గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు చెబుతోంది ఐఎండీ శాఖ. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర - కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు తెలిపారు ఐఎండీ శాఖ అధికారులు.
రానున్న ఐదు రోజులు..
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా పెను తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి గంటకు 170 కి.మీ కంటే వేగాంగా బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వారు తెలిపిన వివరాల ప్రకారం తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ జూన్ 15 నాటికి గుజరాత్ పాకిస్తాన్ తీరాన్ని తాకే అవకాశముందన్నారు. గుజరాత్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి మరింత తీవ్రమవుతుందన్నారు.
అలెర్ట్.. అలెర్ట్..
కాబట్టి తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే పర్యాటక కేంద్రమైన తితాల్ బీచ్లో కెరటాల ఉధృతి ఎక్కువవడంతో పర్యాటకులు సందర్శించకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లోని జాలరులను వేటకు వెళ్లవద్దని కూడా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల వెంబడి అత్యవసర సేవలందించడానికి ముందుగానే విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపించారు.
ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?
Comments
Please login to add a commentAdd a comment