Bay of Bengal rains
-
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారం తీవ్ర వాయగుండంగా మారింది. ఇది గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు–ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ–ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ–ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, మచిలీపట్ననికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతం వద్ద తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 4వ తేదీ తెల్లవారుజాము వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖతం వరకు చేరుకుంటుందని వివరించింది. ఆ తర్వాత, ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదు రు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వానలు కూడా కురిసే అవకాశం ఉన్న ట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీ సెల్సియస్ మేర గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత హన్మకొండలో 33.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
రాష్ట్రానికి వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ, పరిసర నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఈనెల 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలి 3న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు వివరించింది. ఆ తర్వాత కూడా వాయవ్య దిశగానే ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలోని చెన్నై, మచిలీపట్నం మధ్య ఈనెల 4వ తేదీ సాయంత్రానికి తీరం దాటుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా, రానున్న మూడురోజుల్లో 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్‌లో 17.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. -
బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫాన్ హమూన్
-
అతి తీవ్ర తుఫాన్‌గా ‘హమూన్’
భువనేశ్వర్/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్‌గా మారింది. దానికి ఇరాన్ సూచించిన ‘హమూన్’అని పేరు పెట్టారు. అయితే ఒడిశాకు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి బంగ్లాదేశ్ కేసి సాగుతూ మంగళవారం రాత్రికి బలహీనపడింది. బంగ్లాదేశ్‌లో తీరం దాటేసరికి మరింత బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. హమూన్ ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులు, రాయలసీమలో ఈనెల 29వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుంది. 28 నుంచి కోస్తాంధ్రలో, 30 నుంచి రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చదవండి: నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు -
తీవ్ర తుఫానుగా హమూన్.. ఏడు రాష్ట్రాలకు అలర్ట్
ఢిల్లీ: 'హమూన్' తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉందని స్పష్టం చేసింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 290 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు నైరుతి దిశలో 230 కి.మీ దూరంలో ఉందని వెల్లడించింది. బుధవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరానికి చేరడాని కంటే ముందే 'హమూన్' బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 25 నాటికి మళ్లీ తుఫానుగా మారుతుంది. గాలి వేగం గంటకు 65 నుంచి 75 కి.మీ వరకు ఉంటుందని ఐఎమ్‌డీ తన తాజా నివేదికలో తెలిపింది. దాదాపు ఏడు రాష్ట్రాల్లో వర్షపాతం హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను కూడా కోరింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
బంగాళాఖాతంలో వాయుగుండం! తుపానుగా బలపడే అవకాశం?
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ గమనం బట్టి ఏపీపై కురిసే వర్షాలపై అంచనా. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం
-
మరో రెండు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు 5.43 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వాంకిడిలో రికార్డు వర్షపాతం కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 371 మిల్లీమీటర్లు వర్షపాతం నమెదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరిగి వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్, మల్కాజ్గిరి, కాప్రా, ఏఎస్రావు నగర్లో వర్షం కురుస్తోంది. వాయుగుండం రానున్న 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశాగా ప్రయాణించి ఈనెల 12వ తేదీ రాత్రి ఉత్తర ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్, విశాఖపట్నం తీరప్రాంతాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి , నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలలోని ఒకట్రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 14న మరో అల్పపీడనం... బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఈనెల 12వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో ఈనెల 14న ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో సుమారు అక్టోబరు 14న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈమేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు కురిసన వార్షాలతో మెజార్టీ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండినందున అలుగు పారే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించాలని, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు సైతం చేసుకోవాలని స్పష్టం చేసింది. -
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం
-
మూగజీవాల మరణమృదంగం
పెథాయ్ తుఫాన్ జిల్లాలో మూగజీవాల పాలిట మృత్యువుగా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో 990 పశువులు మృతి చెందాయి. వీటిలో ఆవులు, లేగదూడలు, గొర్రెలు, మేకలు తదితరమైనవి ఉన్నాయి. వీటి మృతితో రూ.లక్షల్లో నష్టం సంభవించింది. పశుసంవర్ధక శాఖ అంచనాల మేరకు మంగళవారం నాటికి 20 గేదెలు, 18 దూడలు, పది ఎద్దులు, 618 మేకలు, 324 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెంపకందారులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. విజయనగరం ,గరివిడి: పెథాయ్ తుఫాన్ గొర్రెల పాలిట యమపాశమైంది. తుఫాన్ చలిగాలులకు మండలంలో 95 గొర్రెలు చనిపోయినట్టు రెవెన్యూ, పశు వైద్యాధికారులు గుర్తించారు. ఒక్క కుమరాం గ్రామంలోనే 71 గొర్రెలు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన వైగాల రాముడు, వైగాల పెద్దోడు, డొప్ప చిన్నయ్య, డొప్ప కర్రి అప్పయ్య, డొప్ప తాత, డొప్ప తవుడు, తొండ్రంగి తాత, వైగాల మాలచ్చి, వైగాల అప్పమ్మలకు చెందిన గొర్రెలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెదుళ్లవలస గ్రామంలో బందపు సత్యవతి, బందపు ఈశ్వరరావు, బందపు చిన్నయ్య, బందపు రాములు, వాకాడ అప్పయ్య, దువ్వాన నందినలకు చెందిన గొర్రెలు చనిపోయాయి. కొండశంభాం గ్రామంలో లెంక అసిరినాయుడుకు చెందిన గొర్రెలు చనిపోయాయి. మండలం మొత్తం తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక 95 గొర్రెలు చనిపోయినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ కె.సుభాష్‌బాబు, పశువైద్యాధికారిణి డాక్టర్ కమలకుమారి తెలిపారు. సతివాడలో 108 గొర్రెలు... తెర్లాం: మండలంలోని సతివాడ గ్రామానికి సమీపంలో మామిడితోటలో గొర్రెల మందల్లోని 108 గొర్రెలు, పిల్లలు తుఫాన్ వల్ల వీచిన గాలులకు చల్లి తట్టుకోలేక మృతి చెందాయి. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన 11 మంది గొర్రెల కాపరులు వారి గొర్రెల మందలను సతివాడ గ్రామంలో మంద కాసేందుకు తీసుకొచ్చారు. పెథాయ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలు వీచిన గాలులకు సోమవారం రాత్రి మృతి చెందాయి. పేరిపికి చెందిన బాగు చినప్పయ్య, రామప్పమ్మ, లక్ష్మి, శ్రీదేవి, సూర్యకళ, గంగిమ్మ, రామప్పమ్మ, కాకి రాములమ్మ, సూరీడు, చినప్పమ్మ, రాములమ్మ, ఆదిలక్ష్మిలకు చెందిన 108 గొర్రెలు, పిల్లలు చనిపోయాయి. మంగళవారం మందను వేరే ప్రాంతానికి తరలించేందుకు చూడగా అవి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రామస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాలు తెలుసుకున్నారు. చీపురుపల్లికి చెందిన మండల పశువైద్యాధికారితో పాటు గోపాలమిత్రలు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. చలితో.. చీపురుపల్లి రూరల్: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని రావివలస గ్రామంలో పొదిలాపు గణపతికి చెందిన రెండు గేదె దూడలు మృతి చెందాయి. ఇదిలా ఉండగా అలజంగి పంచాయతీ పరిధి ఎలకలపేట గ్రామం కాకి సూర్యనారాయణకు చెందిన 15 గొర్రెలు రాజాం సమీపంలో గల అగూరు కంచరాం వద్ద చలి తీవ్రతతో మృతి చెందాయి. చలి గాలులకు 17 గొర్రెలు... శృంగవరపుకోట రూరల్: తుఫాన్ చలిగాలులకు తట్టుకోలేక మండలంలోని కొట్టాం గ్రామంలో 17 గొర్రెలు మృతి చెందినట్టు గ్రామ రెవెన్యూ అధికారి గణేష్ మంగళవారం తెలిపారు. కొట్టాం గ్రామానికి చెందిన నెక్కళ్ల అబద్ధం, నెక్కళ్ల రాములమ్మ, టేకుబోయిన ఎర్నాయుడు తమ గొర్రెల మందలను విశాఖ జిల్లా పెందుర్తి మండలం, పెదగాడ గ్రామాని కి మందకు తీసుకువెళ్లారు. సోమవారం రాత్రి వీచిన గాలులకు 17 గొర్రెలు మృతి చెందాయి. తహసీల్దార్ ఎం.అరుణకుమారికి సమాచారం అందజేశారు. 32 మూగజీవాలు మృతి సాలూరు రూరల్: పెథాయ్ తుఫాన్ వల్ల వీచిన చలి గాలులకు సాలూరు, పాచిపెంట మండలాల్లో సుమారు 32 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో 2, పాచిపెంట మండలంలో 30 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో దుగ్దిసాగరం పంచాయతీలో పుల్లేరిగుడ్డివలసలో 1 ఆవు, ఒక దూడ మృతి చెందాయి. పాచిపెంట మండలంలో పద్మాపురం, కేసలి, కొటికిపెంట, పనుకువలస, బొర్రమామిడి పంచాయతీల్లో తెట్టేడివలసలో 4 మేకలు, కేసలిలో 2 గొర్రెలు, కోష్టువలసలో 4 గొర్రెలు, పెదచీపురువలసలో 4 మేకలు, బడ్నాయికవలసలో 2 ఆవులు, రాయివలసలో 1 మేక, 3 ఆవులు, బొర్రమామిడిలో 1 ఆవు, చినచీపురువలసలో 1 మేక, బడేవలసలో 6 మేకలు, సేరిగుడ్డిలో ఆవు దూడ, మెట్టగుడ్డిలో 1 మేక మృతి చెందినట్లు ఇన్చార్జి తహసీల్దార్ కుప్పిలి నాగేశ్వరరావు తెలిపారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పర్యటించి దర్యాప్తు నిర్వహించారు. చలి తీవ్రతతో.. మెంటాడ: ఈదురు గాలులతో ప్రారంభమైన పెథాయ్ తుఫాన్ చలికి తట్టుకోలేక పోరాంలో నాలుగు, ఉద్దంగిలో నాలుగు, జయితిలో 8, చింతలవలస ఆరు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. సవరివల్లిలో రెండు ఎద్దులు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు. 22 గొర్రెలు మృతి గుర్ల: పెథాయ్ తుఫాన్ వల్ల రెండు రోజులుగా వీస్తున్న చలి గాలులకు 22 గొర్రెలు మృతి చెందాయి. మణ్యపురిపేటలో 14 గొర్రెలు, గుర్లలో 8 గొర్రెలు, చింతలపేటలో ఎద్దు మరణించాయి. రెండు రోజులుగా చలితీవ్రత అధికంగా ఉండడం వల్ల చలికి తట్టుకొలేక మరణించినట్లు పశువైద్యాధికారులు మంగళవారం తెలిపారు. గుర్లలోని గొర్రెల కాపరులను ఎంపీడీవో ఆమంచి కామేశ్వరరావు, ఈవోపీఆర్డీ అల్లు భాస్కరరావు పరామర్శించారు. గొర్రెల మృతి చెందిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహరం అందేలా చర్యల తీసుకుంటాం ఎంపీడీవో హమీ ఇచ్చారు. మృతి చెందిన పశువులు బొబ్బిలి రూరల్: పెథాయ్ తుఫాన్‌తో వీచిన చలి గాలులకు కారాడలో వై.గంగయ్య, వై.అప్పలస్వామిలకు చెందిన చెరో మేక మృతి చెందగా మెట్టవలసలో ఒక మేక చనిపోయింది. నారశింహునిపేటకు చెందిన పి.లకు‡్ష్మనాయుడుకు చెందిన ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. పెంపకందారులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని పశువైద్యులు సుధాకర్, అనిత తెలిపారు. లెంకపేటలో... మెరకముడిదాం: మండలంలోని గర్భాం మేజర్ పంచాయతీ పరిధిలో గ్రామమైన లెంకపేట గ్రామంలో పెథాయ్ తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక గ్రామానికి చెందిన కోరాడ చిన్నయ్యకు చెందిన ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటూ ఈదురు గాలుల వల్ల గొర్రెలు మృతి చెందాయి. -
తగ్గిన వానలు... పెరిగిన చలిగాలులు...
విజయనగరం గంటస్తంభం: పెథాయ్ తుఫాన్ తీరం దాటినా... చలిగాలులు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఉష్టోగ్రతలు తగ్గడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ సోమవారం కాకినాడ వద్ద ఒకసారి, తుని వద్ద రెండోసారి తీరందాటిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం వల్ల జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి నుంచి మొదలైన వర్షాలు సోమవారం తీవ్రరూపం దాల్చి ఆర్ధరాత్రి వరకు పడ్డాయి. తర్వాత తగ్గుముఖం పట్టి మంగళవారం ఉదయానికి ఆగాయి. తర్వాత వాతావరణం పూర్తిగా మారి వెలుతురు వచ్చింది. అయితే సాయంత్రం మాత్రం మళ్లీ గాలి చినుకులు, చిరుజల్లులు జిల్లాలో చాలాచోట్ల పడ్డాయి. 8.7సెంటీమీటర్ల వర్షపాతం తుఫాన్ మూలంగా జిల్లాలో ఏకంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 16వ తేదీ రాత్రి నుంచి వర్షాలు పడటంతో17వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు 3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు కురిసిన వర్షాలకు 84.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఏకధాటిగా 87.1మిల్లీమీటర్లు(8.7సెంటీమీటర్లు) వర్షపాతం నమోదు కావడంతో జలం పొంగింది. సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో సరైన వర్షాలు లేవు. దీంతో భూగర్భజలాలు కూడా కిందకు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు పడ్డం జిల్లా ప్రజల కు ఉపశమనం కలిగించే అంశమే. వేసవిలో కొన్నాళ్లపాటు తాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. చలిగాలులతో ఇబ్బంది తుఫాన్ తీరం దాటినా చలిగాలులతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఉదయం చెప్పుకోదగ్గ వర్షాలు జిల్లాలో లేవు. గాలి చినుకులు మాదిరిగా తుంపర్లు పడుతున్నాయి. మరోవైపు ఈదురుగాలుల వాడి తగ్గింది. అయినా చలిమాత్రం పంజా విసురుతోంది. ఉష్టోగ్రతలు ఏకంగా పడిపోయాయి. మంగళవారం ఉదయం జిల్లాలో 21, 20, 19 డిగ్రీలు ఉష్టోగ్రతలు నమోదు కావడం విశేషం. దీంతో చల్లని గాలులు వీయడంతో ఇంట్లో ఉన్నా దుప్పటి కప్పుకోవాల్సి వచ్చింది. లేకుంటే గజగజ వణకుతున్నారు. మరోవైపు ఇంటి బయటకు వస్తే నరకమే. స్వెట్టర్ల, మంకీ క్యాప్లతో చెవులు, ఒళ్లంతా కప్పినా చలిమాత్రం కాయడం లేదు. దీంతో బయటకు రావడానికే జనం భయపడ్డారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలికి తట్టుకోలేక బాడంగి మండలం పాల్తేరులో వృద్ధురాలు వంగపండు పారమ్మ(82)మృతి చెందారు. సోమవారం, మంగళవారం చలిగాలులకు గొర్రెలు, మేకలు, పశువులు మృతి చెందాయని రైతులతోపాటు అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చలి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెథాయ్ తుఫాన్ ఇంకా సముద్రంలో కొనసాగుతోందనీ, ఒడిశా వైపు వెళుతుందని అధికారులు చెబుతున్నారు. అక్కడ తీరం దాటే వరకు చలిగాలులు తప్పవని చెబుతుండడంతో జిల్లా వాసులు అందోళన చెందుతున్నారు. -
అతలాకుతలం
‘పెథాయ్’ జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు విపరీతమైన చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రైతాంగం ‘పెథాయ్’ దెబ్బకు చేష్టలుడిగిపోయింది. కుంభవృష్టిగా కురిసిన వానకు వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. దివిసీమ తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. బలమైన గాలులకు ఆయా ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. పునరావాస కేంద్రాల్లో అంతంత మాత్రంగానే సేవలు అందాయి. సాక్షి, కృష్ణాజిల్లా,మచిలీపట్నం: కొన్ని రోజులుగా బెంబేలెత్తించిన పెథాయ్ తుపాను కాకినాడ–యానం మధ్య తీరం దాటింది. జిల్లాకు తుపాను ముప్పు తప్పడంతో కృష్ణా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 10,000 హెక్టార్లలో పంట నష్టం.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.49 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వరి 2.49 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. ఇప్పటి వరకు 2.03 లక్షల హెక్టార్లలో తుపానుకు ముందే కోత చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 46,000 హెక్టార్లలో పంట కోత, పనలపై ఉన్న దశల్లో ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జి ల్లా వ్యాప్తంగా 10,000 వివిధ రకాల పంటలు నీట ము నిగాయి. అందులో వరి 8,231 హెక్టార్లు నీళ్లపాలైంది. పత్తి 270 హెక్టార్లు, మొక్కజొన్న 430 ఉండగా, మిగి లిన 1069 హెక్టార్లలో మిర్చి తదితర పంటలున్నాయి. జిల్లాలో వర్షపాతం ఇలా.. పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో కుండపోత కురవగా.. అన్ని మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైనే నమోదైంది. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు పరిస్థితిని పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా 69.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మండవల్లిలో 113.4 మిల్లీ మీటర్లు, గుడివాడ 102.2, పెనమలూరు 100.6, పెదపారపూడి 95.4, చల్లపల్లి 91.2, నందివాడ 81.2, గుడ్లవల్లేరు 79.7, అవనిగడ్డ 76.1, ఆగిరేపల్లి 76.4,ముదినేపల్లి 72.8 మొవ్వ మండలంలో 69.2గా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 14.4 మిల్లీ మీటర్లుగా ఉంది. అత్యధికంగా జి.కొండూరులో 54.8 మిల్లీ మీటర్లు, వీరులపాడు 52.1, ఇబ్రహీంపట్నం 40.2, నందిగామ 36.7 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తీరం.. కల్లోలం.. తుపాను తీరం దాటే సమయంలో మంగినపూడి సముద్రంలో అలల కల్లోలం నెలకొంది. అలల ఉద్ధృతికి పెద్దగా శబ్ధాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. నేడు పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న తరుణంలో మంగళవారం సైతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రటించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ♦ బందరు మండలం చిట్టిపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, ఎన్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం చిన్నాపురం, కానూరు, యాదర, పెదపట్నం గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. ♦ వర్షాల కారణంగా గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రి కూడ కుప్పకూలింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గుడివాడ రూరల్ మండలంలో వరి పనలు నీట మునిగాయి. ♦ అవనిగడ్డ మండలం బందలాయిచెరువులో వరి పనలు నీట మునిగాయి. ♦ నూజివీడు మండలంలో వరి పనలు, వరి మోపులు నీట మునిగాయి. బాపూనగర్‌లో చింతచెట్టు నేలవాలింది. తుక్కులూరులో మొక్కజొన్న పంట నీట మునిగింది. దేవరగుంటలో ఈదురు గాలులకు పడిపోయిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. బాలానగర్‌లో ఈదురుగాలులకు వందేళ్ల భారీ వృక్షం నేలకూలింది. ♦ నందివాడ మండలం పుట్టగుంట గ్రామం వద్ద బుడమేరు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ♦ జి.కొండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం పొలాల్లో ఉండటంతో పట్టాలు కప్పుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ♦ ఇబ్రహీంపట్నం మండలంలో వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వాటిని తొలగించుకునేందుకు ఆయిల్ ఇంజిన్లను పెట్టారు. ♦ ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో గ్రామం ముంపునకు గురైంది. ♦ ముసునూరు మండలంలో నీట మునిగిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇంజిన్లతో నీటిని తోడుతున్నారు. కాట్రేనిపాడులో పడిపోయిన నాటు పొగాకు పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పెథాయీ.. నిరాశే!
పెథాయ్ తుపాను కోస్తా జిల్లాలను వణికిస్తూ భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తున్నా నెల్లూరు జిల్లాపై దీని ప్రభావం లేదనే చెప్పాలి. తొలుత తమిళనాడు.. మచిలీపట్నం మధ్య కొనసాగిన తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులందరూ ఆనందపడ్డారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయని ఆశపడ్డారు. రబీకి ఇబ్బంది ఉండదని భావించారు. అయితే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెథాయ్ తుస్సు మనిపించింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి. సాగునీటి కోసం అన్నదాతలు యథావిధిగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా వచ్చిన తుపాన్లు జిల్లా రైతాంగాన్ని నిరాశపరచడం.. లోటు వర్షపాతం నమోదు కావడం.. సాగుకు అవసరమైన నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఏడాదీ జిల్లాలో సాధారణ వర్షపాతమే. నాలుగేళ్లలో వర్షాకాలంలో సైతం జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఈశాన్య, నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జిల్లాలో చినుకు కూడా కురవని పరిస్థితి. దీంతో ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లను నమ్ముకుని కొన్ని ప్రాంతాల్లో రబీ సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తిత్లీ, గజతోపాటు పెథాయ్ తుపానులు వచ్చాయి. అవి కూడా అన్నదాతలను పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో జిల్లాలో సాగు భారంగా మారింది. అన్నదాతలు సతమతమవుతూ ఎక్కువ ఖర్చు నీటి కోసమే కేటాయించి మరీ పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో భాగంగా జిల్లాలో అధికార, అనధికార ఆయకట్టు మొత్తం కలుపుకొని 6.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైన పరిస్థితి. గతేడాది జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. తీవ్ర కరువు ప్రభావం, వర్షాభావం, సోమశిల నుంచి నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో సాగు విస్తీర్ణం 3.5 లక్షల ఎకరాలకు పడిపోయింది. గతేడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవడం, సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో సుమారు 42 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాలకు కేటాయించారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి జిల్లాలో సాగుకు ఎక్కువ నీరు ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువ లేకపోవడంతో డెడ్‌స్టోరేజ్ లెవల్ పోను 32 టీఎంసీల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. డెల్టా ప్రాంతానికే పూర్తిస్థాయిలో నీరు ఇస్తే 24 టీఎంసీలు కేటాయించాల్సి ఉంటుంది. డెల్టా ప్రాంతంలోనే 2.47 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం అధికారికంగా ఉంది. కానీ అధికారులు మాత్రం అంత నీరు ఇవ్వలేమని చేతులెత్తేశారు. కనుపూరు, కావలి, కెనాల్స్ పరిధిలో అనధికార మోటర్ల ద్వారా నీరు పూర్తిగా తోడేయడంతో చివరి భూములకు అందని పరిస్థితి ఉంది. లోటు వర్షపాతం, ఆపై కరువు ప్రభావం జిల్లాలో నాలుగేళ్లుగా లోటు వర్షపాతం నమోదవుతోంది. వాస్తవంగా సాధారణ వర్షపాతం కన్నా 90 శాతం లోటు వర్షపాతం జిల్లాలో నమోదవుతూ వస్తోంది. అయితే అడపాదడపా కురిసే వర్షాల వల్ల కొంత సరాసరి పెరుగుతోంది. గతేడాది జిల్లాలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 62 శాతం దాటింది. తాజాగా పెథాయ్ ప్రభావంతో కేవలం నాలుగు శాతం వర్షపాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. మరోవైపు జిల్లాలో కరువు ఛాయలు కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది ఉదయగిరి ప్రాంతాల్లో సాగుతోపాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడంతో అనేక గ్రామాలకు ట్యాంకర్ల నీరే ఆధారంగా మారింది. గతేడాది జిల్లాలో 34 మండలాలను కరువు మండలాలుగా సగటు వర్షపాతం ఆధారంగా ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోని 46 మండలాలు నెల్లూరు రూరల్‌తో సహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం కరువు తీవ్రతకు నిదర్శనం. మొత్తం మీద పెథాయ్ తుపాను కూడా నిరాశ పరచడంతో మళ్లీ తుపాను ఈ సీజన్లో పంటలకు పనికొచ్చేలా వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. -
తీరంలో భయం... భయం...
విజయనగరం, పూసపాటిరేగ: పెథాయ్ తుఫాన్ ధాటికి సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో తీరప్రాంతంలో ప్రజలు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. సముద్రాన్ని ఆనుకొని వున్న గ్రామాల్లో బలంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో సముద్రకెరటాలు ఉవ్వెత్తున ఎగసి గ్రామాలను తాకుతున్నాయి. గ్రామాన్ని ఆనుకొని వున్న గుడిసెలు ఎగిరిపోయాయి. తిప్పలవలసలో యాంకర్‌తో లంగరు వేసిన 5 పడవలు సముద్రంలోని కెరటాల థాటికి మునిగిపోయాయి. రాత్రి సమయంలోసముద్రం ముందుకు వస్తే ఒడ్డున నిలిపిన పడవలు కొట్టుకెళ్లే ప్రమాదం ఉందని పలువురు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి, సరుగుడు తోటలకు ఆపార నష్టం కలిగించింది. మండల పరిధిలో 300 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగి తీవ్రంగా నష్టపోయింది. కోనాడ, తిప్పలవలస గ్రామాల్లో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నారు. పులిగెడ్డ, పతివాడ బర్రిపేట, తమ్మయ్యపాలెంలో గ్రామ ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోనాడ గ్రామంలో పునరావాసకేంద్రాన్ని సందర్శించి బాధితులకు భోజన ఏర్పాట్లు చూశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నెలలు నిండిన కోనాడ గ్రామానికి చెందిన రోకళ్ల ఆదిలక్ష్మి అనే గర్భిణిని పూసపాటిరేగ పీహెచ్సీలో అత్యవసరంగా చేర్చడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. వాకీ టాకీల ద్వారా తిప్పలవలస, పతివాడబర్రిపేట గ్రామంలో రెడ్‌క్రాస్‌సొసైటీ సభ్యులు గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి అపాయం జరగకుండా ముందుస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోనాడ, తిప్పలవలస గ్రామంలో పూసపాటిరేగ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్యశిబిరాలు నిర్వహించారు. తిప్పలవలసలో డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, పతివాడబర్రిపేటలో జిల్లాపౌరసరఫరాల అధికారి ఎం.సుబ్బరాజు, చింతపల్లిలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1250, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 1080 కి.మీ. దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. అనంతరం ఇది శుక్రవారం నాటికి (పెథాయ్)తుపానుగా బలపడనుంది. తుపానుగా మారాక వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపింది. తుపానుగా బలపడ్డాక శుక్రవారం గంటకు 75 నుంచి 95 కిలోమీటర్లు, తీవ్ర తుపాను అయ్యాక శనివారం నుంచి 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోనూ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఈనెల 17న కోస్తాంధ్ర అంతటా కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. హైదరాబాద్‌లో చిరుజల్లులు.. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతమైంది. గురువారం చందానగర్, లింగంపల్లి, మాదాపూర్ సహా పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గురువారం నగరంలో గరిష్టంగా 31.2 డిగ్రీలు, కనిష్టంగా 19.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా డిసెంబరు రెండోవారంలో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మేర నమోదవుతాయి. కానీ కొన్నిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడానికి అల్పపీడన ప్రభావంతో పాటు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈనెలాఖరు నాటికి నగరంలో చలితీవ్రత పెరగవచ్చని ప్రకటించారు. -
‘టిట్లీ’ ముప్పు.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తుపాను, బలమైన గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారని సమాచారం. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. (చదవండి : ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్! ) రేపు, ఎల్లుండి విస్తారమైన వర్షాలు కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ’ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి ఈరోజు రాత్రి (మంగళవారం) లేదా రేపు ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిషా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ రోజు తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్!
-
ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. ఈమేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది. సోమవారం రాత్రికి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 620, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 650 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో పయనిస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని తీవ్రత పెరిగి బుధవారం నాటికి తుపానుగా మారి, ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుందని ఐఎండీ వివరించింది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్లు, తుపానుగా మారాక బుధ, గురు వారాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకోస్తా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తుపాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. -
ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక!
సాక్షి, విశాఖపట్నం : తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఈ తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి 310, గోపాల్‌పూర్‌కు 300 తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 60 నుండి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రపు అలలు సాధారణం కంటే 0.5మీటర్లు ఎగిసిపడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. -
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
విశాఖపట్నం : నైరుతి రుణపవనాల రాకతో బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ శనివారం ప్రకటనలో తెలిపింది. కోస్తా తీరంవెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదని వెల్లడించారు. -
విశాఖవాసులను భయపెడుతున్న మరో ముప్పు!
విశాఖ : హుదూద్ తుఫాన్ నుంచి తేరుకోకముందే విశాఖ వాసులను మరో ముప్పు భయపెడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మరింత బలపడి రేపు ఉదయంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాలో ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.