ఈసారి వర్షపాతం తక్కువే! | This time rainfall is low! | Sakshi
Sakshi News home page

ఈసారి వర్షపాతం తక్కువే!

Published Tue, Jun 10 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

This time rainfall is low!

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఈ సారి వర్షపాతం సగటు కన్నా తక్కువగా ఉంటుందని  ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంలో జరిగిన ఆలస్యంతో పాటు ‘ఎల్‌నినో’ వాతవరణ పరిస్థితులను అందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే సగటు కన్నా 44% తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్‌ఎస్ రాథోర్ వెల్లడించారు. ‘ఎల్‌నినో’ వాతావరణ పరిస్థితి జులై చివర్లో, ఆగస్టు మొదట్లో తీవ్రంగా ఉండొచ్చన్నారు. ఇప్పటివరకైతే అది బలహీనంగానే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. జూన్ 14 వరకు నైరుతి రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ నెలల మధ్య రుతుపవన వర్షపాతం సగటు కన్నా తక్కువగా.. 93 శాతమే ఉండొచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోతే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సీడీకి డీజిల్, అదనంగా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్  తెలిపారు.
 అల్పపీడన ద్రోణి
 సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికితోడు విశాఖ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందంది. ఉష్ణోగ్రతల్లో కూడా సోమవారం వ్యత్యాసాలు నెలకొన్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement