Cyclone Biparjoy
-
గుజరాత్‌ను వీడని బిపర్జోయ్
అహ్మదాబాద్/జైపూర్/గువాహటి/ సాక్షి, చెన్నై: బిపర్జోయ్ తుపాను వాయుగుండంగా మారడంతో గుజరాత్, రాజస్తాన్‌ల్లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ బనస్కాంత జిల్లా ధనేరా తాలుకాలో వరదలు సంభవించాయని అధికారులు సోమవారం తెలిపారు. 20 వరకు పశువులు కొట్టుకుపోయాయన్నారు. వచ్చే రెండు రోజుల్లో సౌరాష్ట్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. అదేవిధంగా, రాజస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలి, సిరోహి, బర్మేర్, జలోర్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న 265 మందిని యంత్రాంగం కాపాడింది. అజ్మేర్లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన వానకు స్థానిక జేఎల్ఎన్ ఆస్పత్రిలోకి వరద ప్రవేశించింది. 18 మంది రోగులను ఇతర వార్డులకు అధికారులు తరలించారు. రాజస్తాన్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం బుధవారం కల్లా బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో పంట పొలాలు, గ్రామాలు, పట్టణాలు నీటి ముంపునకు గురయ్యాయి. లఖింపూర్‌లోని 25,200 మంది సహా మొత్తం 33,400 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురువారం వరకు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరించింది. చెన్నైలో స్కూళ్లకు సెలవు ఆదివారం రాత్రి నుంచి తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతోపాటు చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. -
అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను తాజాగా రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. దీని ప్రభావం కారణంగా రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా మారుతోందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మత్స్యకారులు వెటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్, మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి బుధవారం వరకు తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పురోగతికి ఈ పరిస్థితులు అనుకూలంగా మారుతాయని తెలిపారు. బైపోర్‌జోయ్ గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది ఆ ప్రాంత ప్రజల రోజూవారి జీవనాన్ని స్తంభింపచేసింది. ముఖ్యంగా కచ్ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపింది. In 1999, a Super Cyclone that struck #Odisha claimed 10,000+ lives…back then, #india had only PSLV rocket& 4 sats Today, India has 50+ sats & 4 rockets, #BiparjoyCyclone barrels into #Gujarat and there’s 2 casualties That’s the power of #space #tech for you 🇮🇳🚀#isro #imd pic.twitter.com/2zhpyslRg5 — Sidharth.M.P (@sdhrthmp) June 16, 2023 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. సాధారణంగా ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. Fresh visuals of #BiparjoyCyclone hitting Kutch coastal areas of Gujarat with a wind velocity of approximately 145 kmph during #LANDFALL#Gujaratcyclone #BiparjoyUpdate #BiparjoyNews pic.twitter.com/IbshQG4LYW — BN Adhikari, IIS(Rtd) (@AdhikariBN) June 15, 2023 The Depression (Remnant of Cyclonic Storm ‘Biparjoy’) over central parts of South Rajasthan & neighbourhood at 2330 IST of 17th June, about 60 km SSW of Jodhpur. Very likely to continue to move ENE-wards and maintain the intensity of Depression till forenoon of 18th June. pic.twitter.com/CMb5sfee8H — India Meteorological Department (@Indiametdept) June 17, 2023 -
బిపర్జోయ్ పంజా రాజస్తాన్‌పై
జైపూర్/భుజ్: గుజరాత్ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను పక్కనే ఉన్న రాజస్తాన్‌పై ప్రతాపం చూపుతోంది. తుపాను దెబ్బకు గుజరాత్‌ను ఆనుకుని ఉన్న రాజస్తాన్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మౌంట్ అబూలో 210 మిల్లీమీటర్లు, సెడ్వాలో 136 మిల్లీమీటర్లు.. ఇలా తదితర ప్రాంతాల్లో తెరిపినివ్వకుండా వర్షం పడుతోంది. ఎడతెగని వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ బార్మెర్, జలోర్, సిరోహి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాలీ, జోధ్‌పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో తుపాను మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే సోమవారం దాకా వర్షాలు ఆగవని వారు వెల్లడించారు. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు రాష్ట్రంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధోల్పూర్ ప్రాంతంలో 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను కారణంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. జఖౌలో షా పర్యటన, పరామర్శ.. సొంత రాష్ట్రం గుజరాత్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. సహాయక కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అభినందించారు. జఖౌ, మండ్వీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. భుజ్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. తుపాను బీభత్సం నుంచి నెమ్మదిగా గుజరాత్‌లోని కఛ్ జిల్లా పట్టణాలు, గ్రామాలు కోలుకుంటున్నాయి. వరద నీరు నివాసాలు, రహదారులను వదలడంతో వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. గురువారం సాయంత్రం జఖౌ పోర్టులో తీరాన్ని తాకిన తుపాను భీకర రూపం దాల్చి కుండపోత వర్షాలతో ముంచెత్తడం తెల్సిందే. త్వరలో అది వాయుగుండం మారి బలహీనమవనుందని అధికారుల తెలిపారు. శనివారం సైతం బనస్కాంతా జిల్లా, పటాన్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పటాన్, మెహ్సానా, కఛ్ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆదివారం సైతం భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, మోర్బీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. -
దెబ్బకొట్టిన బిపర్జోయ్.. ఏపీకి మండుటెండల అలర్ట్
సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. -
ఢిల్లీపై బిపర్ జాయ్ తుఫాన్ ప్రభావం
-
బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం
జైపూర్/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ తీర ప్రాంతాన్ని వణికించిన బిపర్జోయ్ తుపాను బలహీనపడింది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ పొరుగు రాష్ట్రమైన రాజస్తాన్ వైపు మళ్లిందని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం వల్ల రాజస్తాన్‌లోని జలోర్, బార్మర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురువారం సాయంత్రం దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. జలోర్‌లో శుక్రవారం ఉదయానికల్లా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలియజేసింది. రెండు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జోథ్‌పూర్, జైసల్మేర్, పాలీ, సిరోహీ వైపు తుపాను పయనిస్తోందని, అక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం, శనివారం రాజ్‌సమంద్, దుంగార్పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా రాజస్తాన్ ప్రభుత్వం జైపూర్, కోట, భరత్పూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జోద్పూర్, బికనేర్ తదితర ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. అజ్మీర్ జిల్లాలోని కిషన్గఢ్కు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. చదవండి: తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో.. గుజరాత్లో ప్రాణ నష్టం సున్నా గుజరాత్లో బిపర్జోయ్ తుఫాను వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ శుక్రవారం చెప్పారు. వివిధ ప్రాంతాల్లో 23 మంది గాయపడ్డారని, దాదాపు 1,000 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదని ప్రకటించారు. గుజరాత్లో తుపాను కంటే ముందే ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. తుపాను హెచ్చరికలపై ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి, చేపట్టిన చర్యల వల్లే ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. కచ్ ప్రాంతంలో 40 శాతం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 500 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పక్కా ఇళ్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. 800 చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఇందుకోసం గుజరాత్ ఎస్డీఆర్ఎఫ్తో కలిసి పని చేస్తున్నామని వివరించారు. రహదారుల వ్యవస్థకు నష్టం జరగలేదన్నారు. సెల్‌ఫోన్ నెట్వర్క్ యథాతథంగా పని చేస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు గుజరాత్లో 8 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 1,000కి పైగా బృందాలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్బందర్ తదితర జిల్లాల్లో తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు చర్యలు చేపట్టడం, లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 707 మంది శిశువుల జననం గుజరాత్లో మంగళవారం సాయంత్రం నుంచి తుపాను కల్లోలం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలోని 8 జిల్లాల్లో 1,171 మంది గర్భిణులు ఉండగా, వీరిలో 1,152 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజుల్లో వీరిలో 707 మంది గర్భిణులకు వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితంగా ప్రసవం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. 707 మంది శిశువులు జన్మించారని పేర్కొంది. ► బిపర్జోయ్ అత్యంత తీవ్ర నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడింది. రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. ► తుపాను ధాటికి గుజరాత్‌లోని కచ్–సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం సాయంత్రం నాటికి 5,120 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 4,600 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటిదాకా 3,580 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 1,000కిపైగా గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది. ► దాదాపు 800 చెట్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా పలు రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ► గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ► ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని గుజరాత్ ప్రభుత్వం అభినందించింది. ► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అటవీ జంతువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు స్వచ్ఛంద సంస్థలు, మీడి యా సంస్థలు కూడా సహకారం అందించాయి. ► మరో 3 రోజులపాటు 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ► సీఎం భూపేంద్ర పటేల్ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ► పాకిస్తాన్‌లోనూ తీర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. దక్షిణ సింధూ ప్రావిన్స్ నుంచి 82,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
బిపర్ జోయ్: రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం.. పోర్టులో ఇరుక్కుపోయి..
గుజరాత్: బిపర్ జోయ్ తుఫాను గుజరాత్ తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడంతో గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని పోర్టులన్నిటి నుండి కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు. ముంద్రా, కండ్ల వంటి పోర్టుల నుండి రవాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఢిల్లీ నుండి గుజరాత్ వచ్చిన ట్రక్ డ్రైవర్ ఒకతను కండ్ల పోర్టులో ఇరుక్కుపోయాడు. తన ఇంటికి క్షేమ సమాచారం ఇవ్వడానికి కూడా వీలులేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయాడు. అతనిలాగే మరో ట్రక్ డ్రైవర్ తుఫాను ప్రభావంతో విద్యుత్తు నిలిచిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు కావాల్సిన సరుకులను ట్రక్ లో లోడ్ చేసుకుని అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఢిల్లీ నుంచి వచ్చి ఇరుక్కుపోయాను.. ఇస్మాయిల్ షేక్ అని ఒక డ్రైవర్ గురువారం ఢిల్లీ నుండి తన ట్రక్‌లో లోడ్ తీసుకొచ్చి కండ్ల పోర్టు వద్ద దించిన నాటి నుండి తుఫాను ఉధృతం కావడంతో ఎక్కడికీ కదల్లేక అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర ఉండిపోయాడు. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ లేక ఫోన్ డెడ్ అయిపొయింది. ఇంట్లో మావాళ్లు న గురించి కంగారుపడుతుంటారు. ముంద్రా నుండి మళ్ళీ లోడ్ ఎత్తుకుని హర్యానా వెళ్ళవలసి ఉండగా ఈ గాలులకు ఖాళీ బండితో రోడ్డు మీదకు వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో నాని భయంతో ఇక్కడే ఆగిపోయానని అంటున్నాడు. ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాను.. ఇదిలా ఉండగా విద్యుత్ నిలిచిపోయిన గ్రామాల్లో కరెంటును పునరుద్దీకరించడానికి అవసరమైన లోడును ఎక్కించుకుని మహమ్మద్ ఖాసం అనే మరో డ్రైవరు కూడా తుఫానులో ఇరుక్కుపోయాడు. అధికారులు ఆదేశమిస్తే తప్ప తానిక్కడ నుండి బయలుదేరలేని పరిస్థితుల్లో ఉన్నానన్నాడు. సమయం పడుతుంది.. వారం రోజులుగా గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న భీకర బిపర్ జోయ్ తుఫాను తీరాన్ని తాకింది. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులతో పాటు భారీ వర్షం కూడా పడుతుండడంతో ప్రజల జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సుమారుగా 1000 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలగడంతో ప్రజలు అంధకారంలోనే మగ్గుతున్నారు. గాలుల బీభత్సానికి రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు నేలకూలాయి. గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, తుఫాను ఉధృతి తగ్గకపోవడంతో పునరుద్ధరీకరణ పనుల్లో కొంత ఆలస్యమవుతోందని అంటున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు -
బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు
కఛ్(గుజరాత్): గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్జోయ్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్జోయ్ తుపాను గుజరాత్లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బిపర్జోయ్ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని పేర్కొంది. గుజరాత్ విధ్వంసం తర్వాత తుపాన్ రాజస్థాన్‌కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: గుజరాత్‌లోని కఛ్, సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లో కుంభవృష్టి కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది. #WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ — ANI (@ANI) June 16, 2023 తుపాను నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది. తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపింది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాలకు సైతం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా బిపర్జోయ్ తుపాను కారణంగా శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుఫాను పీడిత ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని ఆసల్యంగా నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దైన రైళ్ల జాబితా #WRUpdates #CycloneBiparjoyUpdate For the kind attention of passengers. The following trains of 16/06/2023 have been Fully Cancelled/Short-Originate by WR as a precautionary measure in the cyclone-prone areas over Western Railway.@RailMinIndia pic.twitter.com/NcxSLeqK7a — Western Railway (@WesternRly) June 16, 2023 -
గుజరాత్ తీరాన్ని దాటిన బిపర్ జాయ్ తుఫాన్
-
తీరాన్ని తాకిన భీకర బిపర్జోయ్
కఛ్(గుజరాత్)/న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా ప్రచండ వేగంతో సుడులు తిరుగుతూ భీకర గాలులతో పెను భయాలు సృష్టించిన బిపర్జోయ్ తుపాను ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు ఉన్న తుపాను కేంద్రస్థానం(సైక్లోన్ ఐ) సాయంత్రం 4.30 గంటలకు తీరాన్ని తాకగా పూర్తిగా తీరాన్ని దాటి భూభాగం మీదకు రావడానికి ఆరు గంటల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కఛ్ జిల్లాలోని జఖౌ పోర్ట్ సమీపంలో తీరం దాటి దాని ప్రతాపం చూపిస్తోంది. ఖఛ్, దేవభూమి ద్వారక, ఓఖా, నలియా, భుజ్, పోర్బందర్, కాండ్లా, ఆమ్రేలీ జిల్లాల్లో గురువారం ఉదయం నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కఛ్ జిల్లాలోని జఖౌ, మంద్వీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. నిర్మాణ దశలో ఉన్న చిన్నపాటి ఇళ్లు కూలిపోయాయి. గురువారం రాత్రి ఏడింటికి అందిన సమాచారం మేరకు ఎక్కడా ప్రాణనష్టం లేదని గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్‡్ష సంఘ్వీ చెప్పారు. దేవభూమి ద్వారక జిల్లాలో చెట్టు మీదపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ‘ కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్ జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముంపు ప్రాంతాల్లో వరద బీభత్సం ఉండొచ్చు. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌సరఫరా దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 14 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చు’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. నష్టం జరగొచ్చనే భయంతో ముందస్తుగా సముద్రప్రాంతంలో చమురు అన్వేషణ, నౌకల రాకపోకలు, చేపల వేటను నిలిపేశారు. నష్టం తగ్గించేందుకు.. తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంతమేర తగ్గించేందుకు ఎన్డీఆర్ఎఫ్ పలు చర్యలు తీసుకుంది. చేపల పడవల్ని దూరంగా లంగరు వేశారు. భారీ నౌకలను సముద్రంలో చాలా సుదూరాలకు పంపేశారు. ఉప్పు కార్మికులు, గర్భిణులుసహా లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4,000 భారీ హోర్డింగ్‌లను తొలగించారు. గుజరాత్, మహారాష్ట్రలో 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ చెప్పారు. ఎడతెగని వానలకు జలమయమయ్యే ముంపుప్రాంతాల ప్రజలను తరలించేందుకు రబ్బరు బోట్లను సిద్ధంచేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని పురమాయించారు. ఉత్తర దిశలో పంజాబ్ బఠిందాలో, తూర్పున ఒడిశాలో, దక్షిణాన చెన్నై అరక్కోణంలో ఇలా తుపాను ప్రభావం ఉండే అవకాశమున్న ప్రతీ చోటా వాయుసేన అప్రమత్తంగా ఉన్నారు. -
Cyclone Biparjoy: అరేబియాలో అల్లకల్లోలం రేపుతున్న బిపర్జాయ్ (ఫొటోలు)
-
గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం.. భీకర గాలులు, కుండపోత
ఢిల్లీ: మహోగ్ర రూపంతో దూసుకొచ్చిన బిపర్జాయ్ తుపాన్ కోట్ లఖ్‌పత్ సమీపంలో గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బిపర్జోయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆపై వాయుగుండంగా బలహీనపడుతుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్ ఉంది. గుజరాత్‌లోని సముద్ర తీరం వెంట ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. తుపాను తీరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దూసుకొచ్చే ఈ తుపాను తీరాన్ని పూర్తిగా దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర వివరించారు. 🌀 సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. 🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. అంచనాకు తగ్గట్లే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. 🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి. 🌀 సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది. #CycloneBiparjoy As the landfall process of Cyclone #Biparjoy commences, the shed of a petrol pump starts crumbling- WATCH.@rrakesh_pandey briefs about the destruction that has taken place on the ground. pic.twitter.com/pyS3nmXCy4 — TIMES NOW (@TimesNow) June 15, 2023 Video Credits: TIMES NOW -
Cyclone Biparjoy: మరికొన్ని గంటల్లో..
సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తరుముకొస్తున్న బిపర్జాయ్ తుపాను సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందా?.. ఆ పరిస్థితులను ఎదుర్కొగలమా? అనే ఆందోళన నెలకొంది అధికార యంత్రాగంలో. సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది. ఇప్పటికే ఆ రాష్ట్రం వెంట ఉన్న ప్రజల్లో.. లక్ష మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. అదే సమయంలో అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. 🌀 గంటకు 150 కిలోమీటర్లకు తగ్గకుండా వాయువేగంతో గుజరాత్ తీరం వైపుగా దూసుకొస్తోంది సైక్లోన్ బిపర్జాయ్. సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో దూసుకురానుంది ఇది. 🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. The dangerous encirclement of the storm coming towards #Gujarat Was caught on camera..... > > >#Kutch #Gujaratcyclone #GujaratWeather #CycloneBiporjoy #BiparjoyAlert #Biperjoy #BiparjoyUpdate #BiparjoyAlert #biporjoycyclone #NewsUpdate #cycloneBiperjoyupdate pic.twitter.com/SG4lCCJFgh — Gaurav Chauhan (@mrgauravchouhan) June 15, 2023 🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. 🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి. Outer bands of #CycloneBiparjoy lashing #Okha - #Dwarka#Rains and #Winds to increase from here , Very Heavy Rainfall for parts of #Saurashtra & #Kutch Then after weakening , system to give Heavy Rainfall in parts of W-S #Rajasthan from tomorrow pic.twitter.com/7ZiIdbMg06 — Weatherman Shubham (@shubhamtorres09) June 15, 2023 🌀 మత్స్యకారులను రేపటి వరకు సముద్రంలోకి అనుమతించబోమని ఇదివరకే అధికారులు తెలిపారు. 🌀 ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పశ్చిమ రైల్వే 76 రైళ్లను రద్దు చేసింది. ద్వారకా, సోమనాథ్ ఆలయాలను గురువారం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. బిపర్జాయ్ తుపానుతో పెను విధ్వంసం జరగొచ్చని ఐఎండీ ఇదివరకే హెచ్చరించింది. భారీ ఎత్తున్న అలలు ఎగసిపడే అవకాశం ఉండడంతో.. తీరం ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. మరింత మందకొడిగా తుపాన్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతంలో తుపాను తీరం దాటనుంది. -
భయానకంగా బిపర్జోయ్: సాయంత్రం తీరాన్ని తాకనున్న తుపాను
మంద్వీ/అహ్మదాబాద్: అహ్మదాబాద్: బిపర్జాయ్ తుపాను నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్‌లో ఉన్న జఖౌ పోర్టు జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్జాయ్ తుఫాను పయణిస్తున్నదని తెలిపింది. దీనిప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. బిపర్జోయ్ తుపాను అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడనుంది. తీరం దాటక ముందే తుపాను ధాటికి గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే తీరప్రాంతలు, తుపాను ప్రభావిత జిల్లాల్లో 74వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టి ఖాయమని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్ జిల్లాల్లో బుధవారం ఉదయంకల్లా 24 గంటల్లో 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. ఒకటి రెండు చోట్ల ఏకంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రంలో తుపాను కేంద్రబిందువు కాస్తంత దిశ మార్చుకుని ఈశాన్యవైపుగా కదులుతూ కఛ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో గురువారం సాయంత్రం తీరం దాటి బీభత్సం సృష్టించనుందని వెల్లడించింది. चक्रवाती तूफान ‘बिपरजॉय’ को लेकर अलर्ट तूफान ‘बिपरजॉय’ गुजरात तट से टकराएगा आज शाम तक गुजरात तट से टकराएगा तूफान 150किमी/घंटे की रफ्तार से हवा चलने के आसार तूफान के चलते गुजरात की 69 ट्रेन रद्द गुजरात में NDRF की 17, SDRF की 12 टीमें तैनात#GujratNews #CycloneBiparjoy #Biparjoy pic.twitter.com/kXWrLjC65O — Khabrain Abhi Tak News Channel (@KhabrainAbhiTak) June 15, 2023 పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్‌సహా ఇతర సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ అహ్మదాబాద్ డైరెక్టర్ మనోరమ మొహంతీ అంచనావేశారు. తీరం దాటేటపుడు గంటకు 150 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను విలయం ఊహించని రీతిలో ఉంటే దానికి తగ్గ సహాయక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆదేశించారు. వందల కొద్దీ సహాయక బృందాలు ‘ప్రస్తుతం తుఫాను కేంద్రబిందువు కచ్ తీరానికి 200 కి.మీ.ల దూరంలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 18, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన దాదాపు 400 బృందాలను రంగంలోకి దింపాం ’ అని స్టేట్ రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే చెప్పారు. మరోవైపు సిబ్బంది సన్నద్దతపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమీక్షా సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిని తెల్సుకున్నారు. తీరానికి దూరంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను సహాయక శిబిరాలుగా మార్చారు. ఆహారం, తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తగినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. భుజ్ చేరుకొని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం తుపాను వేళ వైద్యసేవలపై సమీక్ష జరిపారు. అరేబియా సముద్రంలో ఆరో తేదీన చిన్నదిగా మొదలైన తుపాను నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ శక్తిని పెంచుకుంటూ 11వ తేదీనాటికి భీకరంగా మారింది. ప్రచండ శక్తితో గుజరాత్, పాకిస్తాన్ తీరాల వైపు దూసుకొస్తోంది. జఖౌ పోర్టు సమీపంలో తీరాన్ని దాటి జనావాసాలపై తన పెనుప్రతాపం చూపనుంది. हम भारत वाले किसी चक्रवात वक्रवात से नही डरते...."