అహ్మదాబాద్: గుజరాత్‌కు ‘బిపర్‌జోయ్’ తుపాను ముప్పుతప్పినట్లేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుపాను మరో 12 గంటల్లో అత్యంత భీకర తుపానుగా మారే ప్రమాదముందని తెలిపింది. ప్రస్తుతం ఇది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
రానున్న 24 గంటల్లో ఈశాన్య దిశగాను, ఆ తర్వాత మూడు రోజుల్లో ఉత్తర–వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీంతో, వచ్చే అయిదు రోజుల్లో గుజరాత్‌కు తుపాను ముప్పు తప్పినట్లేనని వెల్లడించింది. దీని ప్రభావంతో కచ్–సౌరాష్ట్ర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment