India Meteorological Department Director
-
నవంబర్లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
బిపర్జోయ్తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్భూమి ద్వారకా, జామ్నగర్, పోర్బందర్, రాజ్కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్జోయ్తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
ఈసారి వర్షపాతం తక్కువే!
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఈ సారి వర్షపాతం సగటు కన్నా తక్కువగా ఉంటుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంలో జరిగిన ఆలస్యంతో పాటు ‘ఎల్నినో’ వాతవరణ పరిస్థితులను అందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే సగటు కన్నా 44% తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోర్ వెల్లడించారు. ‘ఎల్నినో’ వాతావరణ పరిస్థితి జులై చివర్లో, ఆగస్టు మొదట్లో తీవ్రంగా ఉండొచ్చన్నారు. ఇప్పటివరకైతే అది బలహీనంగానే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. జూన్ 14 వరకు నైరుతి రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ నెలల మధ్య రుతుపవన వర్షపాతం సగటు కన్నా తక్కువగా.. 93 శాతమే ఉండొచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోతే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సీడీకి డీజిల్, అదనంగా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ తెలిపారు. అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికితోడు విశాఖ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందంది. ఉష్ణోగ్రతల్లో కూడా సోమవారం వ్యత్యాసాలు నెలకొన్నాయి.