
విశాఖవాసులను భయపెడుతున్న మరో ముప్పు!
విశాఖ : హుదూద్ తుఫాన్ నుంచి తేరుకోకముందే విశాఖ వాసులను మరో ముప్పు భయపెడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మరింత బలపడి రేపు ఉదయంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో కోస్తాలో ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.