सबका तोड़ हैं हमारे पास" 🤗🤗🤣🤣 मौसम विभाग भी हमारे हौंसले देखकर हैरान रह जायेगा,#CycloneBiporjoy pic.twitter.com/uO2WiegNFX — छोटा ट्रम्प parody ac😎✌️ (@Chota_trump) June 14, 2023 నేడు విశాఖ నుంచి బయల్దేరే దిఘా (22874) ఎక్స్ ప్రెస్ రద్దు నేడు షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్టు (18045) ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు. రేపు సికింద్రాబాద్ - షాలిమార్ (22850) ఎక్స్ ప్రెస్.. ప్రశాంతి నిలయం - హావ్ డా (22832) ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే రద్దు చేసింది. The dangerous encirclement of the storm coming towards #Gujarat Was caught on camera.... 🌀🌀#Kutch #Gujaratcyclone #GujaratWeather #CycloneBiporjoy #BiparjoyAlert #Biperjoy #BiparjoyUpdate #BiparjoyAlert #biporjoycyclone #NewsUpdate #cycloneBiperjoyupdate pic.twitter.com/UIkFPCWLL4 — ❢ ▬❤️ℜαhบl やαnchαℓ❤️▬ ❢ (@itz_silentking) June 15, 2023 -
సైక్లోన్ బిపర్‌జోయ్‌తో 8 రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
సైక్లోన్ బిపర్జోయ్ గురువారం సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. అప్రమత్తత చేస్తూ వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా గుజరాత్ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎనిమిది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. బిపర్జోయ్ ఇవాళ పోర్బందర్, ద్వారకా వద్ద తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం జఖావూ పోర్ట్ వద్ద తీరం దాటోచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే క్రమంలో గురువారం సౌరాష్ట్ర, కచ్‌పై విరుచుకుపడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాదాపు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించింది. బిపర్జోయ్ తుపాను కారణంగా.. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌లకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజులపాటు అంటే జూన్ 15 నుంచి 17 మధ్య ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 38 వేల మందిని సముద్ర తీరం నుంచి ఖాళీ చేయించినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య 44వేలదాకా ఉంటుందని క్షేత్రస్థాయిలోని అధికారులు అంటున్నారు. 1965 నుంచి ఇప్పటిదాకా గుజరాత్‌ను తాకిన మూడో తుపానుగా బిపర్జోయ్ నిలవనుంది. ముంబైలో అలర్ట్ బిపర్జోయ్ కారణంగా ఇప్పటికే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. పశ్చిమ రైల్వేలో పలు రైలు రద్దుకాగా, కొన్నింటిని ఆయా మార్గాల్లో కుదించి నడుపుతున్నారు. #WATCH | Visuals from Jakhau Port in Bhuj, where a large number of boats have been parked as fishing has been suspended in the wake of #CycloneBiparjoy. Cyclone 'Biparjoy' is expected to cross near Gujarat's Jakhau Port by the evening of 15th June pic.twitter.com/KA7OKJE68O — ANI (@ANI) June 14, 2023 #WATCH | High tide waves hit Mumbai as cyclone 'Biporjoy' intensifies (Visuals from Gateway of India) pic.twitter.com/C1vhrHiWZS — ANI (@ANI) June 14, 2023 Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY — India Meteorological Department (@Indiametdept) June 14, 2023 #WATCH | High tide waves hit Gujarat as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm (Visuals from Dwarka) pic.twitter.com/4c8roLFre1 — ANI (@ANI) June 14, 2023 ఇదీ చదవండి: బిపర్జోయ్ డ్యామేజ్ ఏ రేంజ్లో జరుగుతుందంటే.. -
భారీ విధ్వంసం.. అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్జోయ్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపర్జోయ్ తుపాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బిపర్జోయ్ మంగళవారం అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుపానుగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15 సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ‘కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్ జిల్లాల్లో ఈనెల 13– 15 తేదీల మధ్య అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురియవచ్చు. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తి, తీవ్ర నష్టం కలిగించవచ్చు’అని ఐంఎడీ హెచ్చరించింది. ‘రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో ఈ నెల 15 వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అలలు సౌరాష్ట్ర, కచ్ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తవచ్చు’అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాకు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటిన తుపాను బలహీనపడి, తన గమనాన్ని దక్షిణ రాజస్తాన్ వైపు మార్చుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 15–17 తేదీల్లో ఉత్తర గుజరాత్లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఈ సీజన్లో ఏర్పడిన మొట్టమొదటి తుపాను బిపర్జోయ్..సముద్ర జలాల అసాధారణ వేడి వల్లే ఎన్నడూ లేనంత సుదీర్ఘకాలం పాటు తుపాను కొనసాగిందని ఐఎండీ వివరించింది. ఈ నెల 6న ఏర్పడిన ఈ తుపాను మంగళవారం నాటికి 8 రోజుల 9 గంటలపాటు కొనసాగిందని తెలిపింది. 30 వేల మంది తరలింపు బిపర్జోయ్ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలోకి తరలించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా మూడు రైళ్లను రద్దు చేయడంతోపాటు 55 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించినట్లు పశి్చమ రైల్వే తెలిపింది. సముద్రంలో ఓ ఆయిల్ రిగ్‌పై పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని సోమవారం రాత్రి బయటకు తీసుకువచ్చారు. కాండ్లా పోర్టును మూసివేశారు. అక్కడ పనిచేసే 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన్సుఖ్ మాండవీయ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బిపర్‌జోయ్‌తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్‌లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
అల్ల కల్లోలంగా మారిన తుపాన్.. గుజరాత్లో హై అలర్ట్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అత్యంత తీవ్రంగా మారిన బిపర్జోయ్ తుపాను ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అరేబియా సముద్ర తీర ప్రాంత జిల్లాలైన కచ్, పోరుబందర్, ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. ‘ 15వ తేదీ మధ్యాహ్నానికి బిపర్జోయ్ తుపాను జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఆ సమయంలో గంటకు గరిష్టంగా దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అతి భారీ వర్షాలు కురుస్తాయి’అని గుజరాత్‌లోని ఐఎండీ కేంద్రం డైరెక్టర్ మనోరమ మహంతి చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేయడంతోపాటు 16వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. గుజరాత్లో పాఠశాలలకు ఈనెల 15 వరకు సెలవులు ప్రకటించారు. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్–సౌరాష్ట్ర జిల్లాల్లో తీరానికి 10 కిలోమీటర్లలోపు దూరంలోని గ్రామాల వారిని మంగళవారం నుంచి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉండే సుమారు 10 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలో ఉంచుతామని కచ్ కలెక్టర్ అమిత్ అరోరా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 12 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తక్షణమే చర్యలు తీసుకోండి: ప్రధాని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘తుపాను ప్రభావంతో విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సౌకర్యాలకు ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పునరుద్ధరించాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. ఇందుకు గాను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపింది. తపానుతో ఉత్పన్నమైన పరిస్థితులను తెలుసుకునేందుకు హోం శాఖ రాష్ట్ర యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉంటుందని పీఎంవో వివరించింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, ఐఎండీ డీజీ మృత్యుంజయ్ తదితరులు హాజరయ్యారు. -
Cyclone Biparjoy: రాకాసి అలలు.. అంతటా హైఅలర్ట్
ముంబై/ అహ్మదాబాద్: తీవ్ర తుపాను కాస్త అతితీవ్ర తుపాన్‌గా మారే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో మొదలైన బిపర్జోయ్ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు విమానలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక బిపర్జాయ్ తుపాన్ గుజరాత్ వైపు వేగంగా వెళ్తోంది. జూన్ 15వ తేదీన గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. జూన్ 15వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి. గుజరాత్ లోని మాండవి- పాకిస్థాన్ లోని కరాచీల మధ్య బిపోర్ జాయ్ తీరందాటనున్న నేపథ్యంలో సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తీరాన్ని తాకే సమయంలో తీరంవెంబడి 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లలో ఇది రెండవ బలమైన తుపానుగా పేర్కొంది. మరోవైపు బిపర్జోయ్ ఎఫెక్ట్‌తో బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అది అధికారికంగా బిపర్జోయ్దేనా ధృవీకరణ కావాల్సి ఉంది. Cyclone Biporjoy in Gujarat: દરિયાકિનારે પ્રિ-તોફાન શરુ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી... | Gujarat Tak https://t.co/gF6v28jDIA — Gujarat Tak (@GujaratTak) June 12, 2023 As the #CycloneBiparjoy is frowning to hit on Gujarat coast on 15th June, let's know the name of cyclones to thwack impending. https://t.co/AeOQBtWG3t#CycloneBiparjoy#Cyclone #CycloneAlert #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #scicomm #Cyclones #tropicalcyclones pic.twitter.com/AwLMcMpZ4z — TUHIN SAJJAD SK (@TUHINSAJJADSK1) June 12, 2023 🚨 This video depicts Ganpatipule Beach in Ratnagiri during the occurrence of Cyclone Biparjoy. The intensity of the sea waves is extremely High.#CycloneBiperjoy #viral2023 pic.twitter.com/tfWGQABUzK — Top Notch Journal (@topnotchjournal) June 11, 2023 -
