విశాఖపట్నం : నైరుతి రుణపవనాల రాకతో బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుంది. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ శనివారం ప్రకటనలో తెలిపింది. కోస్తా తీరంవెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment