Cyclone Biparjoy News: IMD DG Predicts Severe Damage - Sakshi
Sakshi News home page

అరేబియా అల్లకల్లోలం.. 150KMPH గాలులు.. బిపర్‌జోయ్‌తో ఊహించని డ్యామేజ్‌ తప్పదన్న ఐఎండీ

Published Tue, Jun 13 2023 6:53 PM | Last Updated on Tue, Jun 13 2023 7:16 PM

Cyclone Biparjoy News: IMD DG Predicts Severe Damage - Sakshi

వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్‌జోయ్‌ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అయితే బిపర్‌జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. 

గురువారం కచ్‌, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, జునాఘడ్‌, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని,  తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. 

ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా..  అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్‌ కోస్టల్‌ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. 

జూన్‌ 6వ తేదీ నుంచి బిపర్‌జోయ్‌ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్‌ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. 

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ ఉదయం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. 

జూహూ బీచ్‌లో విషాదం

ఇదిలా ఉంటే.. సైక్లోన్‌ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement