువ సంఖ్యలో పిల్లలున్న అంగన్వాడీ కేంద్రాన్ని దగ్గరలోని కేంద్రంలో విలీనం చేయనున్నట్టు ఆర్జేడీ ఆర్.సూయజ్ తెలి పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందకపోతే వర్కర్, ఆయాపై చర్య ఉంటుం దని చెప్పారు. కార్యక్రమంలో జేడీ శ్యాం సుం దరి, పీడీ సుఖజీవన్‌బాబు, సీడీపీఓ వరలక్ష్మి, సూపర్వైజర్లు సత్యావతి, ఇందిరాదేవి, తల్లాడ సర్పంచ్ కోటా అరుణ పాల్గొన్నారు. ‘మన ఊరి పిల్లలు... మన పిల్లలు..’ భావనతోనూ బాల్య వివాహాల నిర్మూలన కొణిజర్ల: ‘మనఊరి పిల్లలంతా.. మన పిల్లలే..’ అని, ప్రతి ఒక్కరూ భావించినప్పుడే బాల్యవివాహ వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని ఐసీడీఎస్ కమిషనరేట్ జాయింట్ డెరైక్టర్ కె.శ్యామసుందరి చెప్పారు. ఆమె బుధవారం ఇక్కడ బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ఐసీడీఎస్ ద్వారా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ‘గ్రామ బాలల సంరక్షణ కమిటీ’ పేరతో ఆరు నెలల క్రితం కమిటీలు కూడా వేశామని అన్నారు. పల్లెల్లోని బాల కార్మికులంతా పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. బడి బయటి పిల్లలంతా బడిలో ఉండేలా చూస్తే.. బాలకార్మికవ్యవస్థ అంతమవుతుందని అన్నా రు. ఐసీడీఎస్ వరంగల్ రీజియన్ జాయింట్ డెరైక్టర్(ఆర్జేడీ) ఆర్.సూయజ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో విసృ్తత ప్రచారం జరగాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జి.సుఖజీవన్‌బాబు, సీడీపీఓ జ్యోతిర్మయి, ఏసీడీసీఓ సంధ్య, జీసీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.