బిపర్జోయ్ తుపాను మహోగ్రరూపం
బిపర్జోయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. ఇది మరో 10 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం కనబడుతోంది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గుజరాత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసిననప్పటికీ సౌరాష్ట్ర, కచ్ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బిపర్జోయ్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరొకవైపు ఈ తుపాను ప్రభావంతో రానున్న ఐదు రోజులపాలు గుజరాత్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కర్ణాటక, గోవా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. వాతావవరణ శాఖ సైక్లోన్ అలర్ట్ జారీ చేయడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారే దృష్ట్యా అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డీజీపీ వికాస్ సహాయ్, రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. - ఉదయ్ కుమార్, సాక్షి వెబ్‌డెస్క్ -
గుజరాత్ అలెర్ట్.. తీవ్రరూపం దాల్చనున్న బిపర్ జాయ్ తుఫాను
గుజరాత్ సమీపంలో కేంద్రీకృతమైన బిపర్ జాయ్ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు చెబుతోంది ఐఎండీ శాఖ. రాబోయే ఐదు రోజుల్లో సౌరాష్ట్ర - కచ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 180 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు తెలిపారు ఐఎండీ శాఖ అధికారులు. రానున్న ఐదు రోజులు.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా పెను తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి గంటకు 170 కి.మీ కంటే వేగాంగా బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వారు తెలిపిన వివరాల ప్రకారం తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ జూన్ 15 నాటికి గుజరాత్ పాకిస్తాన్ తీరాన్ని తాకే అవకాశముందన్నారు. గుజరాత్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అల్పపీడనం అంతకంతకు బలపడి బుధవారం నాటికి మరింత తీవ్రమవుతుందన్నారు. అలెర్ట్.. అలెర్ట్.. కాబట్టి తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే పర్యాటక కేంద్రమైన తితాల్ బీచ్‌లో కెరటాల ఉధృతి ఎక్కువవడంతో పర్యాటకులు సందర్శించకుండా తాత్కాలికంగా నిలిపివేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లోని జాలరులను వేటకు వెళ్లవద్దని కూడా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల వెంబడి అత్యవసర సేవలందించడానికి ముందుగానే విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపించారు. ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? -
గుజరాత్‌కు ‘బిపర్జోయ్’ ముప్పు లేనట్లే: ఐఎండీ
అహ్మదాబాద్: గుజరాత్‌కు ‘బిపర్జోయ్’ తుపాను ముప్పుతప్పినట్లేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుపాను మరో 12 గంటల్లో అత్యంత భీకర తుపానుగా మారే ప్రమాదముందని తెలిపింది. ప్రస్తుతం ఇది గుజరాత్‌లోని పోర్బందర్కు 600 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగాను, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉత్తర–వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీంతో, వచ్చే అయిదు రోజుల్లో గుజరాత్‌కు తుపాను ముప్పు తప్పినట్లేనని వెల్లడించింది. దీని ప్రభావంతో కచ్–సౌరాష్ట్ర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. -
ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను
బిపర్ జోయ్ తీవ్ర తుపానుగా మారబోతోందా..? కేంద్ర వాతావరణ శాఖ ఏమని హెచ్చరిస్తోంది..? దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది..? అసలు బిపర్ జోయ్ అంటే ఏంటి..? అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందంటూ ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్ లోని తిథాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని... సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని తెలిపారు. మరోవైపు, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలని పశ్చిమ తీరంలోని అన్ని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బిపర్ జోయ్ అని బంగ్లాదేశ్ సూచించిన పేరు అదలా ఉంటే.. ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది.. ఈ క్రమంలోనే.. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. బిపర్ జాయ్ అంటే విపత్తు అని దీని అర్థం. మరి ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. -
ముంచుకొస్తున్న 'బిపర్ జోయ్' తుఫాను..అలర్ట్ చేసిన వాతావరణ శాఖ!
అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్ జోయ్ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్ చేసింది. జూన్ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. నిజానికి ఈ బిపర్ జోయ్ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది. (చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు)