బాల్య వివాహం జరిపిస్తే చర్యలు | severe punishment for child marriages | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం జరిపిస్తే చర్యలు

Published Thu, Aug 29 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

severe punishment for child marriages

తల్లాడ, న్యూస్‌లైన్:బాల్య వివాహం జరిపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఆర్‌జేడీ ఆర్.సూయజ్ హెచ్చరించా రు. ‘బాల్య వివాహాలు’ అనే అంశంపై తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఆమె మా ట్లాడారు. బాల్య వివాహాలను ప్రోత్సాహిం చిన.. ప్రేరేపించిన.. సహకరించిన వారిపై కూడా చర్య లు తీసుకుంటామని చెప్పారు. పదిమందికన్నా తక్కువ సంఖ్యలో పిల్లలున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని దగ్గరలోని కేంద్రంలో విలీనం చేయనున్నట్టు ఆర్‌జేడీ ఆర్.సూయజ్ తెలి పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందకపోతే వర్కర్, ఆయాపై చర్య ఉంటుం దని చెప్పారు. కార్యక్రమంలో జేడీ శ్యాం సుం దరి, పీడీ సుఖజీవన్‌బాబు, సీడీపీఓ వరలక్ష్మి, సూపర్‌వైజర్లు సత్యావతి, ఇందిరాదేవి, తల్లాడ సర్పంచ్ కోటా అరుణ పాల్గొన్నారు.
 
 ‘మన ఊరి పిల్లలు... మన పిల్లలు..’ భావనతోనూ బాల్య వివాహాల నిర్మూలన
 కొణిజర్ల: ‘మనఊరి పిల్లలంతా.. మన పిల్లలే..’ అని, ప్రతి ఒక్కరూ భావించినప్పుడే బాల్యవివాహ వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని ఐసీడీఎస్ కమిషనరేట్ జాయింట్ డెరైక్టర్ కె.శ్యామసుందరి చెప్పారు. ఆమె బుధవారం ఇక్కడ బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. బాల్య వివాహాల దుష్పరిణామాలపై ఐసీడీఎస్ ద్వారా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ‘గ్రామ బాలల సంరక్షణ కమిటీ’ పేరతో ఆరు నెలల క్రితం కమిటీలు కూడా వేశామని అన్నారు.
 
 పల్లెల్లోని బాల కార్మికులంతా పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. బడి బయటి పిల్లలంతా బడిలో ఉండేలా చూస్తే.. బాలకార్మికవ్యవస్థ అంతమవుతుందని అన్నా రు. ఐసీడీఎస్ వరంగల్ రీజియన్ జాయింట్ డెరైక్టర్(ఆర్‌జేడీ) ఆర్.సూయజ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో విసృ్తత ప్రచారం జరగాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జి.సుఖజీవన్‌బాబు, సీడీపీఓ జ్యోతిర్మయి, ఏసీడీసీఓ సంధ్య, జీసీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement