ఢిల్లీ: 'హమూన్' తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉందని స్పష్టం చేసింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 290 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు నైరుతి దిశలో 230 కి.మీ దూరంలో ఉందని వెల్లడించింది.
బుధవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరానికి చేరడాని కంటే ముందే 'హమూన్' బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 25 నాటికి మళ్లీ తుఫానుగా మారుతుంది. గాలి వేగం గంటకు 65 నుంచి 75 కి.మీ వరకు ఉంటుందని ఐఎమ్‌డీ తన తాజా నివేదికలో తెలిపింది.
దాదాపు ఏడు రాష్ట్రాల్లో వర్షపాతం హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను కూడా కోరింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!
Comments
Please login to add a commentAdd a comment