
న్యూయార్క్: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా భూ వినాశనం ఐదు సార్లు కాదు.. ఆరు సార్లు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది 26 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. ఆరు వినాశనాలూ పర్యావరణ విధ్వంసం కారణంగానే చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనం చెంది లావాను వెదజల్లాయని, దీంతో లక్షల చదరపు కిలోమీటర్ల భూమి లావా ప్రవాహంతో నిండిపోయిందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ రాంపినో వెల్లడించారు. భూమి ఇప్పటికే ఆరు వినాశనాలను ఎదుర్కొంది. ఈ ఆరు వినాశనాల్లో పర్యావరణ విధ్వంసం కారణంగా భూమిపై అనేక జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment